బీజేపీ, టీఎంసీ మధ్య ఓ రేంజ్లో యుద్ధం నడుస్తూనే ఉంది.. ఎన్నికలు ముగిసినా ఆ వివాదాలకు ఫులిస్టాప్ పడడం లేదు.. అయితే, ఈ వివాదాల కారణంగా కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి ఒప్పుకోవడం లేదు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కానీ, వన్ నేషన్ – వన్ రేషన్ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. పశ్చిమ బెంగాల్లో తక్షణమే ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని అమలు చేయాలని సీఎం […]
మే నెల అంటేనే భానుడు ప్రతాపానికి పెట్టింది పేరు.. రికార్డుస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి.. ఈ సమయంలో.. వడదెబ్బతో మృతిచెందేవారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది.. కానీ, ఈ ఏడాది పరిస్థితి మారిపోయింది..ఎండలు దంచికొట్టే మే నెలలో వర్షాలు కురిసాయి.. అది ఎంతలా అంటే.. ఏకంగా 121 ఏళ్ల రికార్డుకు చేరువయ్యేలా.. ఈ ఏడాది మే నెలలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ (ఐంఎడీ) తన నివేదికలో పేర్కొంది.. వెంట వెంటనే వచ్చిన […]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా మారరు.. గతంలోనే రఘురామపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు.. తాజాగా.. రఘురామకృష్ణరాజును డిస్క్వాలిఫై చేయండి అంటూ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు వైసీపీ చీప్ విప్ మార్గాని భరత్.. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్క్వాలిఫై చేయాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేశారు.. వైసీపీ టికెట్‌పై నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికైన […]
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.. కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన ఆయన.. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.. ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తూనే.. కేబినెట్లో మార్పులు చేర్పులపై కూడా మంతనాలు జరిగినట్టుగా తెలుస్తోంది.. రెండు రోజుల పర్యటన కోసం.. నిన్న ఢిల్లీ చేరుకున్న యోగి.. ప్రధాని మోడీతో సమావేశం తర్వాత.. బీజేపీ […]
పెట్రోల్, డీజిల్ ధరలపై సీఎం కేసీఆర్ ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడంలేదని నిలదీశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పెట్రో ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో సంగారెడ్డి పాత బస్టాండ్ దగ్గర నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీజిల్, పెట్రోల్, నిత్యావసర ధరలు యూపీఏ హయాంలో అదుపులో ఉన్నాయి.. కానీ, ప్రధాని మోడీ ఈ ఏడేళ్ల పాలనలో ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని విమర్శించారు.. మోడీ పెట్రో ధరలను సెంచరీ దాటించారని […]
కరోనా మహమ్మారి దేశాన్ని అల్లకల్లోలం చేసింది.. ఇక, మహారాష్ట్రలో చెప్పాల్సిన పనేలేదు.. అందులో ముంబై ఎదురైన అనుభవం మామూలుదికాదు.. అయితే, ఇప్పుడిప్పుడే కరోనా నుండి తేరుకుంటున్న ముంబై ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత రెండు రోజులగా కురిసిన వర్షాలతో ముంబై మొత్తం జలమయమైంది. ఇప్పటికే ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ అధికారులు ప్రజలకు సూచనలు సైతం చేశారు. ఈ క్రమంలో ముంబై వాసులకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. వచ్చే […]
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతున్నా.. థర్డ్ వేవ్ భయాలు మాత్రం వెంటాడుతున్నాయి.. అయితే, దేశంలో అక్టోబర్ చివరి నాటికి చిన్నారులకు టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి రెండేళ్లు పైబడిన వయసు కలిగిన పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి… థర్డ్ వేవ్‌లో చిన్నారులపై కరోనా అధికంగా ప్రభావం చూపుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. పిల్లలపై కోవ్యాక్సిన్ ట్రయల్స్‌ను భారత్ బయోటెక్ ప్రారంభించిందని ఇండియన్ కౌన్సెల్ […]