ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం… మొత్తం 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. వీరిలో కలెక్టర్లు.. పెద్ద సంఖ్యలో జాయింట్ కలెక్టర్లు ఉన్నారు.. ఇక, ఇవాళ ఏపీ సర్కార్ బదిలీ చేసిన ఐఏఎస్ అధికారుల వివరాలు పరిశీలిస్తే.. శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ బదిలీ.. ఆయన స్థానంలో ఎల్.ఎస్.బాలాజీరావు నియామకం అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు బదిలీ.. ఆయన స్థానంలో నాగలక్ష్మి […]
ఈ నెల 13వ తేదీన జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్నట్టు వెల్లడించారు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి… జమ్మూలోని మజీన్ గ్రామం వద్ద ఆలయ నిర్మాణం జరగనుంది… రెండో దశలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేలా ఏర్పాటు చేస్తోంది టీటీడీ.. ఆలయంతో పాటు వేదపాఠశాల, యాత్రికులకు వసతి సముదాయం నిర్మాణం చేపట్టనున్నారు.. ఆలయ ప్రాంగణంలో కట్టడాలని రాతిని వినియోగిస్తామని తెలిపారు. కాగా, జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఇప్పటికే టీటీడీకి 62 ఎకరాల స్థలాన్ని కేటాయించింది […]
ఉద్యోగులకు జీతాలు పడే సమయంలో సెలువులు వస్తే అంతే.. సెలవుల తర్వాత జీతాలు గానీ, పెన్షన్లుగానీ వచ్చేది.. ముందుచూపుతో ముందురోజే జీతాలు వేసే సంస్థలు కూడా లేకపోలేదు.. కానీ, మెజార్టీగా మాత్రం.. జీతాలు, పెన్షన్ బ్యాంకు ఖాతాల్లో వేసే రోజు సెలవు వచ్చిందంటే.. మళ్లీ బ్యాంకు ఓపెన్ అయిన తర్వాతే వేస్తారు.. కానీ, ఇక, అలాంటి ఇబ్బందులు ఉండవు.. ఉద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇకపై, బ్యాంక్ సెలవులతో సంబంధం లేకుండా జీతాలు, […]
అమూల్ ఒప్పందంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరపిన ఏపీ హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు.. గుజరాత్‌లోని అమూల్‌కి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అమూల్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై.. ఎలాంటి నిధులు ఖర్చు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఏపీడీడీఎఫ్ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ […]
గంగవరం పోర్టులో క్రమంగా తన వాటాలను పెంచుకునే పనిలో పడిపోయింది అదానీ గ్రూప్.. తాజాగా, గంగవరం పోర్టులోని ప్రభుత్వ పెట్టుబడులను తమకు విక్రయించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.. అయితే, అదానీ గ్రూప్ ప్రతిపాదనల సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.. సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్ నేతృత్వంలో ఆరుగురు ఉన్నతాధికారులతో ఎంపవర్డ్ కమిటీ వేసింది సర్కార్.. కమిటీలో సభ్యులుగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ , […]
కరోనా సమయంలో అంబులెన్స్‌లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.. ఒకవేళ దొరికినా అడిగినంత సమర్పించుకోవాల్సిన పరిస్థితి.. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో సేవా భారతి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభమయ్యాయి. ఉచిత అంబులెన్స్ సేవలు కావాలనుకునేవారు 040-48213100 నంబర్‌ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు తెలిపారు. బర్కత్‌పురా కేశవనిలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవాభారతి ప్రాంత అధ్యక్షుడు దుర్గారెడ్డి, కార్యదర్శి ప్రభల రామ్మూర్తి సహా ఇతర సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు. సేవా భారతి […]
భారత్‌ను సెకండ్ వేవ్ కుదిపేసింది.. ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచిఉందని.. అది పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు కొన్ని దేశాలు పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చే పనిలో పడ్డాయి… బ్రిటన్‌కు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ.. తాజాగా, 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది.. ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు […]
లాక్డౌన్ చర్యలు క్రమంగా కరోనా కేసులు తగ్గేలా చేస్తున్నాయి.. తెలంగాణలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,36,096 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 2,175 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. కరోనా బారినపడి మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో.. 3,821 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 30,918 యాక్టివ్ కేసులు […]