CM Chandrababu: విశాఖపట్నం వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి మూడో స్థానంలోకి వచ్చాం… రియల్ టైమ్ గవర్నెన్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఒకప్పుడు జాబ్ వర్క్ కి పరిమితం అయ్యే ఐటీ కంపెనీలు, ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నాయి.. ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా భారతీయులు ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించిన వారిలో ఉండడం మనకు గర్వ కారణంగా చెప్పుకొచ్చారు.. 2047 మన ఆర్థిక వ్యవస్థ మొదటి స్థానంలో ఉండాలన్న లక్ష్యం ఎంతో దూరంలో లేదు. ఖచ్చితంగా మనం సాధించ గలం అనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు..
Read Also: Election Commission: ఇకపై ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు.. ఈసీ కొత్త రూల్స్
ఇక, ఇంగ్లాండ్ పర్యటన కు వెళ్తే మ్యూజియంలోకి నన్ను అనుమతించలేదు… కోహినూరు ను క్లైమ్ చేస్తున్న కారణంగానే ఆ విధంగా వ్యవహరించి ఉంటారని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.. అయితే, బ్రిటీష్‌వాళ్లు అన్ని కొల్లగొట్టినా ఇంగ్లీష్ మనకు వదిలిపెట్టారని వ్యాఖ్యానించారు.. ఓపెన్ స్క్రై పాలసీ కారణగంగా మొదటి సారి హైదరాబాద్ కు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ, గ్రీన్ ఫీల్డ్ రహదారి తెచ్చాం అన్నారు.. ఏపీకి వున్న 1000 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఆర్థిక అభివృద్ధికి చోదకంగా మారుతుందన్నారు.. ఆగస్టు నాటికి ఇంటర్నేషనల్ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు సీఎం చంద్రబాబు.. ఐటీ రంగంలో భారత్ చాలా బలంగా ఉంది.. గణితం, ఆంగ్లంలో ముందుండడం కలిసి వస్తోందన్నారు.. వివిధ వ్యాపార ఆలోచనలతో యువత ముందుకొచ్చింది.. ఉద్యోగాలు ఇచ్చే విధంగా యువత తయారు కావాలని పిలుపునిచ్చారు.. ఇటీవల ఓ సర్వేలో మహిళల భద్రతకు సురక్షితమైన నగరంగా విశాఖ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఓ వైపు సముద్రం, మరోవైపు అందమైన కొండలు. అన్నింటికీ మించి మంచి మనసున్న మనుషులు ఈ నగరం ప్రత్యేకత అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..