పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఉంది. అయితే అది ఎలా అనే విషయంలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. ఇప్పటికే భారత్ వ్యూహాత్మక యుద్దం మొదలుపెట్టింది. కానీ కొందరు సోషల్ మీడియా దేశ భక్తులు మాత్రం పాక్ పై అణుదాడికి దిగాలని ఉచిత సలహాలిస్తున్నారు. ఇంతకూ భారత్ ఏం చేస్తే బాగుంటుంది..? అసలు పాక్ పరిస్థితి ఎలా ఉంది..? అణ్వస్త్రాల విషయంలో దాయాదుల వైఖరేంటి..?
బిగ్ బాస్, అందాల పోటీలతో స్త్రీ జాతికి కళంకం తెస్తాయి.. బిగ్బాస్ను బ్యాన్ చేయాలి.. అందాల పోటీలను రద్దు చేయాలన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బిగ్ బాస్ కు మొదటి నుంచి మేము వ్యతిరేకం.. సమాజానికి ఉపయోగపడని షో బిగ్ బాస్ అన్నారు.. మంచి వయసులో ఉన్న యువతి యువకులను తీసుకెళ్లి బిగ్ బాస్ లో పడేస్తే.. ప్రకృతి రీ యాక్షన్స్ కు లోనవుతారన్న ఆయన.. అదే సమయంలో తప్పు చేస్తారని తెలిపారు.. అయితే, బిగ్ బాస్…
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.. చేతికి వచ్చిన ఎన్నో పంటలు దెబ్బతినడంతో.. రైతులు గగ్గోలు పెడుతున్నారు.. అయితే, రీజినల్ కో-ఆర్డినేటర్లు, పార్టీ ముఖ్య నేతలతో భారీ వర్షాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోవడంతో పాటు అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించాలని…
మరో రెండు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా తీరం మీదుగా ఉత్తర కోస్తా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఈ రోజు కొన్ని చోట్ల.. రేపు పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది.. సొంతంగా భూమి ఉన్న రైతులే కాదు.. ఇతరుల పొలాలను కౌలు తీసుకుని వ్యవసాయం చేసే కౌలు రైతులకూ సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది.. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.20 వేల చొప్పున అందించాలనే నిర్ణయానికి వచ్చింది.. ఆ రూ.20 వేలను మూడు విడతల్లో రైతులను అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఈ మొత్తాన్ని.. ఆయా రైతుల ఖాతాల్లో జమ…
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో చోరీ కలకలం రేపుతోంది.. ఈ నెల 1వ తేదీన దర్శనం కోసం ఆలయానికి వచ్చిన స్థానికంగా నివసించే ఇద్దరు మైనర్ బాలురు.. ఆలయంలోని హుండీలో చోరీ పాల్పడ్డారు..
సంచలనం సృష్టించిన ముంబై నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలకు నోటీసులు జారీ చేసింది సీఐడీ.. నేడు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.. దీంతో, ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఈ రోజు సీఐడీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు..
విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని.. సిట్టింగ్ఎంపీ, టీడీపీ నేత కేశినేని చిన్ని మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది.. మొన్నటికి మొన్న విశాఖలో భూ కేటాయింపుల విషయంలో తన సోదరుడు కేశినేని చిన్నిపై ఆరోపణలు చేసిన కేశినేని నాని.. ఇప్పుడు.. ఏపీలో కాక రేపుతోన్న లిక్కర్ కేసులోనూ తమ్ముడిపై ఆరోపణలు చేస్తున్నారు.. దీనిపై సీఎం నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాస్తూ.. ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు కేశినేని నాని..