టి.కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ..! రేవంత్, మహేశ్వర్‌రెడ్డి మధ్య వాగ్వాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్‌లో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇటీవల టీపీసీ చీఫ్‌రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి సభకు పిలుపునివ్వడంపై పార్టీలోని కొందరు నేతలు అగ్గిమీద గుగ్గులం అవుతున్నారు. తమకు చెప్పకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై గాంధీ భవన్‌లో జరిగిన పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో వాడీ వేడీ చర్చ జరిగింది.
రేవంత్‌రెడ్డి ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి. జిల్లా నాయకులకు సమాచారం ఇవ్వకుండా.. ఇంద్రవెల్లి సభను ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇంద్రవెల్లిలో సభ ప్రకటిస్తే ఇబ్బంది ఏంటని.. అసలు ఇంద్రవెల్లికి నీకు ఏం సంబంధం అని మహేశ్వర్‌రెడ్డిని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో సీనియర్లు సర్దిచెప్పారు. ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్‌గా మహేశ్వరెడ్డికి.. అన్ని నియోజకవర్గాలపైనా బాధ్యత ఉందని.. సమావేశంలో సభ ప్రాంతాన్ని చెబితే అయిపోయేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కొందరు సీనియర్లు. ఇక, అంతకు ముందు మీడియాతో చిట్‌చాట్ చేసిన మహేశ్వర్‌రెడ్డి ఇంద్రవెల్లి సభ ఎందుకు పెడుతున్నారో తెలియదన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్సో.. లేక రేవంత్‌రెడ్డి కాంగ్రెస్సో ఈ మీటింగ్‌లో తేలిపోతుందన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఇంద్రవెల్లి దండోరా ప్రకటనపై ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆదివాసీలు, లంబాడీలు కలిసి పోరాడారన్న రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని.. లేదంటే ఇంద్రవెల్లి సభను అడ్డుకుంటామని హెచ్చరించారు.
Also Read
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
తాజావార్తలు
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!