డ్రగ్స్ రవాణాలో ఇప్పుడు ఏకంగా విమానాలను ఉపయోగిస్తున్నారు కేటుగాళ్లు.. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో సారి భారీగా డ్రగ్స్ పట్టివేశారు.. డర్బన్ నుండి ఢిల్లీ వచ్చిన టాంజానియా దేశస్తుడి నుండి 28 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను గుర్తించారు కస్టమ్స్ అధికారులు.. హెరాయిన్ డ్రగ్‌ను హాండ్ బ్యాగ్, ట్రాలీ బ్యాగ్ లో ప్రత్యేకంగా రంద్రాలు చేసి అందులో నింపాడు కేటుగాడు. ఢిల్లీ విమనాశ్రయంలో ప్రయాణికుడిపై అనుమానం వచ్చి అతని లగేజ్ బ్యాగ్‌ను క్షుణంగా తనిఖీ చేసింది […]
ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కోటాలో కొత్తగా ఎంపిక కానున్న ఆ నలుగురు ఎమ్మెల్సీలు ఎవరు? అనే ఉత్కంఠకు తెరపడింది.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఆ నలుగురు ఎమ్మెల్సీలకు ఆమోదముద్ర వేశారు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్.. సాయంత్రం తన శ్రీమతి వైఎస్ భారతితో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సరిగ్గా 40 నిమిషాల పాటు గవర్నర్ దంపతులు విశ్వభూషణ్ హరిచందన్, సుప్రవా హరిచందన్‌తో సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా గవర్నర్ కోటాలో […]
కరోనా మహమ్మారి కాలంలో నేతన్నలకు రూ.109 కోట్ల మేర లబ్ధి చేకూరిందని తెలిపారు తెలంగాణ పరిశ్రమలు, టెక్స్ టైల్ శాఖా మంత్రి కేటీఆర్.. నేతన్నకు చేయూత కార్యక్రమాన్ని పునః ప్రారంభించిన ఆయన.. ఈ పథకం ద్వారా కరోనా కాలంలో నేతన్నలకు రూ. 109 కోట్ల మేర లబ్ధి చేకూరిందని వెల్లడించారు.. గత ఏడాది కరోనా నేపథ్యంలో లాకిన్ గడువు కన్నా ముందే నిధులు పొందేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్న ఆయన.. ఈ పథకం పునః ప్రారంభం ద్వారా […]
రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు, కోవిడ్ థర్డ్‌వేవ్ సన్నద్ధత, హెల్త్ హబ్స్ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు.. శిశువులు, చిన్నారులకు ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల పెంపుదలపై కార్యాచరణ ప్రణాళికను సీఎంకు వివరించారు అధికారులు.. ఐసీయూ బెడ్లు ఇప్పుడు ఉన్నవాటితో కలిపి మొత్తంగా 1600 ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధంచేశామన్నారు.. ఆక్సిజన్ బెడ్లు ఇప్పుడున్న వాటితో కలిపి 3,777 ఏర్పాటుపై చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.. అలాగే […]
రాష్ట్రంలో రక్త నిల్వలు సరిపడా లేకపోవడం ఆందోళన కలగిస్తోందన్నారు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్… ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె.. రక్తదానం అంటే.. జీవన దానమే అని తెలిపారు. యువతలో సరైన అవగాహన కల్పించినప్పుడు వారిని రక్తదానం వైపు ప్రోత్సహించడం సులువు అవుతుందన్నారు గవర్నర్.. కోవిడ్ సంక్షోభ సమయంలో మంచి జాగ్రత్తలతో, రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని, అలాగే రక్త దాతలలో మరింత స్ఫూర్తిని పెంపొందించాల్సి ఉంటుందని సూచించారు. […]
వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగంపుపై ఎప్పటి నుంచో కసరత్తు జరుగుతోంది.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.. దీనిపై ఇవాళ కీలక ప్రకటన చేశారు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తామని వెల్లడించారు.. వచ్చే ఖరీఫ్ సీజన్లో పగటి పూటే 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన ఆయన.. అనంతపురం జిల్లాలో తమకు రాత్రిపూట కరెంట్ ఇవ్వాలని అక్కడి రైతులు […]
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సెటైర్లు వేశారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి.. సీఎం కేసీఆర్ అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనుల్ని తానే స్వయంగా చెకింగ్ చేస్తానని, చెప్పకుండా… చెయ్యకుండా వచ్చి పరిశీలిస్తానని అన్నారు. ఆఫీసర్లు అందుబాటులో ఉండి తానడిగిన రిపోర్టులివ్వాలని… తేడా వస్తే స్పాట్లోనే సస్పెన్షన్లు ఉంటాయని సీరియస్‌గా హెచ్చరించారని గుర్తుచేసిన ఆమె.. సీఎం మాటలకు భయపడాల్సిన పనిలేదని అధికారులకు బాగా తెలుసు అని ఎద్దేవా చేశారు.. ఎందుకంటే, […]
కరోనా మహమ్మారి వేలాది మంది ప్రాణాలను తీసింది.. సామాన్యులతో పాటు.. వైద్యులు, వైద్య సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు.. దీంతో.. వందలాది కుటుంబాలు భారీగా నష్టపోయిన పరిస్థితి.. దీంతో.. వారి కుటుంబాలకు మేం ఉన్నామంటూ భరోసా ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కరోనాతో చనిపోయిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.. కరోనా బారినపడి చనిపోయిన ప్రభుత్వ వైద్య సిబ్బంది కుటుంబాలకు ఈ పరిహారాన్ని అందించనున్నారు.. కోవిడ్‌తో […]
మాజీ మంత్రి ఈటల రాజేదర్.. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరిన వేళ ఆ పార్టీపై సెటైర్లు వేశారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ… నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు, రెండు ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలను ప్రస్తావించారు.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సెక్యూరిటీ డిపాజిట్‌ను దక్కించుకోవడంలో బీజేపీ విఫలమైందని ఎద్దేవా చేసిన ఆయన.. ఇక, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కోల్పోయిందని విమర్శించారు.. మరోవైపు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ […]