Prabhas : పీపుల్ మీడియాని ఆదుకునేందుకు రెబల్ స్టార్ రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ది రాజాసాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ప్లాప్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ నష్టాలు చూసింది. ‘ది రాజా సాబ్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ, నిర్మాతలకు అండగా నిలవాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారు.
Also Read : AA 22 : అల్లు అర్జున్ – అట్లీ సినిమా ఫస్ట్ లుక్ & గ్లిమ్స్ రిలీజ్ డేట్ లాక్
Also Read
ఇటీవల నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ను కలిసిన ప్రభాస్ పీపుల్ మీడియ బ్యానర్‌లో మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చారట. సాధారణంగా ఒక సినిమా ఫలితం తేడా కొడితే హీరోలు తర్వాతి ప్రాజెక్టుల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తారు. కానీ ప్రభాస్ మాత్రం నిర్మాతలకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ తెలుగు హక్కులను కొనుగోలు చేసి భారీగా నష్టపోయింది. ఆ సమయంలోనే వారిని ఆదుకుంటానని ప్రభాస్ మాట ఇచ్చారు. దాని ఫలితంగానే ‘ది రాజా సాబ్’ పట్టాలెక్కింది. ఇప్పుడు ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకోవడంతో, మరోసారి ఆ బ్యానర్‌కు లాభాలు తెచ్చిపెట్టేలా ఒక భారీ ప్రాజెక్ట్ చేసేందుకు ప్రభాస్ సిద్ధమయ్యారు. ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన అభిమానులు “మా హీరో బంగారం” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి, స్పిరిట్, ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు ఫినిష్ అయ్యాక పీపుల్ మీడియాలో సినిమా చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?