కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఒక రికార్డు అయితే అందులో పని చేసిన ఇంజనీర్లది మరో రకం రికార్డు. ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన బ్యారేజ్‌ల కుంగుబాటుకు నాసిరకం నిర్మాణమే కారణమని కేంద్ర సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించాయి. అలాగే...కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక ఇంజనీర్, గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్‌పై ఎప్పటి నుంచో అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
వల్లభనేని వంశీ మోహన్ అస్వస్థతకు గురయ్యారు.. వెంటనే విజయవాడ సబ్ జైలు నుంచి విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు.. బ్యాక్ పెయిన్, వాళ్లు వాయటంతో ఇబ్బంది పడుతోన్న వంశీని.. ఆస్పత్రికి తీసుకెళ్లారు జైలు అధికారులు.. బెజవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉద్రిక్తత నెలకొంది.. మొన్న ఏ కొండూరు గ్రామానికి చెందిన వెంపాటి మధుమిత (22) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.. విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని ప్రాణాలు వదిలారు.. మృతురాలు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ఉండేది.. మృతురాలు మధుమిత అమ్మమ్మ గారి ఊరు తెల్లదేవరపల్లి గ్రామం కాగా.. విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన బోల్లిపోగు ప్రతాప్ అనే వ్యక్తి తమ కూతురిని తీసుకెళ్లి చంపి ఉరి వేసినాడు అని ఆరోపిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు వెంపాటి…
విశాఖలో కలకలం రేపిన దువ్వాడ జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు.. దువ్వాడ పీఎస్ పరిధిలో జరిగిన వృద్ధ దంపతుల డబుల్ మర్డర్ కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు.. అప్పు తీర్చాలని అడిగినందుకు యోగేంద్ర బాబు, లక్ష్మీల హత్య చేసినట్లు విచారణలో తేల్చారు పోలీసులు.. మరోవైపు, భీమిలి మండలం దాకమర్రి వివాహిత హత్య కేసును కూడా పోలీసులు ఛేదించారు.. హత్య చేసిన క్రాంతి కుమార్ ను అరెస్టు చేశారు.
శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ పేరుతో విడుదల చేసిన ప్రకటనలో.. ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది దేవస్థానం.. ఘాట్ రోడ్‌ను మూడు రోజుల పాటు పూర్తిగా మూసివేయనున్నట్టు స్పష్టం చేసింది దేవస్థానం.. మరమ్మత్తులు, కొండచరియలు, మెష్ తదితర పనుల నిమిత్తం మే 06, 07, 08 తేదీలలో వరుసగా మూడు రోజుల పాటు ఘాట్ రోడ్ పూర్తిగా మూసివేయనున్నారు..
ఏపీ రాజధాని అమరావతి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడుపు మంట అంటూ ఫైర్ అయ్యారు మంత్రి కొలుసు పార్థసారథి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి రీలాంచ్ కార్యక్రమంపై స్పందిస్తూ.. రాజధాని పునఃప్రారంభ పనులు గొప్పగా మొదలయ్యాయన్నారు.. అమరావతిపై విషం చిమ్మిన స్వార్థపరులు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని సూచించారు.. అలా చేస్తే.. తెలుగు ప్రజలు క్షమించక పోయినా.. దేవుడు వారిని క్షమిస్తారని వ్యాఖ్యానించారు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది.. ఏపీ ప్లానిండ్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ పద్ధతిలో 175 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.. ఎంబీఏ అర్హతగా.. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు భర్తీ చేయనుంది.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్, ప్రభుత్వ P4 కార్యక్రమ సమన్వయానికి.. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు భర్తీకి సిద్ధమైన కూటమి ప్రభుత్వం.
నిన్న ప్రధాని మోడీ అమరావతికి వచ్చారు.. మొన్న వచ్చినప్పుడు (అమరావతి శంకుస్థాపనకు తొలిసారి వచ్చినప్పుడు) నీరు - మట్టి తీసుకొచ్చారు.. ఈసారి (అమరావతి రీలాంచ్) ఏదో ఇస్తారని ఆశించాం.. కానీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి చాక్లెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
అమరావతి రీలాంచ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పది సంవత్సరాలకు రాజధాని నిర్మాణానికి పునాదిరాయి వేశారు.. అయితే, గత ఐదు సంవత్సరాలు అమరావతి పనులు ఆగిపోయినందుకు ప్రధాని నరేంద్ర మోడీయే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు..