భద్రాచలం వద్ద గోదావరి అంతకంతకూ పెరుగుతోంది.. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 44 అడుగులు కాగా.. 9.40 లక్షల క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం వెళ్తోంది.. అయితే కాళేశ్వరం నుంచి ఆ తర్వాత తుపాకుల గూడెం నుంచి భారీ వరద వస్తుంది. తుపాకులగూడెం నుంచి 12 లక్షల క్యూసెక్కుల నీరు దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో భద్రాచలం వద్ద కూడా గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. నిన్నటి నుంచి అంటే 24 గంటల్లో 30 అడుగుల మేరకు గోదావరి పెరిగింది. అయితే, ఇది ఈ సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక చేరుకొనున్నది. గంట గంట గోదావరి నీటిమట్టం పెరుగుతూ వస్తోంది.. గత 36 గంటల నుంచి గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు లేవని అధికారులు చెబుతున్నారు. దీని వల్ల గోదావరికి వరద కొంత మేరకు తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు. దిగువనున్న శబరి నదికి వరద పోటు లేకపోవటం వల్ల అదే విధంగా ధవళేశ్వరం వద్ద గేట్లను ఎత్తివేసి గోదావరి నీటిని విడుదల చేస్తున్నారు. దీనివల్ల కూడా గోదావరి శరవేగంగా స్పీడ్ గా నీళ్లు కిందికి వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా 50 అడుగులు వరకు రావచ్చని సీడబ్ల్యూసీ అంచనా వేసింది.. ఇక, 53 అడుగులకు చేరితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అంటే దరిదాపుగా 3వ ప్రమాద హెచ్చరిక వరకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.