-
విద్యాసంస్థల ప్రారంభానికి సిద్ధమవుతున్న కేరళ
భారత్‌లో వెలుగుచూస్తోన్న కరోనా పాజిటివ్ కేసుల్లో.. ఇంకా మెజార్టీ కేసులు కేరళలోనే వెలుగుచూస్తున్నాయి.. ఇవాళ ఆ రాష్ట్రంలో కొత్తగా 19,675 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45,59,628కి పెరిగింది. ఇవాళ మరో 142 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. దీంతో.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 24,039కి చేరింది. అయితే, ఇక, విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది కేరళ ప్రభుత్వం.. నవంబర్ 1వ తేదీ నుంచి కేరళలో విద్యాసంస్థలు […] -
వణికిపోతోన్న అమెరికా.. భారత్‌లో ఆందోళన..!
కోవిడ్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రపంచాన్ని.. ఇప్పుడు హవానా సిండ్రోమ్ వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే అమెరికాను హడలెత్తిస్తున్న హవానా సిండ్రోమ్ భారత్‌కు వ్యాపించిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నెల మొదట్లో భారత్‌లో పర్యటించిన అమెరికా ఇంటెలిజన్స్ అధికారిలో ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో భారత్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సీఐఏ డైరెక్టర్‌కు హవానా సిండ్రోమ్ లక్షణాలపై ప్రస్తుతం అమెరికా దర్యాప్తు జరుపుతోంది. ముఖ్యంగా అమెరికా దౌత్యవేత్తలు, ఇంటెలిజన్స్ అధికారులు మాత్రమే వాహనా సిండ్రోమ్ […] -
టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. మరింత దూకుడుగా ఈడీ..!
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు మరింత ముమ్మరం చేయనుంది. గత 20 రోజులుగా మనీలాండరింగ్ కేసలో దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.. విదేశాల నుండి డ్రగ్స్ దిగుమతి చేసిన కెల్విన్ బ్యాంక్ ఖాతాలతో నటుల స్టేట్ మెంట్లను పరిశీలించింది. ఎక్సైజ్ శాఖ విచారణలో ఇప్పటికే 16 మంది సెలబ్రిటీలకు క్లిన్ చిట్ దక్కింది. అయితే ఎక్సైజ్ విచారణతో సంబంధం లేకుండా ఈడీ దర్యాప్తు కొనసాగించింది. ఇక, ఇవాళ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తరుణ్ విచారణ ముగిసింది. […] -
అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు.. ఈసారి వాడీవేడీగా..!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలను వారానికి పైగా నిర్వహించాలన్న ఆలోచనతో అధికార పార్టీ ఉన్నట్టు సమాచారం. బీఏపీ సమావేశంలో చర్చించి… ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలన్న అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటారు. గత అసెంబ్లీ సమావేశాలు మార్చి 15న మొదలై.. 26న ముగిశాయి. ఇక, అసెంబ్లీ సమావేశాలకు అధికార, విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దళితబంధు పథకం కోసం కొత్త చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టి…ఆమోదించుకోవాలని భావిస్తోంది. […] -
4 నెలల డెడ్‌లైన్.. టీఎస్ఆర్టీసీ ప్రైవేట్ పరం..?
ఆర్టీసీ ఛైర్మన్ బాజి రెడ్డి గోవర్దన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు ఐదు నెలల్లో ఆర్టీసీ గాడిలో పడకపోతే సంస్థను ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. సంస్థ ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తెరిగి పని తీరు మెరుగు పర్చుకోవాలని సూచించారు బాజిరెడ్డి.. ఇక, ఆర్టీసీ యూనియన్ రద్దు చేసిన తర్వాత.. సంక్షేమ మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. ఒక ఆడ, ఒక మగ అధికారులతో కమిటీ ఉంటుందని.. సమస్యలు ఏవైనా ఉంటే చర్చించి […] -
ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిన అవసరమే లేదు.. లీటర్‌పై రూ.40 దోచుకుంటున్నారు..!
ప్రజా సంగ్రామ యాత్రలో అధికార టీఆర్ఎస్తో పాటు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. బస్సు చార్జీలు, కరెంట్ చార్జీలు పెంచితే మెడలు వంచుతాం అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. మంచి జరిగితే రాష్ట్రం, చెడు జరిగితే కేంద్రంది అంటారంటూ ఫైర్ అయిన ఆయన.. లీటర్ పెట్రోల్‌పై రూ.26 వ్యాట్ , రూ. 14 టాక్స్ తీసుకుంటున్నారని.. మళ్లీ […] -
కరోనా ఆపలేకపోయింది.. బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్..
కరోనా మహమ్మారి ఐపీఎల్‌ను వెంటాడుతూనే ఉంది… తాజాగా, సన్‌రైజర్స్ బౌలర్ నటరాజన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.. దీంతో.. అతడిని ఐసోలేషన్‌లో పెట్టారు.. నటరాజన్‌తో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న మరో ప్లేయర్ విజయ్ శంకర్.. టీమ్ మేనేజర్ విజయ్‌కుమార్, ఫిజియో శ్యామ్ సుందర్, డాక్టర్ అంజనా వన్నన్, లాజిస్టిక్స్ మేనేజర్ తుషార్ ఖేడ్కర్, నెట్ బౌలర్ పెరియసామిని కూడా ఐసోలేషన్‌కు తరలించారు.. అయితే, కరోనా కలకలంతో ఐపీఎల్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన […] -
కేఆర్ఎంబీకి మరో లేఖ.. ఏపీని నిలువరించండి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విషయంలో ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఒకరిపై ఒకరు మరీ పోటీపడి ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. ఒక రాష్ట్రం విధానం.. మరో రాష్ట్రానికి నచ్చడంలేదు.. ఇంకో రాష్ట్రం అవలంభిస్తున్న వైఖరి పక్క రాష్ట్రం జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చింది.. తాజాగా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి మరో లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం.. కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ రాసిన లేఖలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం డ్యామ్ […] -
కరోనా మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా.. కేంద్రం నిర్ణయం
కరోనా మహమ్మారి బారినపడి చనిపోయినవారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని నిర్ణయించింది కేంద్రం.. ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ గైడ్‌లైన్స్ విడుదల చేసింది.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనుంది కేంద్రం.. ఈ మొత్తాన్ని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ ద్వారా ఇస్తామని పేర్కొంది. ఈ మొత్తాన్ని పొందాలంటే సదరు వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు […] -
ఇక క్షేత్రస్థాయి పర్యటనలు.. సీఎం జగన్ కీలక నిర్ణయం..!
ఇక, క్షేత్రస్థాయిలో పర్యటనలకు సిద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో దీనిపై సంకేతాలు ఇచ్చారు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమన్న ఆయన.. అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించిన సీఎం జగన్.. డిసెంబర్ నుంచి నేను కూడా సచివాలయాలను సందర్శిస్తానని తెలిపారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో గృహనిర్మాణం, ఉపాధిహామీ పనులు, వైయస్సార్ అర్బన్ క్లినిక్స్, గ్రామ, వార్డు […]
తాజావార్తలు
-
Pasunuri Narahari Surrender : పసునూరి నరహరి సరెండర్.. మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ.. డీజీపీ 45 లక్షల చెక్
-
Best Phone Under 40000: వన్ ప్లస్ నార్డ్ 6, ఐక్యూ నియో 10 5G, వివో వి60: వీటిలో ఏది బెస్ట్ ఫోన్ ?
-
Thalliki Vandanam Status : తల్లికి వందనం స్టేటస్.. 2 నిమిషాల్లో చెక్ చేయండి ఇలా.!
-
Mamata Banerjee: కదులుతున్న తృణమూల్ పునాదులు.. వరుస షాక్‌లతో దీదీ విలవిల..
-
Pakistan-China: జిన్‌పింగ్‌తో షెహబాజ్ షరీఫ్ భేటీ.. కాశ్మీర్‌పై కవ్వింపులు.. మండిపడ్డ భారత్
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!