మరో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది నోకియా.. అతి తక్కువ ధరకే 4జీ ఫీచర్ ఫోన్‌ను భారత్ మార్కెట్‌లోకి విడుదల చేసింది.. నోకియా 110 4జీని హెచ్ఎండీ గ్లోబల్ లాంఛ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుండగా.. యల్లో ఆక్వా, బ్లాక్ కలర్‌లో లభించే ఈ ఫోన్లు జులై 24 నుంచి అమ్మకాలకు సిద్ధంగా ఉంటాయని ప్రకటించింది ఆ సంస్థ.. క్లాసిక్, నియోల మేళవింపుతో నోకియా 110 4జీ స్లీక్ న్యూ డిజైన్, అసాధారణ ఫీచర్లతో ఆకట్టుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.. సులభంగా వినియోగించడంతో పాటు అందుబాటు ధరలో మెరుగైన నాణ్యతతో కూడిన సీమ్‌లెస్ అనుభూతిని ఇస్తుందంటున్నారు.. ఇక, దీని ధర రూ 2799గా ప్రకటించింది నోకియా. హెచ్‌డీ వాయిస్ కాలింగ్, 128 ఎంబీ ర్యామ్, 48 ఎంబీ అంతర్గత స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డు, 32 జీబీ, 0.8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 30 ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్, 1,020ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని నోకియా పేర్కొంది.