ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవితకు కోపం వచ్చింది.. ఎంతలా అంటే.. ఓ అధికారి ఇచ్చిన బొకేను విసిరికొట్టేశారు మంత్రి.. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. ఆలస్యంగా వెలుగు చూడగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. మంత్రిగారికి ఎందుకంత కోపం..? ఏమిటా ప్రెస్టేషన్..? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు..
ఎవరైనా వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు.. అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పార్టీ ముఖ్య నేతలతో ఈ రోజు టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు చంద్రబాబు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన, ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనపై నేతలకు దిశా నిర్దేశం చేశారు.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు..
విజయవాడ శాతవాహన కళాశాలను వివాదాలు వీడడం లేదు. వారం క్రితం కాలేజీ ప్రిన్సిపాల్ కిడ్నాప్‌తో... ఒక్క సారిగా కలకలం రేగింది. తాజాగా, కాలేజీ భవనాల కూల్చివేత ఆందోళనకు దారితీసింది. ఇరు పక్షాలు పరస్పరం కేసులు పెట్టుకున్నాయి. కాలేజీ భూముల విషయంలో బోయపాటి శ్రీనివాస్, వంకాయలపాటి మధ్య సుప్రీం కోర్టులో వివాదం నడుస్తుంది.
పల్నాడు జిల్లాలో వెల్దుర్తి మండలం గుండ్లపాడులో TDP నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు సోదరులు దారుణ హత్యకు గురయ్యారు. 15 రోజుల క్రితం వీళ్లను కారుతో గుద్ది చంపారు ప్రత్యర్థులు. ఈ కేసులో గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, గురవయ్య, దొంగరి నాగరాజు, తోట వెంకటేశ్వర్లు, గెల్లిపోగు విక్రమ్ లను అరెస్ట్ చేశారు పోలీసులు.
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక్కసారిగా స్కూల్ టీచర్‌గా మారిపోయారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నీటి ఎద్దడితో ఎడారిగా మారకుండా ఉండాలంటే.. మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకతను వివరించారు నిర్మలా సీతారామన్.. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు క్లాస్ తీసుకున్న నిర్మలా సీతారామన్.. మొక్కల విశిష్టత - ఉపయోగాలు అంశంపై విద్యార్థులకు వివరించారు..
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రానిదీ ఒక్కో కథ. తెలంగాణలో ఆదాయం తగ్గకపోయినా.. అప్పులు పెరుగుతున్నాయి. ఏపీలో ఆదాయం పెరగడం లేదు. అప్పులు పేరుకుపోతున్నాయి. పైగా అప్పులు తీర్చడానికి అప్పులు చేయక తప్పని విష విలయం రెండు రాష్ట్రాల్లో నడుస్తోంది.
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. గత ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన సుగవాసి బాలసుబ్రమణ్యం.. ఇప్పుడు, టీడీపీకి గుడ్‌బై చెప్పారు.. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పంపారు సుగవాసి బాలసుబ్రమణ్యం..
రాజంపేట నియోజకవర్గం టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు రచ్చ కెక్కాయి. రాజంపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ బత్యాల చెంగల రాయుడు కు ఇవ్వాలని మోకాళ్లపై కూర్చొని నినాదాలు చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నిరసన వ్యక్తం చేశారు.