ఆంధ్రప్రదేశ్లో మరోసారి భూప్రకంపలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.. జిల్లాలోని పలుచోట్ల ఈ రోజు స్వల్పంగా భూమి కంపించింది.. పొదిలి, దర్శి, కురిచేడు, ముండ్లమూరు మండలాల్లో సెకను పాటు స్వల్పంగా భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 4 గంటలకు 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరగనుంది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, సీఆర్డీఏ కమిషనర్, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.. రాజధాని పరిధిలో చేపట్టాల్సిన మరికొన్ని పనులకు అనుమతి ఇవ్వనుంది సీఆర్డీఏ అథారిటీ..
విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయం అయ్యింది.. లండన్ పర్యటనలో ఉన్న ఆయన బాత్రూమ్లో జారిపడటంతో కూడి చేయి విరిగినట్టుగా తెలుస్తోంది.. దీంతో.. లండన్లో ప్రాథమిక వైద్యం తీసుకున్న ఆయన్ను మెరుగైన వైద్య సేవల కోసం వెంటనే హైదరాబాద్కు తరలించారు..
అన్నమయ్య జిల్లా రాయచోటిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడు కన్నుమూశారు.. 80 ఏళ్ల పాలకొండరాయుడు.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రాణాలు విడిచారు.. రెండు రోజుల క్రితం అనారోగ్యపాలైన సుగవాసి పాలకొండరాయుడును బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు..
రాజధాని ప్రాంతంలో వివిధ సంస్థలకు కేటాయించే భూముల విషయంపై ఓ నిర్ణయం తీసుకోనుంది కేబినెట్ సబ్ కమిటీ.. పలు భూ కేటాయింపులపై ఇవాళ ఉదయం 11 గంటలకు మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కానుంది..
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై సీనియర్ రాజకీయ నేత, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్టు చాలా పెద్ద తప్పు అని అభిప్రాయపడ్డారు..