టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీ గోశాలలో గోవులు మృతిచెందాయంటూ టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుమలలో అన్ని పూజా కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి... ఆగమ శాస్త్రము ప్రకారం అన్ని పూజా కార్యక్రమాలు చేపడుతున్నాం.. టీటీడీ గోశాలలో కొన్ని ఆవులు చనిపోయాయి అని చేస్తున్న ప్రచారం గ్లోబల్ ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు..
నెల్లూరు జిల్లాలో వెలుగు చూసిన సైబర్ క్రైమ్‌ను చూస్తే.. అసలు ఎవరు? నకిలీ ఎవరు? అనే అయోమయంలో పడిపోవాల్సిన పరిస్థితి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నారాయణ మెడికల్ కళాశాల డైరెక్టర్ పునీత్ పేరుతో నారాయణ సంస్థ ఆడిటర్ సురేష్ కుమార్‌ను మోసం చేశారు సైబర్ నేరగాళ్లు.. కొత్త వాట్సాప్ నెంబర్‌ను వాడుతున్నానని... నూతన ప్రాజెక్ట్ కోసం తాను పంపిన ఖాతా నంబర్‌కు రూ.కోటి 96 లక్షలు పంపాలని మెసేజ్ పెట్టారు జాదుగాళ్లు.. ఇక, అనుమానం రాకుండా.. వాట్సాప్ డీపీలోనూ పునీత్ ఫొటో పెట్టారు కేటుగాళ్లు..
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ అవిశ్వాస పరీక్షకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ కండువా కప్పేసుకోవడానికి సిద్ధం అయ్యారు. గాజువాక ప్రాంతానికి చెందిన వంశీ.. వైసీపీకి గుడ్‌బై చెప్పి.. పార్టీ మారడం ఆసక్తికర పరిణామం.
అధికారంలోకి రావటానికి అప్పట్లో ఏమేమి ఎర వేశారో అందరికీ తెలుసు.. కానీ, ఎన్టీఆర్ లా అభిమన్యుడు కాదు జగన్.. అర్జునుడిలా మీ కుట్రలు ఛేదిస్తారని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి పేర్ని నాని.. జైల్లో ఉన్న సమయంలో డ్రామాలు ఆడింది చంద్రబాబు.. జైల్లోకి వెళ్లగానే డీ హైడ్రేషన్.. అలర్జీ అన్నారు..
శ్రీకాకుళంజిల్లా అభివృద్దికి అన్ని అవకాశాలు ఉన్నా , ప్రజల సహకారం లేకపోవడమే వెనుకబాటుకు కారణం అన్నారు మంత్రి అచ్చెంనాయుడు. ఎయిర్ పోర్ట్ కట్టాలంటే జెండాపట్టుకోని లేస్తున్నారు.. ఎక్కడ అభివృద్ది జరగుతుంది..? దీనిపై చర్చజరగాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వలసలు ఆగాలన్నా , పేదరికం పోవాలన్నా పారిశ్రామికీకరణ జరగాలన్నారు. పాజిటివ్ మైండ్ తో ముందుకు వెళ్తే తప్ప ఇంకో డబ్బై సంవత్సరాలైనా మన జిల్లా ఇలాగే ఉంటుంది.
సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై ఇష్టానుసారం పోస్టులు పెడితే వారికి అదే చివరిరోజు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు... సోషల్ మీడియా నేరస్థుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు..
సీఐడీ విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన జోగి రమేష్.. చంద్రబాబు ఇంటికి నిరసన తెలియజేయానికి మాత్రమే వెళ్లాను.. ఈ విషయం చంద్రబాబు, లోకేష్ తెలుసుకోవాలని సూచించారు.. రెడ్ బుక్ శాశ్వతం కాదు.. ఒకటి రెండేళ్లు రెడ్ బుక్ నడిచినా తర్వాత రెడ్ బుక్ మడిచి పెట్టుకోవాల్సిందే అంటూ హాట్ కామెంట్లు చేశారు..