Raghurama Krishnam Raju: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. తనపై హైదరాబాద్ లో దాఖలైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు.. అయితే, ఏపీ కానిస్టేబుల్ పై దాడి జరిగిందంటూ రఘురామ కృష్ణంరాజు, అతని కార్యాలయ సిబ్బందిపై గతంలో ఎఫ్ఐఆర్ దాఖలు అయ్యింది.. అయితే, ఈ కేసును తాను కొనసాగించదలచుకోవడం లేదంటూ సదరు కానిస్టేబుల్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.. ఆ అఫిడవిట్ ను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ జేకే మహేశ్వరి ధర్మాసనం.. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.. దీంతో, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు ఊరట దక్కినట్టు అయ్యింది..
Read Also: Sreeleela : రాత్రులు అలా చేస్తుంటాను.. అందుకే ఒక్కదాన్ని పడుకోలేను