అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది… తమ గ్రామానికి రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటి వరకు రోడ్డు వేయలేదంటూ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు గ్రామస్తులు.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఎదురైన చేదు అనుభవానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని రత్నతండా గ్రామస్తులు అడ్డుకున్నారు.. దీంతో.. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. నర్మెట్ట మండలం మచ్చుపహడ్ రిజర్వు ఫారెస్ట్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో 10 వేల మొక్కలు నాటే కార్యక్రమానికి ఎమ్మెల్యే వెళ్తుండగా.. ఆగపేటగ్రామంలో యాదగిరిరెడ్డిని అడ్డుకున్నారు రత్నతండా గ్రామస్తులు.. దీంతో.. పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట.. జరిగింది.. తన కారు దిగి.. ఆందోళన చేస్తున్నవారి దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నికల సమయంలో రత్న తండా కు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటి వరకు ఎందుకు వేయలేదంటూ ఎమ్మెల్యేను నిలదీశారు రత్నతండా గ్రామస్తులు.