ఏపీ ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని వ్యాఖ్యానించారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.. అందుకు ఉదాహరణ విశాఖలో అత్యంత విలువైన 22 ఆస్తులను తనఖా పెట్టడమేఅన్నారు.. ప్రభుత్వం అప్పులు తీసుకోవడంలో తప్పులేదు.. కానీ, అన్ని కార్పొరేషన్లు దివాళ తీసేల ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు.. రాష్ట్రంలో అన్ని విలువైన భూములు అమ్మకాలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంటుందని విమర్శించిన మాధవ్.. రాష్ట్రంలో ఆదాయవనరులపై దృష్టి పెట్టకుండా ఉన్న వాటిని తనఖా పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. రాష్టాన్ని అప్పులు ఆంధ్ర ప్రదేశ్ గా […]
భాషా సాహిత్యాలు నిలిచివున్నన్నాళ్లు ప్రజల హృదయాల్లో సినారె చిరకాలం నిలిచివుంటారని స్మరించుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వంభరావ్యాపితం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య డా. సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన కేసీఆర్.. కవిగా, రచయితగా, గేయ కావ్య కృతి కర్తగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా, సినీ గీతాల రచయితగా, తనదైన ప్రత్యేకశైలిలో తెలంగాణ పద సోయగాలను వొలికిస్తూ సాహితీ ప్రస్థానాన్ని […]
మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఇవాళ ఉదయం అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించిన ఆయన.. అనంతరం అసెంబ్లీకి వెళ్లి.. అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖను అందజేశారు.. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలేఖను సమర్పించారు ఈటల రాజేందర్… ఇక, ఇప్పటికే బీజేపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసిన ఈయన.. ఈనెల 14నవ తేదీన ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ […]
తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఘోరి కట్టడమే నా అజెండా అని ప్రకటించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఇప్పటికే టీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఆయన.. ఇవాళ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.. అంతకు ముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో జరిగే ఉప ఎన్నికలు కురుక్షేత్రంగా అభివర్ణించారు.. అక్కడ కౌరవులు, పాడవులకు మధ్య యుద్ధం జరగబోతోందన్నారు.. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని ఈ సందర్భంగా […]
కంటికి కనిపించని కరోనా మహమ్మారితో ముందుంటి పోరాటం చేస్తున్నారు.. వైద్యులు, వైద్య సిబ్బంది.. ఇదే సమయంలో.. చాలా మంది కోవిడ్ బారినపడుతూనే ఉన్నారు.. ఇక, సెకండ్ వేవ్ వైద్య రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. సెకండ్ వేవ్‌లో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి ఏకంగా 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు.. ఈ విషయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రకటించింది.. ఇక, మృతిచెందిన వైద్యుల సంఖ్య రాష్ట్రాలవారీగా చూస్తే.. అత్యధికంగా బీహార్‌లో 111 మంది వైద్యులు, […]
కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. ఆర్థికంగా కొన్ని కుటుంబాలు చితికిపోతే.. భారీగా ప్రాణనష్టం కూడా జరిగింది.. తల్లిదండ్రులను, సంరక్షణలను కోల్పోయి వేలాది మంది చిన్నారులు అనాథలైన పరిస్థితి.. ఇక, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలు ఇప్పుడు ప్రజల్లో వణుకుపుట్టిస్తున్నాయి.. మరోవైపు.. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో ఎదురైన అనుభవాలతో థర్డ్ వేవ్‌ను ఎదర్కొనేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం.. దీనికోసం లక్షమంది సుశిక్షితులైన ఆరోగ్య సిబ్బందిని (హెల్త్ఆర్మీని) సిద్ధం చేస్తోంది.. […]
పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్‌లో నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి మరోసారి ఎదురుదెబ్బ తగలింది.. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13,500 కోట్ల రుణం ఎగవేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. 2018లో భారత్ విడిచి పారిపోయాడు.. ఆ తర్వాత మళ్లీ తాజాగా దొరికిపోయాడు.. అయితే, బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి… చోక్సీకి బెయిల్ ఇచ్చేందుకు డొమినికా హైకోర్టు నిరాకరించింది. డొమినికాతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, దేశం విడిచి పారిపోనని ఇచ్చిన హామీని […]
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ మధ్యే గాంధీ ఆస్పత్రిని, వరంగల్ ఎంజీఎంను సందర్శించి కోవిడ్ బాధితులను పరామర్శించి భరోసా కల్పించిన ఆయన.. ఇప్పుడు మరింత దూకుడు పెంచుతున్నారు.. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును.. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఈ నెల 19 వ తేదీ తర్వాత ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించనున్నారు.. ఇక, ఇందులో భాగంగా.. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల క్షేత్రస్థాయి పనితీరును సమీక్షించడానికి […]