Banakacherla Project: ఈ మధ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య బనకచర్ల ప్రాజెక్టు తీవ్ర వివాదంగా మారింది.. ఎలాగైనా బనకచర్లను అడ్డుకుంటామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించగా.. మిగులు జలాలనేకదా? మేం వాడుకునేది.. అభ్యంతరాలు ఎందుకంటూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశ్నించింది.. అయితే, దీనిపై కేంద్ర మంత్రులను కలిసి ఫిర్యాదులు కూడా చేశారు తెలంగాణ సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిక కేంద్ర సర్కార్ షాక్ ఇచ్చింది.. బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను వెనక్కి పంపింది కేంద్రం.. పర్యావరణ […]
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిపోయింది. కానీ... అంతకు చాలా రోజుల ముందు నుంచే... తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు మీద దృష్టి పెట్టారట సీఎం చంద్రబాబు. శాసనసభ్యుల ప్రతి మూవ్‌మెంట్‌కు సంబంధించిన నివేదికలు తెప్పించుకున్నట్టు తెలుస్తోంది.
శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో పంపిణీ చేసే లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి.. అయితే, లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందన్న ఆరోపణల వెనుక కుట్రకోణం ఉందంటున్నారు ఆలయ ఈవో శ్రీనివాసరావు.. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిపారు.. అంతేకాదు, శ్రీశైలం పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు.. దేవస్థానం సీసీ టీవీ ఫుటేజీ పరిశీలనతో ఆ కుట్రకోణం వెలుగులోకి వచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.. శ్రీశైలం దేవస్థానంపై దుష్ప్రచారం చేసేలా కుట్రకు పాల్పడ్డారని ప్రభుత్వానికి ఈవో నివేదిక ఇచ్చారు..
తిరుమల శ్రీవారి గర్భాలయంలో అడుగుపెట్టి భక్తిపారవశ్యంలో మునిగితేలుతారు.. ఇప్పుడు శ్రీవారి గర్భాలయం నమూనాతో నాన్‌వెజ్ హోటల్ పెట్టడంపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయితే, తాము శ్రీవారిపై భక్తితోనే ఏర్పాటు చేశాం అంటున్నారు నిర్వాహకులు
పీవీఎన్ మాధవ్ పూర్తి పేరు పోకల వంశీ నాగేంద్ర మాధవ్. 1973 ఆగష్టు 10వ తేదీన.. విశాఖ జిల్లా మద్దిలపాలెంలో జన్మించారు. మాధవ్ ఉన్నత విద్యావంతుడు. కాస్ట్ అకౌంటెంట్ కోర్సు చేశారు. తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో MBA చదివారు. ఏకకాలంలో PGDCS, PGDAS పూర్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెంచుతున్న ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి..ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ, నవీన్‌లను అదుపులోకి తీసుకున్నారు సిట్ పోలీసులు.. ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రూ.8.20 కోట్ల రూపాయలు తరలించినట్టు బాలాజీపై ఆరోపణలు ఉండగా.. ఇండోర్ లో బాలాజీని అదుపులోకి తీసుకున్నారు సిట్ పోలీసులు.
నామినేషన్ల దాఖలు ఇవాళ్టితో ముగిసినా.. రేపు అధికారికంగా రాష్ట్ర అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నా.. పార్టీ రాష్ట్ర కొత్త సారథిగా మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ పేరునే పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పు ఖాయం అనేది స్పష్టం అయ్యింది.. రాష్ట్ర అధ్యక్ష పదవికి పీవీఎన్ మాధవ్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత నామినేషన్ వేశారు.. మొత్తం ఐదు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు మాధవ్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం రోజు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటనలో.. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు..