ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యోలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. ఒలింపిక్ నగరం టోక్యోలో రికార్డు స్థాయి కేసుల్ని నమోదు చేస్తోంది. తాజాగా 4 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. జపాన్ రాజధానిలో నాలుగువేలకు పైగా కేసులు బయటపడటం ఇదే మొదటిసారి. అలాగే దేశంలో వరుసగా రెండోరోజు 10వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. మరోపక్క ఒలింపిక్ విలేజ్‌లో 21 మందికి కరోనా సోకింది. అక్కడ జులై 1 నుంచి ఇప్పటివరకూ 241 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.
అయితే.. ఇప్పటికే టోక్యోలో అత్యవసర పరిస్థితి ఉండగా.. జపాన్ ప్రభుత్వం మరో 4 నాలుగు ప్రాంతాలకు ఆంక్షలను విస్తరించింది. టోక్యోతో పాటు మొత్తం ఆరు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి విధించింది జపాన్ సర్కార్… మరోవైపు.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ ప్రారంభం అయిపోయిందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించిన సంగతి తెలిసిందే కాగా… వచ్చే రెండో వారల్లో కరోనా కల్లోలం సృష్టించబోతోందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది.