తిరుపతి జిల్లాలో మరొక కీలకమైన ప్రాజెక్టు వచ్చి చేరింది.. ఈ రోజు శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు మంత్రి నారా లోకేష్... 5వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు.. శ్రీసిటీలో ఎల్జీ గృహోపకరణాలు తయారీ యూనిట్ కు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేయనున్నారు. ఈ పరిశ్రమతో 2 వేల మందికి ఉద్యోగావకాశాలతో పాటు.. 839 కోట్ల రూపాయలతో మరో 5 అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.. ఈ రోజు ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం నిర్వహించనున్నారు.. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడీకి కేబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. మరోవైపు.. తాజాగా జరిగిన 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ, సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్కు తృటిలో భారీ ప్రమాదం తప్పింది.. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురంలో MSME మీటింగ్కు హాజరయ్యారు మంత్రి కొండపల్లి, ఎమ్మెల్యే గంటా.. అయితే, ఒక్కసారిగా ఫొటోల కోసం కార్యకర్తలు, స్థానికులు ఎగబడటంతో కృష్ణాపురంలో MSME మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన సభా వేదిక ఒక్కసారిగా కూలిపోయింది..
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై వేగంగా ముందుకు వెళ్తోంది ఏపీ ప్రభుత్వం.. ప్రాజెక్ట్ ప్లానింగ్, టెండర్ల ప్రక్రియ, పనుల పర్యవేక్షణ, ప్రాజెక్ట్ పూ కి కన్సల్టెన్సీ ఎంపిక కోసం టెండర్లు పిలిచింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్.. టెండర్లకు సంబంధించి ప్రీబిడ్ సమావేశం నిర్వహించింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్.
వల్లభనేని వంశీకి షాక్ ఇస్తూ.. మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు..
ఆంధ్రప్రదేశ్లో మరోసారి భూప్రకంపలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.. జిల్లాలోని పలుచోట్ల ఈ రోజు స్వల్పంగా భూమి కంపించింది.. పొదిలి, దర్శి, కురిచేడు, ముండ్లమూరు మండలాల్లో సెకను పాటు స్వల్పంగా భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 4 గంటలకు 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరగనుంది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, సీఆర్డీఏ కమిషనర్, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.. రాజధాని పరిధిలో చేపట్టాల్సిన మరికొన్ని పనులకు అనుమతి ఇవ్వనుంది సీఆర్డీఏ అథారిటీ..