మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ తర్జన భర్జన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. రేపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల.. వచ్చేవారం బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక, ఇదే ఊపులో మరిన్ని చేరికలు బీజేపీ తెరలేపుతోంది.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. ఏ పార్టీలో చేరలేదు.. ఏ పార్టీలో చేరాలన్నదానిపై కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటానని తన రాజీనామా సందర్భంగా వెల్లడించారు. […]
హైదరాబాద్ కేంద్రంగా హెచ్1బీ వీసా స్కామ్ జరిగింది.. ఇది.. అమెరికాలో వెలుగుచూసింది.. బెంచ్ అండ్ స్విచ్ తరహా మోసానికి పాల్పడింది టెక్ కంపెనీ.. దీనిపై టెక్సస్‌లోని హూస్టన్ కోర్టులో నేరాన్నిఅంగీకరించారు క్లౌడ్‌జెన్ కంపెనీ ప్రతినిధులు.. థర్డ్ పార్టీ కోసం పని ఉందంటూ భారత్ నుంచి ఉద్యోగులకు బోగస్ కాంట్రాక్టులు సృష్టించిన ఆ సంస్థ… కాంట్రాక్టుల ఆధారంగా హెచ్1బీ వీసాలు జారీ చేసింది… అయితే, అమెరికా చేరుకున్న తర్వాత ఉద్యోగులకు పని వెతికే ప్రయత్నం చేసింది… అడిగిన కంపెనీకి […]
కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తోంది ఏపీ ప్రభుత్వం.. మూడో సారి వాహాన మిత్ర పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.. జులై నెలలో వాహన మిత్ర పథకం అమలు చేయాల్సి ఉన్నా.. కరోనా కష్ట కాలంలో ఆదుకునేందుకు ఈ నెలలోనే వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు మంత్రి పేర్నినాని.. ఈ నెల 15వ తేదీన వాహన మిత్ర పథకం కింద డబ్బులు జమ చేయనున్నట్టు వెల్లడించారు. అయితే; వివిధ వృత్తులకు చెందిన […]
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతరు వైఎస్ షర్మిల… మరోవైపు.. వివిధ జిల్లాల అనుచరులు, వైఎస్ అభిమానులతో సమావేశాలు కూడా నిర్వహించారు.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ దీక్షలు కూడా చేశారు. త్వరలోనే పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు.. అయితే, వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ పేరుపై ఓవైపు ప్రచారం జరుగుతున్నా.. సోషల్ మీడియాలో ఖాతాలో అదేపేరుతో దర్శనమిస్తున్నా.. పార్టీ పేరు ప్రకటించే […]
తెలంగాణలో కోవిడ్ రోజువారి పాజిటివ్ కేసులు క్రమంగా దిగివస్తున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 2,261 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 18 మంది కరోనాతో మృతిచెందారు.. ఇదే సమయంలో.. 3,043 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు వెల్లడించారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు.. తాజా లెక్కలతో రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గిపోయిందని.. రికవరీ రేటు […]
తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్విలపై అత్యాచారానికి పాల్పడినట్టు తేలడంతో.. రోహ్తక్లోని సునేరియా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు డేరా సచ్చా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. అయితే, ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు… తన కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో.. జైలు అధికారులు డేరా బాబాను ఉదయం 7 గంటల సమయంలో రోహ్తక్లోని పీజీఐఎంఎస్ ఆస్పత్రికి భారీ పోలీసు భద్రత మధ్య తరలించారు.. ఆస్పత్రిలో వైద్యులు డేరా బాబాకు వివిధ పరీక్షలు నిర్వహించిన తర్వాత.. తిరిగి […]
బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పరిస్థితి ఏదో చేయబోతే.. ఇంకా ఏదో అయినట్టుగా తయారైంది.. కరోనా బాధితుల కోసం ఆయన ఫాబీఫ్లూ ట్యాబెట్లను పంపిణీ చేస్తే.. అసలే ట్యాబెట్లు దొరకక కష్టాలు పడుతున్న సమయంలో.. పెద్ద ఎత్తున ఆ ట్యాబెట్లను అక్రమంగా నిల్వ చేశారని ఫిర్యాదులు అందాయి.. దీనిపై దాఖలైన పిటిషన్లో డ్రగ్ కంట్రోలర్ విచారణ చేపట్టి.. గౌతం గంభీర్ ఫౌండేషన్ అక్రమంగా ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను నిల్వ చేసిందని.. ఈకేసులో గంభీర్ ఫౌండేషన్ దోషిగా […]
తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో సైతం కరోనా రోగులకు సేవలు అందించడానికి ప్రత్యేక మొబైల్ యూనిట్లను సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. మొదటి విడతలో 30 మొబైల్ ఐసీయూ బస్సులను హైదరాబాద్‌లో ప్రారంభించారు మంత్రి కేటీఆర్.. మొదటి దశలో జిల్లాకు ఒకబస్సును కేటాయిస్తున్నామన్న మంత్రి.. త్వరలో జిల్లాకు రెండు బస్సుల చొప్పున పంపిస్తామన్నారు. ఇది వినూత్న ఆలోచన.. దేశంలోనే ఇలాంటి సేవలు అందించడం మొదటిసారి అని వెల్లడించారు. ఇక, వైద్యులను దేవుడితో సమానంగా చూస్తున్నారు.. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి.. […]
కరోనా మహమ్మారి కారణంగా మరోసారి హజ్ యాత్ర రద్దు చేశారు.. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో.. గత ఏడాది హజ్‌యాత్రను రద్దు చేసిన ఇండోనేషియా.. ఇప్పుడు సెకండ్ వేవ్ నేపథ్యంలో.. వరుసగా రెండో ఏడాది కూడా రద్దు చేసింది. కోవిడ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా హజ్ యాత్రకు ప్రభుత్వం అనుమతించడం లేదని మంత్రి యాకుత్ చోలిల్ కౌమాస్ వెల్లడించారు.. సౌదీ అరేబియా సైతం హజ్‌కు […]
కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. ఇప్పుడు సమావేశాలు అన్నీ జూమ్‌కు పరిమితం అయ్యాయి.. ఇక, ఇవాళ డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో జూమ్ లో సమావేశం నిర్వహించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్.. దీనిపై రేపు గవర్నర్ తమిళిసై ను కలిసి.. వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు.. జిల్లా కేంద్రాలలో డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలెక్టర్లను కలిసి వినతిపత్రం […]