Vallabhaneni Vamsi Released: విజయవాడ సబ్ జైలు నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విడుదలయ్యారు.. ఫిబ్రవరి 16వ తేదీన హైదరాబాద్‌లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన విజయవాడ పటమట పోలీసులు.. హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించారు.. వల్లభనేని వంశీని బెదిరింపులు, కిడ్నాప్ కేసులో అరస్ట్ చేసిన ఆ తర్వాత వరుసగా 11 కేసులు నమోదు అయ్యాయి.. దీంతో, ఫిబ్రవరి 16వ తేదీ నుంచి నేటి వరకు 137 రోజుల జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ.. ఇక, జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీకి విజయవాడ సబ్ జైలు దగ్గర స్వాగతం పలికారు ఆయన సతీమణి పంకజ శ్రీ, వైసీపీ కృష్ణ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్, పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జ్ దేవ భక్తుని చక్రవర్తి.. పలువురు వైసీపీ శ్రేణులు, వంశీ అభిమానులు..
Read Also: ENG vs IND: మూడు కీలక మార్పులు చేసిన టీమిండియా.. ఈసారైనా విజయం వరిస్తుందా..?
కాగా, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి ఆఖరి కేసులో కూడా బెయిల్ లభించింది మొత్తం వంశీ పై ఇప్పటివరకు 11 కేసులు నమోదగా అందులో 11వ కేసులో బెయిల్ మంగళవారం నూజివీడు కోర్టు ఇచ్చింది.. దీనితో మొత్తం అన్ని కేసుల్లో బెయిల్ వచ్చిన వంశీ.. ఈ రోజు జైలు నుంచి విడుదల అయ్యారు.. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు అయింది వంశీకి.. ఇప్పటికే 10 కేసుల్లో వంశీకి బెయిల్, ముందస్తు బెయిల్, కండిషన్ బెయిల్ ను వేర్వేరు కోర్టులు మంజూరు చేశాయి. తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు మంగళవారం వంశీకి బెయిల్ మంజూరు చేయటంతో అన్ని కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరైనట్టు అయింది. దీంతో ఇవాళ జైలు నుంచి విడుదల అయ్యారు.. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నా వంశీ.. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు.. ఇప్పటికే పలుమార్లు ఆసుపత్రిలో చికిత్స కూడా పొందిన విషయం విదితమే..