నెల మొత్తం పనిచేసి.. ఎప్పుడు తమ ఖాతాల్లో జీతం డబ్బులు పడతాయా? అని ఎదురుచూస్తుంటారు వేతన జీవులు.. ఇక ఫించన్ దారులు పరిస్థితి కూడా అంతే.. తీరా ఆ మొత్తం జమ కావాల్సిన సమయానికి బ్యాంకులకు సెలవు వచ్చాయంటే.. మళ్లీ వర్కింగ్ డే ఎప్పుడా అని చూడాల్సిన పరిస్థితి.. అయితే, ఆ కష్టాలు ఇక ఉండవు.. ఉద్యోగులకు, పెన్షన్ దారులకు రిజర్వ్ బ్యంక్ ఆఫ్ ఇండియా వెసులుబాటు కల్పించింది. ఇక మీదట వేతనం, పింఛను డబ్బులు సెలవు రోజుల్లోనూ జమకానున్నాయి. ఆర్బీఐ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనలలో మార్పుల నేపథ్యంలో… సెలవు రోజుల్లో కూడా వేతనం, పింఛను డబ్బు సంబంధిత వ్యక్తుల ఖాతాల్లో జమ కానున్నాయి.. ఇది ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది.. అంటే, వేతనాలు, పింఛను, వడ్డీ, ఈఎంఐలు, టెలిఫోన్Iగ్యాస్ బిల్లులు, సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ వంటివన్నీ ఒకటో తేదీనే జమతో పాటు.. కటింగ్‌లు కూడా జరగనున్నాయన్నమాట.