ఈటల రాజేందర్ విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పిస్తూ వచ్చినా.. ఇంత కాలం కాస్త ఓపిక పట్టిన టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు ఈటల.. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.. ఈటల ఎపిసోడ్‌పై స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్.. ఆత్మ గౌరవం కోసం కాదు… ఆత్మ రక్షణ కోసమే టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజీనామా చేశారని ఆరోపించారు.. స్వప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలకు అడ్డు పడే బీజేపీ కాళ్ల వద్ద ఆత్మగౌరవాన్ని ఈటెల […]
మరో రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో ప్రవేశించనున్నాయి నైరుతి రుతుపవనాలు.. నిన్న దక్షిణ కేరళలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు ఈ రోజు కేరళా అంతటా మరియు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్‌లో కొంత భాగంలోకి ప్రవేశించాయి… రాగల 2 నుండి 3 రోజులలో తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ జిల్లాలలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. ఇక, దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు తెలంగాణ నుండి […]
టీఆర్ఎస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్.. ఆయన త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోనున్నారు.. రాజీనామా సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు ఈటల.. అయితే.. ఈటల రాజీనామాపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్.. ఘాటు వ్యాఖ్యలుచేశారు.. టీఆర్ఎస్లో ఉన్నన్ని రోజులు బీసీలు, దళితులు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించిన ఆయన.. ఏడు సంవత్సరాలు మంత్రి గా ఉన్నావు.. అప్పుడు […]
నెల్లూరు జీజీహెచ్‌లో ఉన్నతస్థానంలో ఉన్న ఓ వైద్యుడు.. తన కామ వాంఛ తీర్చాలంటూ మహిళా హౌజ్ సర్జన్లు, డాక్టర్లతో పాటు మహిళా సిబ్బందిని వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.. కారులో ఒంటరిగా రావాలని, తనతో ఒంటరిగా గడపాలని.. బెదిరింపులకు దిగుతారట.. ఓ హౌజ్ సర్జన్ ఆయనతో ఫోన్లో మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.. నా రూమ్ లో ఏసీ ఉంది వచ్చేయ్ అని అంటావా..? రాకపోతే కాళ్లూ చేతులూ కట్టేసి నోటికి ప్లాస్టర్ […]
ఉన్నతస్థానంలో ఉన్న ఓ వైద్యుడికి ఓ పాడుబుద్ది ఉంది.. ఆయనకు కామ వాంఛలు ఎక్కువట.. అదును దొరికితే చాలు.. నా రూమ్‌కి వస్తావా? నా రూమ్‌లో ఏసీ ఉంది..? నీ రెండు చేతులూ కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేసి ఎత్తుకుపోతా..? అంటూ ఫోన్లో వేధించడం చేస్తున్నారట.. అయితే, ఓ హౌజ్ సర్జన్ అయ్యగారి నీచ శృంగార పురాణాన్ని బయటపెట్టారు.. ఇప్పుడు నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ ఆడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఆయన.. […]
కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు వదిలారు.. ఇక, సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్యే కాదు.. మృతుల సంఖ్య కూడా భారీగా నమోదు అయ్యింది.. ప్రముఖులు, ప్రజాప్రతినిధులతో పాటు.. కొందరు రాజకీయ పార్టీల నేతలను కూడా కరోనా ప్రాణాలు తీసింది.. ఇవాళ టీఆర్ఎస్ నేత, కార్మిక సంఘాల నేత, మహబూబాబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ మాడ్గుల నట్వర్… ఇవాళ ఉదయం మరణించారు.. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ […]
మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ముహూర్తం ఖరారైందని.. శుక్రవారం రోజు ఆయన రాజీనామా చేయడం ఖాయమనే ప్రచారం జరిగింది.. కానీ, తాజా సమాచారం ప్రకారం.. ఆయన రాజీనామా విషయంలో మరింత జాప్యం జరిగేలా ఉంది… ముందుగా నిర్ణయించినట్టుగా హైదరాబాద్‌లో రేపు మధ్యాహ్నం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడతారు.. కానీ, రాజీనామా మాత్రం చేయరని తెలుస్తోంది.. రేపు రాజీనామా చేసి.. వచ్చే వారం ఢిల్లీ వెళ్లి ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం ఉంది.. […]
తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్… చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు పదవులు ఖాళీ కావడంతో ప్రొటెం చైర్మన్‌ను గవర్నర్ నియమించారు. మండలికి చైర్మన్‌ను ఎన్నుకునే వరకు భూపాల్ రెడ్డి ఆ పదవిలో కొనసాగనున్నారు. కొత్తగా ఎన్నికయ్యే మండలి సభ్యుల చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించడం, కొత్త చైర్మన్‌ను ఎన్నుకోవటం, ఇతర మండలి వ్యవహారాలు చూసుకొంటారు. సాధారణ […]
వ్యాక్సిన్ల కోసం స్థానిక నేతలు దౌర్జన్యానికి దిగడం చర్చగా మారింది.. అసలే వ్యాక్సిన్ల కొరత ఉండడంతో.. ఓ క్రమ పద్దతి ప్రకారం వ్యాక్సిన్లు పంపిణీ చేస్తోంది సర్కార్.. అయితే, ఇవాళ హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో ఓ పార్టీకి చెందిన స్థానిక నేతలు దౌర్జన్యానికి దిగారు.. సూపర్ స్పైడర్స్ కు ఇవ్వాల్సిన టోకెన్లు తమ అనుచరుల కుటుంబసభ్యులకు ఇవ్వాలని వీరంగం సృష్టించారు.. దీంతో.. నిజమైన సూపర్ స్పైడర్స్ కు అన్యాయం జరుగుతుందంటూ వాక్సిన్ వేసేందుకు నిరాకరించారు వైద్యులు.. […]
వ్యాక్సిన్ల విషయంలో క్రమంగా రాష్ట్రాలను కదులుతున్నాయి… కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా లాంటి రాష్ట్రాలు ఇప్పటికే వ్యాక్సిన్‌పై కేంద్రాన్ని డిమాండ్ చేయగా.. తాజాగా, ఈ పోరాటంలో చేరారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన ఏపీ సీఎం.. వ్యాక్సిన్లకు గ్లోబల్ టెండర్లు వ్యవహారాన్ని లేఖల్లో పేర్కొన్నారు.. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలందరూ సింగిల్ వాయిస్ మీద ఉండాలని కోరారు వైఎస్ […]