విజయవాడ సబ్ జైలు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విడుదలయ్యారు.. ఫిబ్రవరి 16వ తేదీన హైదరాబాద్లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన విజయవాడ పటమట పోలీసులు.. హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించారు.. వల్లభనేని వంశీని బెదిరింపులు, కిడ్నాప్ కేసులో అరస్ట్ చేసిన ఆ తర్వాత వరుసగా 11 కేసులు నమోదు అయ్యాయి..
గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.. 222 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.. దీంతో, గన్నవరం ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు పైలెట్.. విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు..
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా... ఇంటింటికి ప్రజా ప్రతినిధులు, పార్టీల నేతలు వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించాలని నిర్ణయించారు.దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించింది. తమ ఏడాది ఘనతను జనంలోకి దూకుడుగా తీసుకువెళ్ళాలని డిసైడయ్యారు టీడీపీ లీడర్స్.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఇంట్రస్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే... అవి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కాదు. అలాంటి పోరు ఉంటే... అది షరా మామూలే. కానీ... ఇక్కడ మాత్రం కాస్త తేడాగా ఉందట. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేంద్రంగా నడుస్తున్న వ్యవహారాలు ఆసక్తికరంగా మారుతున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్నారు దువ్వాడ.
గుంటూరు జిల్లా జైలు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ విడుదలయ్యారు.. టీడీపీ కార్యకర్త రాజుపై దాడికేసులో సోమవారం రోజు సురేష్కు బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు. అయితే, షూరిటీలు సమర్పించడంలో అలస్యం కావడంతో ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు నందిగం సురేష్..
గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా తరహాలో నిర్వహిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. వరుసగా మూడోసారి గోదావరి పుష్కరాలను ముఖ్యమంత్రిగా నిర్వహించే బాధ్యత నాకేదెక్కిందని హర్షం వెలిబుచ్చారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం దేవుడు తనకే కల్పించాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఉగ్ర కలకలం సృష్టిస్తోంది.. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు.. పలు బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు ఉగ్రవాదునలు.. రహస్యంగా అదుపులోకి తీసుకున్నారు తమిళనాడు పోలీసులు.. స్థానిక పోలీసుల సహకారంతో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదుపులోకి తీసుకొని తమిళనాడుకు తరలించారు.
వైఎస్ జగన్ భద్రత వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ.. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.. ఈ లంచ్ మోషన్ పిటిషన్ ను వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేశారు..
పాయకరావుపేట బీసీ బాలికల కాలేజ్ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు ఊహించని ఘటన ఎదురైంది.. హాస్టల్లో బాలికలతో కలిసి భోజనం చేస్తుండగా.. ఆమె తన ఫ్లేట్ వైపు చూసి.. కొంత ఆశ్చర్యానికి గురయ్యారు.