ఒలింపిక్స్.. తొలి స్వర్ణం వారి ఖాతాలోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సమయంలోనూ ఒలింపిక్స్ గ్రాండ్‌గా ప్రారంభం అయ్యాయి.. ఇక, పతకాల వేట కూడా ప్రారంభం అయ్యింది… ఎప్పుడూ పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉండే డ్రాగన్ కంట్రీ.. ఈసారి టోక్యోలో జరుగుతోన్న ఒలింపిక్స్‌లో కూడా శుభారంభం చేస్తూ.. తొలి స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో చైనాకు చెందిన యాంగ్ కియాన్ విక్టరీ కొట్టింది.. రష్యన్ షూటర్ గలాషినా అనస్టాసియాను స్వల్ప తేడాతో ఓడించింది. అర్హత రౌండ్లో అగ్రస్థానంలో నిలిచిన డ్యూస్టాడ్ నాలుగో షూటర్‌గా వెనుదిరిగింది. ఇక, ఫైనల్ పోరు హోరాహోరీగా సాగగా.. యాంగ్, అనస్టాసియా నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డారు.. 125.6-126.0, 147.3-146.2, 168.3-167.6, 188.9-189.1, 210.0-210.5, 231.3-231.4తో ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీనే నడవగా.. అనస్టాసియా 10.8 పాయింట్లు రాగా.. యాంగ్ 10.7కే పరిమితం అయ్యారు.. అయితే చివరి షూట్లో యాంగ్ 9.8, రష్యన్ స్టార్ 8.9 పాయింట్లు సాధించడంతో వీరి మధ్య తేడా 251.8 – 251.1గా మారిపోయింది. దీంతో యాంగ్ కియాన్‌ను పసిడి పతకం వరించింది.. అనస్టానియా రజతం దక్కించుకోగా.. స్విట్జర్లాండ్‌కు చెందిన క్రిస్టినా నీనా 230.6తో కాంస్యం సాధించారు.
Also Read
- BCCI: సిరాజ్‌ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
- IPL Auction: ఐపీఎల్ 2027 వేలంలో బెన్ స్టోక్స్‌కు గ్రీన్ సిగ్నల్.. హ్యారీ బ్రూక్‌పై వేటు.. కారణం ఇదే..
- ICC Rankings: న్యూజిలాండ్‌పై అదరగొట్టిన బుమ్రా.. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారీ జంప్..
- David Warner: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి వార్నర్ మళ్లీ వస్తాడా?.. ఆరెంజ్ ఆర్మీ ప్లాన్ ఏంటి..?
- Tags
- air rifle
తాజావార్తలు
-
US Tariff Threat: భారత్‌పై అమెరికా 25% సుంకాల ప్రతిపాదన.. అధిక ఉత్పత్తి సామర్థ్యం ఆరోపణలను ఖండించిన కేంద్రం
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్‌ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!