ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. నంద్యాల జిల్లాలో అరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇచ్చిన పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ ప్రాజెక్టును రద్దు చేసింది.. 800 మెగావాట్ల అవుకు పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు..
ఈ రోజు గుంటూరు కలెక్టర్ గ్రీవెన్స్ లో ఓ ఎనిమిదేళ్ల బాలుడు ప్రత్యక్షమయ్యారు.. స్కూల్ బ్యాగ్ వేసుకునని.. చేతిలో ఓ ఫిర్యాదు పేపర్ పట్టుకుని కలెక్టరేట్లో నిర్వహిస్తోన్న గ్రీవెన్స్‌కు వచ్చాడు.. అయితే, ఆ బాలుడిని చూసి అంతా షాక్ అయ్యారు.. ఆ బుడతడికి వచ్చిన కష్టమేంటి? కలెక్టర్ దగ్గరకు ఎందుకు వచ్చాడు అనే రకరకాల ప్రశ్నలు వారి బుర్రల్లో మెదిలాయి..
దశాబ్దాల కలగా మిగిలిన కొల్లేరు సమస్యల పరిష్కారం ఎదురు చూస్తున్నారు ఇక్కడి ప్రజలు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో త్వరలోనే అది సాధ్యమవుతుందని కూడా నమ్ముతున్నారట. ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీ నేతలు కొందర్ని అనుమానాలు, అసంతృప్తి వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణాలు కూడా గట్టిగానే ఉన్నాయి. కేంద్ర సాధికారిక కమిటీ ఇటీవల కొల్లేరు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. రెండు రోజుల పాటు అయా ప్రాంతాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతి పత్రాలు స్వీకరించింది.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో యాక్టివ్‌గా ఉండడానికి వైసీపీ నేతలు అస్సలు ఇష్టపడడం లేదట. 2024 ఎన్నికల ముందు ఇంకేముంది.... అధికారం మనదే....., మన నాయకురాలు డిప్యూటీ సీఎం అయిపోతున్నారంటూ నానా హంగామా చేసిన నాయకులు ఇప్పుడసలు పత్తా లేకుండా పోయారట. డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ నాడు రచ్చ చేసిన వాళ్ళలో ఒక్కరి మాట కూడా నేడు నియోజకవర్గంలో వినిపించడం లేదని అంటున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం శీతకన్ను వేసిందంటూ తెగ ఫీలవుతున్నారట తమ్ముళ్లు. విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, కైకలూరు సెగ్మెంట్స్‌లో ఇప్పటి వరకు పార్టీ ఇన్ఛార్జ్లు లేరు. ఈ మూడింటిలో రెండు చోట్ల బీజేపీ, అవనిగడ్డలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉంటే అందులో 13 చోట్ల టీడీపీ గెలవగా... మిగతా మూడింటిని మిత్రపక్షాలు కైవసం చేసుకున్నాయి. ఎన్నికల సమయంలో ఇక్కడ నుంచి పోటీ చేయటానికి కొందరు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేసినా... మిత్రపక్షాలకు…
అంబటి రాంబాబును గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి కోఆర్డినేటర్‌గా నియమించారు పార్టీ అధినేత వైఎస్ జగన్.. అంబటి 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.. 2024 ఎన్నికల్లో పరాజయం పాలైన విషయం విదితమే.. అయితే, ఈ తాజా పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు.. నాది చాలా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం.. రేపల్లెలో ప్రారంభమైన నా రాజకీయ జీవితం సత్తెనపల్లి నుండి గుంటూరుకు వచ్చింది..
బీజేపీ తెలంగాణ అధ్యక్ష ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. జులై ఒకటిన పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన ఉంటుంది. నెలల తరబడి పేరుకుపోయిన నైరాశ్యం, కేడర్‌లో అసహనం, ఆశావహుల నిష్టూరాల్లాంటి వాటన్నిటికీ తెరపడబోతోంది. కొత్త అధ్యక్షుడు ఎవరన్న విషయంలో.... రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న విషయంలో కేంద్ర పెద్దలు కూడా ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడే ఓ కొత్త చర్చ మొదలైంది రాష్ట్ర పార్టీ వర్గాల్లో.. ఢిల్లీ పెద్దోళ్లు ఎవరికి టిక్ పెట్టి ఉంటారు? పాతోళ్ళకి…
ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువ శాతం ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు చుట్టే తిరుగుతున్నాయి. అయితే... తెలంగాణలో వ్యవహారం కాస్త డిఫరెంట్‌గా ఉందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. మొదట ఈ ప్రాజెక్ట్‌ని బేస్ చేసుకుని...కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చింది బీఆర్ఎస్. కానీ... ఆ తర్వాత ప్రభుత్వం వైపు నుంచి రివర్స్ అటాక్ మొదలవడంతో మేటర్ రసకందాయంలో పడిందని చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో సమావేశం పెట్టింది సర్కార్.
రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం.. అవినీతి జరగలేదని 164 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరైనా కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేస్తారా ? అంటూ ఆయన సవాలు విసిరారు.. ఈ మధ్యే టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ జడ్పీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రమణ్యం.. కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు..