MP Byreddy Shabari: మెడికల్ కాలేజీల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. అయితే, మాజీ సీఎం వైఎస్ జగన్ కు సూపర్ స్పెషాలిటీ, జనరల్ హాస్పిటల్ లకు తేడా తెలియదని విమర్శించారు ఎంపీ బైరెడ్డి శబరి.. నంద్యాల జీజీహెచ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన ఎంపీ శబరి.. స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నంద్యాల మెడికల్ కాలేజీలో హాస్పిటల్ ఎక్కడ ఉందో మాజీ సీఎం జగన్ , మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి చూపించాలని కోరారు. కాలేజీ లోపల హాస్పిటల్ ఉంటే ఆహా ఓహో అని ప్రశంసించి శిల్పారవిని శాలువాతో సన్మానించి, బొకే ఇస్తామని ఎద్దేవా చేశారమే.
Read Also: CJI BR Gavai: “విష్ణువు”పై సీజేఐ గవాయ్ వాఖ్యలు వివాదాస్పదం.. రాష్ట్రపతికి న్యాయవాది లేఖ..
వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో మెడికల్ కాలేజీల్లో కేవలం పునాదులను ఫిల్లర్లను మాత్రమే నిర్మించిందని, ఇదే విధానంలో కాలేజీని నిర్మించడానికి 30 ఏళ్లు పడుతుందన్నారు ఎంపీ బైరెడ్డి శబరి. తమ ప్రభుత్వం పీపీపీ విధానంలో 8 నెలలో కాలేజీల్లో నిర్మాణాలు చేశామన్నారు.. పేదల కోసం మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నామని అప్పట్లో సీఎం జగన్ చెప్పారని గుర్తు చేశారు ఎంపీ బైరెడ్డి శబరి. కానీ బీ కేటగిరిలో ప్రైవేట్ కాలేజీల స్థాయిలో ఫీజులను ఎందుకు పెట్టారని, రూ 60 లక్షల నుండి రూ కోటి ఖర్చుపెట్టి పేద విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. తల్లితో మాట్లాడని వారు… విగ్రహాలతో మాట్లాడుతున్నారని.. మెడికల్ కాలేజీలో కూడా విగ్రహం పెట్టారన్నారు ఎంపీ బైరెడ్డి శబరి.మనం కూడా వెళ్లి విగ్రహంతో మాట్లాడదామని వ్యంగంగా అన్నారమే. వైస్సార్సీపీ నేతలకు లండన్ లో ట్రీట్మెంట్ సరిపోవడం లేదని, రాష్ట్రంలోని ప్రతి హాస్పిటల్ లో సైక్రియటిక్ వార్డులను అభివృద్ధి చేయాలని మంత్రి సత్య కుమార్ ను కోరారు ఎంపీ బైరెడ్డి శబరి..