వైఎస్ జగన్ హెలికాప్టర్ వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటనలో.. జగన్ హెలికాప్టర్ దెబ్బ తినడం.. ఆ తర్వాత ఆయన రోడ్డు మార్గం వెళ్లడం పై వివాదం రాజుకుంది. జగన్ పర్యటనలో భద్రతా లోపం ఉందంటూ ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్నారు. అసలు హెలికాప్టర్ విషయంలో ఏం జరిగిందన్న దానిపై విచారణ చేపట్టారు.
రాజధానిలో సచివాలయ టవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు సీఆర్డీఏ అధికారులు.. సచివాలయానికి 4 టవర్లు, హెచ్‌వోడీ కార్యాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచారు.. హెచ్‌వోడీ టవర్ నిర్మాణానికి రూ.1,126 కోట్లకు టెండర్ పిలిచిన అధికారులు.. సచివాలయానికి సంబంధించిన 1, 2 టవర్ల కోసం రూ.1,897 కోట్లతో మరో టెండర్‌కు పిలిచారు.. ఇక, సచివాలయం 3,4 టవర్ల కోసం రూ.1,664 కోట్లతో టెండర్లు జారీ చేశారు సీఆర్డీఏ అధికారులు.. మొత్తంగా 5 టవర్లను రూ.4,668 కోట్ల వ్యయంతో చేపట్టనుంది సీఆర్డీఏ.. మరోవైపు.. మే 1వ తేదీన సచివాలయ,…
డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.. అయితే, ఈజీగా డబ్బులు సంపాదించడం.. జల్సాలు చేయడానికి అలవాటు పడి.. కొందరు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు.. అందులో భాగంగా మాయమాటలు చెప్పేవాళ్లు... అమ్మాయిలను ట్రాప్ చేసి ముగ్గులోకి దింపేవారు... అమ్మాయిల న్యూడ్ వీడియోలను బ్యాన్ చేసిన పోర్న్ వెబ్ సైట్లకు అమ్ముకుంటూ లక్షలకు లక్షలు సంపాదించేవారు... ఇలాంటి ఓ దుర్మార్గపు గ్యాంగ్ ఆట కట్టించారు సైబర్ సెక్యూరిటీ పోలీసులు.
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసిన వ్యక్తులను పట్టుకున్నారు గుంటూరు పోలీసులు.. కర్నూలు జిల్లాకు చెందిన రఘు అలియాస్ పుష్పరాజ్.. ట్విట్టర్ వేదికగా ఈ పోస్ట్ చేసినట్టు గుర్తించామని తెలిపారు ఎస్పీ సతీష్‌కుమార్.. నిందితుడు రఘు మహిళలపై కూడా చాలా అసభ్యకరమైన పోస్టింగ్‌లు చేసినట్టు.. అతడి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తే స్పష్టం అవుతుందన్నారు..
మద్యం కుంభకోణంలో రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుఅవుతున్నారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.. అంటే నోటీసుల్లో పేర్కొన్న దానికంటే ఒకరోజు ముందుగానే విచారణకు వెళ్లబోతున్నారు.. ఈ మేరకు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు సాయిరెడ్డి.. తొలుత ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు.. అయితే తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ఉండటంతో 17వ తేదీన విచారణకు వస్తున్నానని సమాచారం పంపించారు విజయ సాయిరెడ్డి.. ఇక, 17వ తేదీన విచారణకు రావాలని, తాము రెడీ అని విజయసాయికి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పులు, వడ్డీలపై 16వ ఆర్ధిక సంఘానికి వివరణ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతి రాజధానిపై స్పెషల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర విభజన వల్ల వచ్చిన నష్టం.. కేంద్ర సాయంపై ప్రధానంగా సీఎం చంద్రబాబు వివరించారు... ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏపీని ఆర్ధికంగా ఆదుకోవాల్సిన పరిస్థితిపై సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు.. గ్రామీణాభివృద్ధి.. పంచాయితీ రాజ్.. మున్సిపల్ శాఖలకు సంబంధించి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు సిఫార్సు చేయాల్సిందిగా కోరారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
ఏపీ ఫైబర్ నెట్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్లో దాదాపు 500 మంది ఉద్యోగులను సర్కార్ తొలగిస్తూ సంచలన నిర్ణయానికి వచ్చింది.. సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరు కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుంచి ఔట్ అవ్వనున్నారు..
క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలోని టీటీడీ ఎస్వీ గోశాలను పరిశీలించిన ఆయన.. గోవుల ఆరోగ్య పరిస్థితులు, గోవులకు అందుతున్న దాణాపై ఆరా తీశారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. టిటిడి గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదు, గోవులకు కావాల్సినంత దాణా ఉందని వెల్లడించారు.. ప్రతినిత్యం గోవుల ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.. గోవులు పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు.
ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐ విచారణ జరపాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.. ఆ పిల్‌పై విచారణ చేపట్టింది న్యాయస్థానం.. అయితే, ప్రవీణ్ ను హత్య చేశారని కోర్టుకు తెలిపారు పిటిషనర్ కేఏ పాల్.. మరోవైపు, రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది హైకోర్టు..
ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి.. "ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ.." అంటూ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చేసిన ట్వీట్ విపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్టు అయ్యింది.. అయితే, గంటా వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది.. విమాన సర్వీసులు జాప్యంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ట్వీట్ పై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలి.. లేకపోతే విమానయాన శాఖ మంత్రి కూడా మనవారే కదా..? కేంద్ర మంత్రి రామ్మోహన్ కి…