జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ.. 137 రోజుల తర్వాత..
విజయవాడ సబ్ జైలు నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విడుదలయ్యారు.. ఫిబ్రవరి 16వ తేదీన హైదరాబాద్‌లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన విజయవాడ పటమట పోలీసులు.. హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించారు.. వల్లభనేని వంశీని బెదిరింపులు, కిడ్నాప్ కేసులో అరస్ట్ చేసిన ఆ తర్వాత వరుసగా 11 కేసులు నమోదు అయ్యాయి.. దీంతో, ఫిబ్రవరి 16వ తేదీ నుంచి నేటి వరకు 137 రోజుల జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ.. ఇక, జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీకి విజయవాడ సబ్ జైలు దగ్గర స్వాగతం పలికారు ఆయన సతీమణి పంకజ శ్రీ, వైసీపీ కృష్ణ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్, పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జ్ దేవ భక్తుని చక్రవర్తి.. పలువురు వైసీపీ శ్రేణులు, వంశీ అభిమానులు..
వల్లభనేని వంశీ అరెస్ట్ సునకానంద చర్య.. పేర్ని నాని ఫైర్..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్.. 137 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.. విజయవాడ సబ్ జైల్ దగ్గర ఆయనకు స్వాగతం పలికిన మాజీ మంత్రి పేర్నినాని.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. వల్లభనేని వంశీ అరెస్ట్ సునకానంద చర్యగా పేర్కొన్నారు.. ప్రభుత్వం కక్షపూరితంగా ఎన్ని కేసులు పెట్టి.. ఇలా వేధించినా.. వల్లభనేని వంశీ మాత్రం గన్నవరం వదిలి పారిపోడు అని స్పష్టం చేశారు.. వంశీ గన్నవరంలోనే ఉంటాడని పేర్కొన్నారు.. ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల చర్యల ద్వారా వంశీకి ఏడాదిలోనే ప్రజల్లో సానుభూతి వచ్చింది.. వంశీపై చర్యల ద్వారా గన్నవరంలో అధికార పార్టీని గోతిలో పాతేసినట్టే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
మరో వారం రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన..
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు దంచికొడుతున్నరాయి.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు, మన్యం., ఏలూరు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో మరికొన్ని రోజులు మోస్తరు వానలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చ రికల కేంద్రం వెల్లడించింది. ఇక, దక్షిణ ఝార్ఖండ్ మీద అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతోంది. మరోవైపు బికనీర్ నుంచి సెంట్రల్ ఇండియా మీదుగా
తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించింది. వీటన్నింటి సానుకూలత వల్ల వారం రోజుల పాటు వానల ప్రభావం వుండనుంది. ఇక తీరం వెంబడి గంటలకు 45 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అలజడిగా మారింది. మత్స్యకారుల వేటను నిషేధించారు. ఇక, గడచిన 24 గంటల్లో వేలేరుపాడులో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కూనవరంలో 9, కుకనూరులో 8, చింతూరులో ఐదు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు విశాఖ తుఫాన్ హెచ్చ రికల కేంద్రం అధికారులు..
ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా… కారణం ఇదేనంటూ లేఖ..!
ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు.. ఆయనకు ఇంకా సర్వీస్ ఉండగానే రాజీనామా చేశారు ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్.. స్వచ్ఛందంగా ఐపీఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతో రాజీనామా అంటూ లేఖలో పేర్కొన్నారు.. ఇది నా వ్యక్తిగత నిర్ణయం, ఎటువంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.. కొన్ని కథనాల్లో వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అంటూ కొట్టిపారేశారు.. తన రాజీనామాకు ఎలాంటి బలవంతం, వేధింపులు లేవని లేఖలో పేర్కొన్నారు.. ఇక, తన జర్నీలో సహకరించిన ప్రభుత్వానికి, సహచరులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్.. అంతే కాదు, రాబోయే రోజుల్లో సమాజానికి కొత్త మార్గాల్లో సేవలు అందించనున్నట్టు పేర్కొన్నారు.. తాను ఐపీఎస్ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.. తన రాజీనామా లేఖను రాష్ట్ర డీజీపీకి పంపినట్లు వెల్లడించారు.. తాను ఐఐఎం (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్) విద్యార్థిని.. తనకు మంచి ఆఫర్ రావడంతో ఈ ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు వివరణ ఇచ్చారు సిద్ధార్థ్ కౌశల్.. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాను.. ఆంధ్రప్రదేశ్.. తనకు సొంత రాష్ట్రంగా పరిగణిస్తానని చెప్పుకొచ్చారు సిద్ధార్థ్ కౌశల్…
గోదావరి నీళ్లను ఆంధ్రా వాళ్లు ఎత్తుకుని పోతున్నారు.. కవిత హాట్ కామెంట్స్..!
ఖమ్మం జిల్లా వైరాలో బీఆర్‌ఎస్ నేత మదన్ లాల్ నివాసంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మదన్ లాల్ మరణం ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటుగా పేర్కొన్నారు. రెండు నెలల క్రితం వారి కుటుంబంలో మరో విచారకర ఘటన చోటుచేసుకున్నదని గుర్తుచేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా కవిత, “వైరా నియోజకవర్గంలో మళ్లీ బీఆర్ఎస్ జెండాను ఎగురదిద్దాం” అని కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
రాష్ట్రంలో యూరియా కొరత.. మరోమారు కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల..!
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని యూరియా కొరతపై కేంద్ర ప్రభుత్వానికి మళ్లీ లేఖ రాశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో యూరియా డిమాండ్ పెరుగుతున్నదని, అయినా సరఫరాలో తీవ్ర లోటు ఉందని మంత్రి తన లేఖలో స్పష్టం చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకుగాను కేంద్రం రాష్ట్రానికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కోటా కేటాయించినప్పటికీ.. ఇప్పటి వరకు కేవలం 3.06 లక్షల టన్నులే సరఫరా అయ్యాయని తెలిపారు. దీంతో దాదాపు 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడిందని, ఇది రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు.
సీఎంకు అండగా ఉండటం తప్ప ఇంకో ఆప్షన్ లేదు: డీకే శివకుమార్
కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పీఠంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వివాదం రోజురోజుకూ ముదిరిపోతుంది. సీఎం పదవి నుంచి సిద్ధ రామయ్యను తప్పించి డీకే శివకుమార్ కు అప్పగించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఇక, తాజాగా కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కొన్ని రోజులుగా వినిపిస్తోన్న వ్యాఖ్యలకు తెర పడింది. ఐదేళ్లు తానే కర్ణాటక సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా. మీకెందుకు అలాంటి డౌట్స్ ఉన్నాయి? అని మీడియాను ప్రశ్నించారు. అలాగే, నాయకత్వ మార్పు గురించి విపక్ష పార్టీలు బీజేపీ, జేడీఎస్ చేస్తోన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా సిద్ధరామయ్య కొట్టిపారేశారు. వారేమైనా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానమా అని ప్రశ్నించారు.
ఈ రాత్రి UPI స్టాప్.. సిద్ధంగా ఉండండి..! ఈ బ్యాంక్ ఖాతాదారులకే
ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ HDFC బ్యాంక్ తన ఖాతాదారులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. జూలై 3 రాత్రి నుంచి జూలై 4 వేకువజామున వరకు కొన్ని గంటల పాటు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. సర్వర్ నిర్వహణ పనుల కారణంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బ్యాంక్ అధికారికంగా వెల్లడించింది. బ్యాంక్ ప్రకారం.. జూలై 3వ తేదీ రాత్రి 11:45 గంటల నుంచి జూలై 4వ తేదీ ఉదయం 01:15 గంటల వరకు అంటే 90 నిమిషాల పాటు సేవలకు అంతరాయం కలుగుతుంది. ఈ సమయంలో UPI ద్వారా లావాదేవీలు చేయలేరు. ఈ పనులు ప్రధానంగా HDFC బ్యాంక్ సేవింగ్స్/కరెంట్ ఖాతా, RuPay డెబిట్ కార్డ్ ఆధారిత UPI లావాదేవీలపై ప్రభావం చూపనున్నాయి. అంతేకాదు, HDFC నెట్ బ్యాంకింగ్‌కు మద్దతు ఇచ్చే TPAP ప్లాట్‌ఫారాలు, వ్యాపారుల లావాదేవీలు కూడా తాత్కాలికంగా ప్రభావితమవుతాయి.
ఆర్సీబీ ఫ్రాంచైజీకి భారీ షాక్..
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన సంగతి మనకు తెలిసిందే. 17 ఏళ్లుగా సాధ్యం కానీ ట్రోఫీని 18వ సీజన్లో ముద్దాడింది. దీంతో 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆర్సీబీ ప్లేయర్లకు ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతేకాదు ఆర్సీబీ ట్రోఫీని గెలిచిన తర్వాత ఆ మూమెంట్స్ ని ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఎన్నో ఏళ్లుగా ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. అయితే, చివరికి వాటన్నిటిని అధిగమించి కప్పుని సొంతం చేసుకున్నారు.
ఆసియాకప్ లో ఇండియా పాక్ మ్యాచ్ డేట్ రిలీజ్
క్రికెట్లో టీమిండియా ఎక్కడ ఆడినా ఆదరణ లభిస్తుంది. మరి ముఖ్యంగా ఆసియా కప్ లాంటి టోర్నమెంట్లలో అయితే ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. దానికి కారణం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అవును ఆసియాకప్ లో ఇరుజట్లు 2 సార్లు తలపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరింత రసవత్తరంగా సాగుతుంది.పైగా ఆసియాలోనే ఇవి రెండు బలమైన జట్లు. అందుకే రెండు లేదా 3 సార్లు తలపడే ఛాన్స్ ఉంటుంది. నిజంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఇటు చూసే మ్యాచ్ ఇది. ఎప్పుడు ఈ దాయాది పోరు జరిగినా,నరాలు తెగే ఉత్కంఠ లాస్ట్ బాల్ వరకు ఉంటుంది. ఇప్పుడు అలాంటి మరో టోర్నీ రాబోతుంది. అవును ఆసియా కప్ 2025 ని సెప్టెంబర్ లో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికి సోనీ టీవీ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.ఇక జులై మొదటి వారంలో షెడ్యూల్ ను రిలీజ్ చేసే అవకాశం వుంది.ఇదిలా ఉండగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇక ఈ జట్లు తలపడే ఛాన్సులు మూసుకుపోయినట్టే అని భావించారు. ఎందుకంటే బీసీసీఐ కూడా ఐసీసీకి ఒక లేఖ రాసింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 జట్లను ఒకే గ్రూపులో పెట్టవద్దని.. మరి ఇప్పుడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈ లీగ్ నిర్వహిస్తోంది కాబట్టి రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉంటుందా అనే అనుమానాలు వున్నాయి.అంతేకాదు కొద్దీ రోజుల క్రితం ఇండియా ఆసియా కప్ నుండి తప్పుకోనున్నట్లు వార్తలొచ్చాయి.
మొహమ్మద్ షమీకి షాకిచ్చిన హైకోర్ట్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ చాలా సందర్భాల్లో జట్టును గెలిపించాడు. ఐసీసీ టోర్నీల్లో కూడా టీమిండియాకు మంచి ప్రదర్శన చేసాడు. తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయాలలో కూడా కీ రోల్ పోషించాడు. అయితే తన క్రికెట్ కేరీర్ బాగానే వున్నా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు వున్నాయి.ముఖ్యంగా భార్యతో విడాకులు గొడవ తనను కృంగదీసింది. ఇప్పుడు అదే విషయంలో షమీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. మొహమ్మద్ షమీ, తన భార్య హసీన్ జహాన్ 2014లో వివాహం చేసుకున్నారు. 2015లో వీరికి ఒక కుమార్తె ఐరా జన్మించింది. అయితే 2018 నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో హసీన్ జహాన్, షమీపై గృహ హింస, కట్నం వేధింపులు, ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు మరియు మ్యాచ్ ఫిక్సింగ్ వంటి తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, షమీపై కేసు నమోదైంది. అప్పట్లో బీసీసీఐ కూడా ఈ ఆరోపణలపై విచారణ జరిపింది. అయితే తరువాత షమీకి క్లీన్ చిట్ ఇచ్చింది.కానీ ఇప్పటికి ఈ విడాకులు కేసు నడుస్తూనే వుంది.
దిల్ రాజు కాంపౌండ్ నుంచి రానున్న సినిమాలివే!
దిల్ రాజు నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. అయితే ఆయన ఇప్పుడు వరుస సినిమాలు మళ్ళీ లైన్లో పెట్టారు. తాజాగా తమ్ముడు ప్రమోషన్స్ లో ఆయన తన లైనప్ వెల్లడించారు. ముందుగా ఆయన మాట్లాడుతూ ఎఫ్ డీసీ నుంచి గద్దర్ అవార్డ్స్ చేశాం. నెక్ట్స్ ప్రస్తుతం మన రాష్ట్రంలో ఆగిపోయిన చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించాలని అనుకుంటున్నాం. ప్రభుత్వం తరపున ఆన్ లైన్ టికెటింగ్, రన్ ట్రాక్ తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మా సంస్థలో రౌడీ జనార్థన, ఎల్లమ్మ, దేత్తడి ప్రొడక్షన్ లో ఉన్నాయి. మరో ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ ఏడాది చేస్తున్న నాలుగు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కు తీసుకొస్తాం. వచ్చే ఏడాదిలో చేయాల్సిన ఐదారు మూవీస్ స్క్రిప్ట్ నెరేషన్ స్టేజ్ లో ఉన్నాయి. అవి 2026లో స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఎస్వీసీ, దిల్ రాజు ప్రొడక్షన్స్ లో రాబోతున్న కొత్త మూవీస్. నెక్ట్స్ ఇయర్ వచ్చే సినిమాల్లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒకటి, మార్కో మూవీ డైరెక్టర్ హనీఫ్ తో ఒక సినిమా ఉంటాయి.
హృతిక్, ఎన్టీఆర్‌లతో విడివిడిగా ప్రమోషన్స్?
YRF స్పై యూనివర్స్ సినిమాలను యష్ రాజ్ ఫిల్మ్స్ ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు YRF ప్రత్యేకమైన వ్యూహాలు అమలు చేస్తుంటుంది. ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తొలిసారిగా తెరపైకి కలిసి రాబోతున్నారు. ఈ క్రమంలో YRF ప్రమోషన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటుంది. ఇద్దరితో సపరేట్‌గా ప్రమోషన్స్ చేయించాలని టీం భావిస్తోంది. ‘హృతిక్, ఎన్టీఆర్ కలిసి ‘వార్ 2’ని ప్రమోట్ చేయరు.