భారత్ కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది… కాకపోతే.. రోజువారి కేసుల్లో హెచ్చుతగ్గులు మాత్రం నమోదు అవుతున్నాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 39,097 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 546 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 35,087 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,32,159కు చేరుకోగా… రికవరీ కేసులు 3,05,03,166కి పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,20,016కు చేరగా… ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,08,977 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. మరోవైపు.. ఇప్పటివరకు 42,78,82,261 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం…