కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. భారత్‌లో ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత కొన్ని రాష్ట్రాలను వెంటాడుతూనే ఉంది.. దీంతో.. 18 ఏళ్లు పైబడినవారికి ఇంకా వ్యాక్సినేషన్ ప్రారంభించలేదు.. అయితే, ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్రం చెబుతోంది.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండో వ్యాక్సిన్లే కాకుండా మరికొన్ని వ్యాక్సిన్ల కూడా అనుమతి ఇచ్చింది.. అయితే, డిసెంబర్ చివరి నాటికి దేశంలో పౌరులందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న […]
తెలంగాణలో వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు సీఎం కేసీఆర్.. దీనిలో భాగంగా.. సర్వే కంపెనీలతో చర్చలు కూడా జరిపారు సీఎస్ సోమేష్‌కుమార్.. ఇవాళ సీఎం కేసీఆర్ వారితో సమావేశమయ్యారు. డిజిటల్ సర్వేపై కీలక ఆదేశాలు జారీ చేశారు.. సర్వేలో భాగంగా ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని, అందులో 3 గ్రామాలను గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎంపిక చేయాలని, మిగతా […]
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.. ఇప్పటికే కేంద్ర నాయకత్వాన్ని కలిసిన ఆయన.. తనకున్న అనుమానాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈటల.. బీజేపీలోకి టచ్‌లోకి వచ్చాడన్న వార్తలు వచ్చినప్పటి నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరో బీజేపీ నేత పెద్దిరెడ్డి.. అసలు ఈటల వస్తే.. పార్టీలో ప్రకంపణలు తప్పవని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.. ఇక, ఆయనను అప్పడి నుంచి బుజ్జగిస్తూనే ఉంది రాష్ట్ర పార్టీ.. ఇప్పటికే […]
దేశ రాజధానిలో ఢిల్లీలో కరోనా వైరస్ రోజువారి పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినా.. మృతుల సంఖ్య మాత్రం ఇంకా బయపెడుతూనే ఉంది.. ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటలలో 576 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒకేరోజు మరో 103 మంది మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 1,287 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకోవడం ఊరటనిచ్చే అంశమే.. దీంతో. ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ […]
కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదు కావడంతో.. ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు వెళ్లాయి.. మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ లాంటి నిర్ణయాలు తీసుకుని కఠినంగా అమలు చేస్తున్నాయి.. మరోవైపు.. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను స్వస్తి చెప్పి.. అక్రమంగా సడలింపులు ఇస్తూ అన్‌లాక్‌లోకి వెళ్లిపోతున్నాయి.. అయితే, అన్‌లాక్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది.. అన్‌లాక్‌కు వెళ్లే సమయంలో.. రాబోయే థర్డ్ వేవ్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం […]
కరోనా వైరస్ ఎందరో ప్రాణాలు తీసింది.. ఇంకా తీస్తూనే ఉంది.. ఇదే సమయంలో.. కోవిడ్ బారినపడి మరణించినవారి మృతదేహాలు తారుమారైన ఘటనలు చాలానే ఉన్నాయి.. కానీ, విజయవాడలో ఓ వింత ఘటన వెలుగు చూసింది.. కరోనాబారినపడిన గిరిజమ్మ అనే మహిళలను బెజవాడ జీజీహెచ్‌లో చేర్చాడు భర్త.. ఆ తర్వాత ఆమె చనిపోయినట్టు ఆస్పత్రి నుంచి సమాచారం ఇచ్చారు.. ఓ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా నిర్వహించారు.. తీరా సీన్ కట్ చేస్తే.. ఆ తంతు జరిగి 15 […]
రాజధాని తరలింపు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.. అతిత్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలించనున్నట్టు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన… సీఆర్డీఏ కేసులకు రాజధాని తరలింపుకు సంబంధం లేదు… అతిత్వరలో విశాఖ కు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని వ్యాఖ్యానించారు.. ఇక, ముఖ్యమంత్రి ఎక్కడ నుంచైనా పరిపాలన సాగించవచ్చు అని తెలిపిన విజయసాయి… రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు కొంత కాలం హైదరాబాద్ నుంచి ఆ తర్వాత విజయవాడ […]
సిటీలు, పట్టణాలు, గ్రామాలు, గూడాలు, మారుమూల ప్రాంతాలనే కాదు.. అడవిలో ఉన్న అన్నల వరకు చేరింది కరోనా వైరస్… కోవిడ్ చికిత్స కోసం వచ్చి.. మావోయిస్టు పార్టీ డివిజినల్ కమిటీ కార్యదర్శి మరియు ఓ కొరియర్ పోలీసులకు చిక్కడంతో ఈ విషయం వెలుగుచూసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం మధ్యాహ్నం సమయంలో మట్వాడా పోలీసులు ములుగు క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ములుగు నుండి వస్తున్న కారును తనీఖీ చేశారు.. కారు వెనుక భాగంలో […]
తెలంగాణ రాష్ట్రం ఇవాళ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటుంది.. కరోనా సమయంలో.. ఎలాంటి హడావుడి లేకుండా కార్యక్రమాలు నిర్వహించారు.. ఉదయం అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి.. గవర్నర్ తమిళిసైని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. ఇవాళ గవర్నర్ పుట్టిన రోజు కూడా కావడంతో ఆమెకు బొకేను అందించిన విషెష్ చెప్పారు.. ఆమె ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. తాజా పరిస్థితులపై […]
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుటుందో తెలంగాణ.. ఈ సమయంలో.. తమ వల్లే రాష్ట్రం సాధ్యమైందనే.. తాము లేకపోతే రాష్ట్రం ఏర్పాటు అయ్యేది కాదని ఎవ్వరికి వారు చెప్పుకుంటున్నారు.. తాజాగా తెలంగాణ ఉద్యమంపై స్పందించిన బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.. తెలంగాణ రాష్ట్ర ఆలోచన మొదట బీజేపీదే అన్నారు.. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పింది బీజేపీయేనని ఆమె గుర్తుచేశారు.. ఇక, తెలంగాణ ఉద్యమంలోకి టీఆర్ఎస్ లేట్‌గా వచ్చిందని కామెంట్ చేశారు.. కేసీఆర్ ఉద్యమ సమయంలో […]