నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి… ముందుగా అంచనా వేసిన ప్రకారం జూన్ 1వ తేదీకి రెండు రోజులు ఆసల్యంగా కేరళలను తాకాయి రుతుపవనాలు.. ఇవాళ ఉదయం రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది.. ఈ నెల 1వ తేదీనే రుతుపవనాలు రావాల్సి ఉండగా.. రెండు రోజులు ఆలస్యంగా వచ్చినట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం మోహపాత్ర వెల్లడించారు.. వీటి ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు చెప్పారు.. కాగా, గాలి వేగం, వర్షపాత స్థిరత్వం, […]
ప్రమఖ జర్నలిస్టు వినోద్ దువాపై దాఖలైన దేశద్రోహం కేసును కొట్టివేసింది సుప్రీంకోర్టు.. హిమాచల్ ప్రదేశ్ పోలీసులు వినోద్ దువాకు వ్యతిరేకంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను, ఇతర విచారణను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.. ఈ సందర్బంగా 1962 నాటి కోర్టు తీర్పును ప్రస్తావించింది న్యాయస్థానం. ఇలాంటి కేసుల్లో ప్రతి జర్నలిస్టుకు రక్షణ పొందే హక్కుందని వ్యాఖ్యానించింది.. కాగా, గతేడాది మార్చి 30వ తేదీన ప్రసారమైన వినోద్ దువా షో అనే యుట్యూబ్ కార్యక్రమం లో కేంద్ర ప్రభుత్వం […]
టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ యొక్క చెల్లుబాటు కాలం ఇప్పటి వరకు ఏడు సంవత్సరాలు ఉండగా.. ఇకపై జీవితకాలం పనిచేయనుంది.. దీనిపై కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. గత ఏడాదిలో టెట్ వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) పాలక మండలి నిర్ణయించింది. ఇప్పటివరకు టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు మాత్రమే ఉండగా.. ఇకపై దాన్ని జీవితకాలం వ్యాలిడిటీగా మార్చాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఇకపై టెట్‌లో అర్హత […]
ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. మళ్లీ మందు పంపిణీ ఏర్పాట్లలో మునిగిపోయారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. అయితే, మందు కోసం ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ కృష్ణపట్నానికి రావొద్దు అని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు… జిల్లాకు 5 వేల చొప్పున మందులు పంపుతామని.. అధికారులు వాటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. మరి ఆనందయ్య మందు పంపిణీ ఎప్పటి నుంచి అని అంతా ఎదురుచూస్తోన్న సమయంలో.. సోమవారం నుండి అందుబాటులోకి […]
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విదేశీ విమానా సర్వీసులు నిలిచిపోయాయి… ఏప్రిల్ 3వ తేదీ నుంచి తాత్కాలికంగా విదేశీ విమానాలను నిలిపివేశారు అధికారులు.. అయితే, ఇప్పుడు పరిస్థితి కాస్త చేతుల్లోకి రావడంతో.. తిరిగి విదేశీ సర్వీసులను ప్రారంభించారు.. దుబాయ్ నుంచి 65 మంది ప్రవాసాంధ్రులతో రాష్ట్రానికి చేరుకుంది ప్రత్యేక విమానం.. అయితే, ఇవి గతంలో మాదిరి రెగ్యులర్ సర్వీసులు కావు.. వందే భారత్ మిషన్‌లో భాగంగా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు.. దీంతో.. […]
కరోనా మహమ్మారి బారినపడి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి వరుసగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి.. ఇప్పటికే ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు చిన్నారుల్లో భరోసా నింపగా.. కేంద్రం కూడా మేమున్నామంటూ ధైర్యాన్ని చెపుతూ.. వారికి ఆర్థికసాయం ప్రకటించింది.. ఈ జాబితాలో మరో రాష్ట్రం కూడా చేరింది.. కరోనా ఫస్ట్ వేవ్‌తో పాటు సెకండ్ వేవ్ కూడా మహారాష్ట్రను అతలాకుతలం చేసింది.. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగు చూడడమే కాదు.. పెద్ద సంఖ్యలో ప్రజలు […]
కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.. అయితే, వ్యాక్సిన్ కంపెనీల నుంచి కొనుగోలు చేసి 45 ఏళ్ల వారికి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేసిన కేంద్రం.. 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ విషయంలో బాధ్యత రాష్ట్రాలకే వదిలేసింది.. అయితే, కేంద్రమే వ్యాక్సిన్లను సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేయాలనే డిమాండ్ రాష్ట్రాల నుంచి వినిపిస్తోంది.. ఇప్పటికే కేరళ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ వినిపించగా.. ఇవాళ వారికి ఒడిషా తోడైంది.. కేంద్రమే వ్యాక్సిన్లు పంపిణీ […]
కరోనా సమయంలో వైద్యులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణయం తీసుకుంది.. మీడియాతో మాట్లాడిన ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్.. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణయం తీసుకున్నాం.. రూ. 45 వేల నుంచి రూ. 70 వేలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు.. ఇక, జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం పరిశీలిస్తోందని, చర్చిస్తోందన్నారు.. ప్రస్తుతం సుమారు 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు […]