గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు కోర్టులో భారీ ఉపశమనం లభించింది.. ఏలూరు జిల్లాలోని నూజివీడు కోర్టు తాజా వల్లభనేని వంశీకి బెయిల్ ఇచ్చింది.. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరు చేసింది నూజివీడు కోర్టు.. అయితే, లక్ష రూపాయలకు సంబంధించి 2 ష్యూరిటీలు, వారానికి 2 సార్లు స్టేషన్ కి రావాలంటూ షరతులు పెట్టింది..
పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు జరిగిన యువ విభాగ సమావేశంలో పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు జగన్.. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని.. ఆ తర్వాత చివర్లో పాదయాత్ర ఉంటుంది.. మీతో కలిసి ప్రయాణం చేసే రోజులు రాబోతున్నాయి అని వ్యాఖ్యానించారు వైఎస్ జగన్..
నేను రౌడీలతో పోరాటం చేస్తున్నా.. రాష్ట్రంలో వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం జరుగుతుందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పర్యటనలో.. పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత ప్రజా వేదికపై మాట్లాడుతూ.. .వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం జరుగుతుందన్నారు.. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయ్యింది.. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ఇంటింటికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం.
ప్రేమించుకున్నారు.. కలిసి నడుద్దాం అనుకున్నారు.. ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.. నీకు నేను.. నాకు నువ్వు అనుకున్నారు.. ఈ ఇద్దరి ప్రేమకు ఆ రెండు కుటుంబాలు కూడా ఒప్పుకున్నాయి.. ఇద్దరూ ఒకే దగ్గర ఉద్యోగంలో చేరారు.. అయితే, వారి ప్రేమను మృత్యువు కూడా విడదీయలేదు.. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన పేలుడు ఘటన చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపగా.. మృతదేహాలకు పఠాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం చేశారు వైద్యులు
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి యమా డిమాండ్ ఏర్పడింది. త్వరలోనే... స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న క్రమంలో... డీసీసీ అధ్యక్షులకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోందట ఏఐసీసీ. అదే జరిగితే... రేపటి రోజున టిక్కెట్ల కేటాయింపుల కీలక పాత్ర ఉంటుందిగనుక... ఆ పోస్ట్‌కు యమా క్రేజ్ ఏర్పడిందట.
ఓరుగల్లు కాంగ్రెస్‌లో అంతర్గత పోరు... ఇప్పుడు వీధికెక్కింది. అది ఏ రేంజ్లో అంటే....చివరికి రాష్ట్ర నాయకత్వాన్ని కూడా సవాల్ చేసేంతలా. దీని గురించే ఇప్పుడు కాంగ్రెస్ సర్కిల్స్‌లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చిన కొత్తలో... క్రమశిక్షణ ముఖ్యం, ఉల్లంఘన ఎక్కడ జరిగినా ఉపేక్షించేది లేదంటూ... చాలా గొప్పగా చెప్పేశారు.
ఏపీలో డైలాగ్ వార్ పీక్స్‌కు చేరుతోంది. సినిమా డైలాగ్స్ కన్నా... పొలిటికల్ స్క్రీన్ మీద పంచ్‌లు పేలిపోతున్నాయి. కొన్ని హాట్ టాపిక్ అవుతుంటే... మరికొన్ని తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. పుష్ప 2 సినిమాలోని రప్ప రప్ప డైలాగ్ చుట్టూ రాజకీయ అగ్గి రగులుకుంటోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ పల్నాడు టూర్లో మొదలైన డైలాగ్ వివాదం...
ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటు ఏపీ పాలిటిక్స్‌లో కూడా పెద్దగా పరియం అక్కర్లేని పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి. రాజకీయాల్లో మిస్టర్ కూల్ అన్న పేరుంది ఆయనకు. దాదాపు పది నెలల క్రితం వరకు ఆయన పొలిటికల్ లైఫ్ సాఫీగానే ఉన్నట్టు అనిపించింది.