వైఎస్ జగన్ అడ్డాలో తెలుగు తమ్ముళ్ల మధ్య తీవ్ర పోటీ..!
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అడ్డాలో ఆధిపత్యం కోసం టీడీపీ తమ్ముళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది… నిన్న మొన్నటి వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలా? అని తలలు పట్టుకునే టీడీపీకి ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొనడంతో అదే తలనొప్పిగా మారింది… సార్వత్రిక ఎన్నికల్లో రెండు దశాబ్దాల తర్వాత కడప గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది… ఆ తరువాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి నేతలు పోటీ పడుతున్నారట.. ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులు రెడ్డికి ఉద్వాసన తప్పదని ఆ పార్టీ నేతలలో గుసగుసలు వినిపిస్తున్నాయట… జమ్మలమడుగు టీడీపీ ఇంఛార్జ్ భూపేష్ రెడ్డి.. కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి.. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్ గోవర్ధన్ రెడ్డి.. అమీర్ బాబు తమకంటే తమకు జిల్లా అధ్యక్ష పదవి కావాలంటూ ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారట… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈరోజు పార్లమెంట్ కమిటీ ఎన్నిక కోసం టీడీపీ అధిష్టానం త్రిమెన్ కమిటీని నియమించింది… ఎమ్మెల్సీ బీద రవీంద్ర, ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మనాయుడు ఆశావాహుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.. ఎన్నడు లేని విధంగా మొదటిసారి జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొనడంతో త్రీ మెన్ కమిటీ జిల్లా కమిటీని ప్రకటిస్తుందా, లేక అధిష్టానం ప్రకటిస్తుందా అనేది సందిగ్ధంగా మారింది…
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం.. రేషన్ పంపిణీపై ఉన్నతస్థాయిలో మానిటరింగ్
ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం.. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. వరలక్ష్మి నగర్‌లో ఇంటింటికీ వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్,ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీషా.. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. నేడు రాష్ట్రంలో పండుగ వాతావరంలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ జరుగుతుందన్నారు.. రేషన్ పంపిణీలో అక్రమాలు అరికట్టడానికి స్మార్ట్ కార్డులు అందుబాటులోకి తెచ్చాం.. స్మార్ట్ కార్డ్స్ వల్ల ఉన్నతస్థాయిలో మానిటరింగ్ జరుగుతుందని వెల్లడించారు.. ఎన్టీఆర్ జిల్లాలో 5.70 లక్షల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం.. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు విడతల్లో 1.46 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తాం అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.. ఇవాళ్టి నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకూ పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది.. బియ్యం, షుగర్ తో పాటు కందిపప్పు, పామాయల్ అవసరాన్ని బట్టి గోధుమలు ఇస్తాం అన్నారు.. రాష్ట్రంలో ప్రస్తుతం 29,797 వేల రేషన్ డిపో లు ఉన్నాయి.. ఈ డిపోల సంఖ్య పెంచాలని నిర్ణయం తీసుకున్నాం అని పేర్కొన్నారు. గిరిజన, కొండ ప్రాంతాల్లో సబ్ డిపోలు ఏర్పాటు చేస్తాం అని వివరించారు మంత్రి నాదెండ్ల మనోహర్..
ఆకస్మిక తనిఖీలు.. ఎరువుల పంపిణీపై కలెక్టర్ హెచ్చరిక
పంటల సమయంలో ఎరువుల కొరత రైతులను ఇబ్బంది పెడుతోంది.. ముఖ్యంగా యూరియాతో రైతులతో పాటు ప్రభుత్వానికి కూడా తలనొప్పి తప్పడలం లేదు.. సీఎం, మంత్రులు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.. అయితే, ఎరువుల పంపిణీ విషయంలో అధికారులకు వార్నింగ్ ఇచ్చిన కలెక్టర్.. రైతులను హెచ్చరించారు.. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎరువుల సరఫరాలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. తనిఖీ సమయంలో ఎరువుల పంపిణీ జాబితాను పరిశీలించిన కలెక్టర్, “రెండు బస్తాలు ఇచ్చే చోట ఒక రైతుకి ఐదు బస్తాలు ఎందుకు ఇచ్చారు? ఏ ఆధారంపై ఇంత మోతాదు కేటాయించారు?” అని ప్రశ్నించారు. సిబ్బంది సమాధానంగా కొంతమంది రైతులు అదనంగా కోరుతున్నారని చెప్పగా, కలెక్టర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఎరువుల కేటాయింపు పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా విస్తీర్ణం అనుసరించి జరగాలి, ఇది రైతులందరికీ సమానంగా లభించడానికి తీసుకున్న చర్యలో భాగం, సాయిల్ టెస్టు ఆధారంగా ఎంత మొత్తం వాడాలో స్పష్టం చేశారని తెలిపారు. ఒక రైతు ఎక్కువ తీసుకుంటే, మరొకరికి తక్కువ అవుతుంది. ఇది న్యాయం కాదు, మీపనితీరుమార్చుకోవాలి అని కలెక్టర్ పి. ప్రశాంతి హెచ్చరించారు.
గతంలోనే స్వాతి హత్యకు ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు
ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత భార్య స్వాతిపై అనుమానం పెంచుకుని.. గర్భవతి అన్న కణికరం లేకుండా అత్యంత దారుణంగా హత్య చేశాడు భర్త మహేందర్ రెడ్డి. తమ కూతురు మృతికి కారణమైన మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలంటూ కుటుంబీకులు నిందితుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మహేందర్ రెడ్డి గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలోనే స్వాతి హత్యకు ప్లాన్ చేశాడని ఎన్టీవీతో స్వాతి చెల్లెలు శ్వేత తెలిపింది. కామారెడ్డిగూడ శివారులో క్వారీలో తోసే ప్రయత్నం చేసినట్లు వెల్లడించింది. ఇద్దరం ఆత్మహత్య చేసుకుందామని చెప్పి క్వారీ దగ్గరికి తీసుకువచ్చి వదిలి వెళ్లినట్లు తెలిపింది.
దివ్యాంగులపై జోకులేంటి? కమెడియన్లపై సుప్రీంకోర్టు సీరియస్
స్టాండప్ కమెడియన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. దివ్యాంగులపై షోల్లో జోక్‌లు వేయడంపై తీవ్రంగా తప్పుపట్టింది. తక్షణమే సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. జరిమానాలు కూడా తప్పవని హెచ్చరించింది. జోక్‌ల పేరుతో దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు వేయడాన్ని ఎస్‌ఎంఏ క్యూర్ ఫౌండేషన్ తప్పుపట్టింది. కమెడియన్లు సమయ్ రైనా, విపున్ గోయల్, బాల్‌రాజ్ పరమ్‌జీత్ సింగ్, సోనాలి ఠక్కర్ తదితరులను బాధ్యులుగా పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ మేరకు వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం.. సోమవారం వారిపై సీరియస్ అయింది. తక్షణమే మీ సోషల్ మీడియా ఛానెల్స్‌లో క్షమాపణ చెప్పాలని సూచించింది. కామిక్స్ తమ యూట్యూబ్ ఛానెల్‌లో క్షమాపణ పోస్ట్ చేయాలని.. వారు భరించడానికి సిద్ధంగా ఉన్న జరిమానా గురించి కోర్టుకు తెలియజేయాలని ఉత్తర్వులో పేర్కొంది.
షాకింగ్ ప్రమాదం.. వర్ధమాన క్రికెటర్ దుర్మరణం
జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో వర్ధమాన క్రికెటర్ ప్రాణాలు కోల్పోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ కాగా.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన ఫరీద్ హుస్సేన్ అనే వర్ధమాన క్రికెటర్ ఆగస్టు 20న జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. స్కూటర్‌పై నెమ్మదిగా రహదారిపై వెళ్తుండగా ఆగి ఉన్న కారు డోర్ సడన్‌గా తీయడంతో స్కూటర్ కింద పడిపోయింది. దీంతో ఫరీద్ హుస్సేన్ కోమాలోకి వెెళ్లారు. కరెక్ట్‌గా స్కూటర్ కారు దగ్గరకు వచ్చినప్పుడు డోర్ తెరిచాడు. దీంతో స్కూటర్‌ను కంట్రోల్ చేసే పరిస్థితి కనిపించలేదు. తలకు బలమైన గాయాలు తగలడంతో ఫరీద్ హుస్సేన్ చికిత్స పొందుతూ చనిపోయాడు.
టీమిండియా టెస్ట్ క్రికెట్ ముగిసినట్లేనా..?
ప్రస్తుత క్రికెట్లో టీమిండియా అగ్రజట్టు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే, మూడు ఫార్మాట్లలో తిరుగులేని ప్రదర్శనలతో ఇటు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా సిరీస్‌లు గెలిచి.. ప్రపంచ క్రికెట్లో మొదటి ప్లేసులో నిలుస్తుంది. అయితే టెస్టుల్లో కొంతమంది ప్లేయర్ల వల్ల టీమిండియా టాప్-3 లో కొనసాగుతుంది. వాళ్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ మరియు జడేజా లాంటి సీనియర్స్ వున్నారు. వీళ్లు ఎక్కడ ఆడినా.. సత్తా చాటుతుంటారు. దీంతో టెస్ట్ ఫార్మాట్‌లో భారత్ కొన్నేళ్లుగా అగ్ర స్థానాల్లో కొనసాగుతుంది. అయితే, 2025 సంవత్సరం క్రికెట్ అభిమానులకు ఒకరకంగా విషాదకరమైన సంవత్సరం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే క్రికెట్‌కు చాలామంది దిగ్గజ క్రీడాకారులు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఛతేశ్వర్ పుజారా కూడా చేరాడు. తన వన్డే కెరీర్‌లో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన పుజారా, టెస్ట్ క్రికెట్‌లో మాత్రం 103 మ్యాచ్‌లలో మొత్తం 7,195 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పుజారా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా, పుజారా రిటైర్మెంట్‌తో టీమిండియా టెస్ట్ క్రికెట్ ముగిసినట్లేనా అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. ఎందుకంటే ఈ ఏడాది పుజారా కంటే ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ రిటైర్ అయ్యారు. అయితే ఈ ముగ్గురు కూడా ఇప్పటికి టీమిండియా విజయాలలో కీలకంగా వున్నారు. అంతేకాదు, టెస్టుల్లో టీమిండియా ఇన్నివిజయాలు సాధించిందంటే ఈ ముగ్గురు పాత్ర కచ్చితంగా ఉంటుంది. ఈ సీనియర్ ఆటగాళ్లలో ఒక్క జడేజానే టెస్టుల్లో కొనసాగుతున్నాడు. అతడి అనుభవమేంటో మొన్న జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌లో కూడా చూసారు. కాగా ఇప్పుడు పుజారా కూడా తప్పుకోవడంతో, టెస్టుల్లో ఆ స్థాయిలో ఆడే ప్లేయర్లు దొరకడం కష్టమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడున్న యంగ్ ప్లేయర్లు ఒకట్రెండు సిరీసుల్లో అదరగొడుతున్నా… అన్ని ఫార్మా్ట్లలో వారు రాణిస్తారా? వారి ఆటతీరును సుదీర్ఘకాలం ప్రదర్శిస్తారా? లేదా? అనేది కూడా వేచిచూడాల్సిన విషయమే..
తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..
మరో స్టార్ హీరోయిన్ తల్లి కాబోతోంది. ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు తల్లి అయ్యారు. ఇప్పుడు అదే బాటలో పయినిస్తోంది మరో హీరోయిన్. ఆమె ఎవరో కాదు ప్రియాంక చోప్రా చెల్లెలు పరిణీతి చోప్రా. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ.. 2023లో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక లీడర్ అయిన రాఘవ్ చద్దాను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఓ రెండు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ ను కంప్లీట్ చేసింది. అవి రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో తాను ప్రెగ్నెంట్ అని పరిణీతి చోప్రా ప్రకటించింది. తమ లిటిల్ యూనివర్స్ రాబోతున్నట్టు పోస్టు పెట్టింది. ఈ పోస్టు క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. దీంతో అభిమానులు ఆమెకు విషెస్ చెబుతున్నారు. పరిణీతి చోప్రా 2012 నుంచి బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. అందం, అభినయంలో అక్కకు ఏ మాత్రం తీసిపోదు. కేసరి, ఇష్క్ జాదే లాంటి సినిమాలతో ఆమెకు పాపులారిటీ వచ్చింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాలు చేసింది ఈ బ్యూటీ. రాఘవ్ చద్దాతో కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ హీరోయిన్.. ఇంట్లో వారిని ఒప్పించి చివరకు పెళ్లి చేసుకున్నారు.
గుండు గీయించుకోవడం.. పేడ రాసుకోవడం.. ఏంటీ పిచ్చి టాస్కులు..
బిగ్ బాస్ సీజన్-9 కోసం అగ్నిపరీక్ష అనే ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ముగ్గురు సామాన్యులకు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తారంట. దాని కోసం వచ్చిన వాళ్లకు నానా రకాల పిచ్చి టాస్కులు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. చేసే వాళ్లకే కాదు.. చూసే వాళ్లకు కూడా చిరాకు పుట్టేలా ఉన్నాయి ఆ పిచ్చిటాస్కులు. మొన్న దమ్ము శ్రీజను పేడ రాసుకోవాలంటే ముఖానికి రాసుకుంది. నిన్న మాస్క్ మ్యాన్, సాయికృష్ణను పిలిచి అరగుండు గీయించుకోవాలన్నారు. పాపం చేసేది లేక మాస్క్ మ్యాన్ అందరి ముందే ట్రిమ్మర్ తో అరగుండు గీసుకున్నాడు.
నేపో కిడ్స్ పనైపోయింది.. ప్రతిభకు పట్టం కడుతున్న బాలీవుడ్ ఆడియెన్స్..
బీటౌన్‌లో స్టార్ సన్సే కాదు డాటర్స్ హవా కూడా కంటిన్యూ అవుతోంది. ఈ ఏడాది ముగ్గురు యంగ్ అండ్ జెన్ జెడ్ బ్యూటీలు తమ లక్ టెస్ట్ చేసుకునేందుకు బాలీవుడ్ తెరంగేట్రం చేశారు. రవీనా టాండన్ తనయ రాషా తడానీ అజయ్ దేవగన్ సపోర్టుతో ఆజాద్ ఫిల్మ్‌తో తెరంగేట్రం చేసింది. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర పల్టీ కొట్టింది. ఓ స్పెషల్ సాంగ్‌లో మాత్రం రాషా ఇరగదీసి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే టాలెంటైతే ప్రదర్శించింది. ఇప్పటి వరకు డిజిటల్ తెరపై సందడి చేసిన బోనీ కపూర్- శ్రీదేవి చిన్న తనయ ఖుషీ కపూర్ ఈ ఏడాది బిగ్ స్క్రీన్‌పై సందడి చేసి ప్రేక్షకులకు టెస్ట్ పెట్టింది. తమిళ్ హిట్ బొమ్మ లవ్ టుడే హిందీ రీమేక్ వర్షన్ లవ్‌యాపాతో అమీర్ ఖాన్ కొడుకు జునైద్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటే బొమ్మ బాక్సాఫీస్ బాంబ్‌గా మారింది. ఖుషీని యాక్టింగ్ రాదంటూ ట్రోల్ చేసేశారు. చేసేది లేక మళ్లీ ఓటీటీ బాటే పట్టింది ఖుషీ. ఇక వీరి కజిన్ శానయా కపూర్ కూడా ఆంఖోన్ కి గుస్తాఖియాతో తెరంగేట్రం చేస్తే మూవీ ఎప్పుడు వచ్చి పోయిందో కూడా తెలియలేదు. స్టార్ కిడ్స్‌కు బీటౌన్ ఆడియన్స్ ఇలాంటి రిజల్ట్ ఇస్తే సైయారాతో లీడ్ హీరోయిన్‌గా మారిన అనీత్ పద్దాని ఓవర్ నైట్ బాలీవుడ్ నయా క్రష్ బ్యూటీగా మార్చేశారు. జీరో ఎక్స్ పెక్టేషన్స్‌తో వచ్చిన ఈ మూవీ రూ. 300 కోట్లకు పైగా రాబట్టుకుని ఇప్పటికీ ఇంకా సక్సెస్ ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. అంటే నెపో కిడ్స్ కాదని సెల్ఫ్ మేడ్ హీరోయిన్‌కి పట్టం కట్టారు బీటౌన్ ఆడియన్స్. దీని బట్టి ఏం అర్థమైందీ స్టార్ కిడ్ హోదా ఎంట్రీ వరకు ఉపయోగపడుతుందేమో కానీ ఆడియన్స్‌ను మెప్పించాలంటే ఫెర్మామెన్స్ చూపించాల్సిందే.
రాజాసాబ్ రచ్చ ముగిసింది.. షూటింగ్ షురూ అయింది..
ఇటీవల జరిగిన షూటింగ్స్ బంద్ కారణంగా రాజాసాబ్ షూటింగ్ ఆగింది. కొద్దీ రోజుల క్రితం బంద్ ముగియడంతో పెండింగ్ లో ఉన్న సినిమాలు అన్ని షూటింగ్స్ స్టార్ట్ చేసాయి. కానీ రాజాసాబ్ షూటింగ్ స్టార్ట్ కాలేదు. బంద్ సమయంలో ఫెడరేషన్ కు రాజాసాబ్ నిర్మాతకు మధ్య తకరారు నడించింది. దాంతో విశ్వ ప్రసాద్ సినిమా కు వచ్చేది లేదని భీష్మించుకూచున్నారు వర్క్సర్స్. ఈ నేపధ్యంలో ఈ సమస్యపై ఇరు వర్గాలు కూర్చుని చర్చించి పరిష్కరించుకున్నాయి. ఈ రోజు రాజాసాబ్ షూటింగ్ షురూ చేసారు. హైదరాబాద్ లోని అజీజ్ నగర్ PMF స్టూడియో లో షూట్ స్టార్ట్ చేసారు. 3-4 రోజుల ప్యాచ్ వర్క్ తో టాకీ పూర్తి అవుతుంది. మూడు సాంగ్స్, ఒక ఫైట్ షూట్ బ్యాలన్స్ ఉంది. చక చక షూటింగ్ చేసేసి డిసెంబరు మొదటి వారానికి ఫస్ట్ కాపీ రెడీ చెయ్యాలనేది యూనిట్ ప్లాన్ ఇక ముందు నుండి అనుకున్నట్టు రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా రిలీజ్ కాబోతుంది.