ఆగస్టు 1 ఆదివారం దినఫలితాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈరోజు మీరు అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో సంప్రదింపులు, చర్చలు ఫలిస్తాయి. మీ బలహీనతలను కొంతమంది స్వార్థానికి వినియోగించుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. జాగ్రత్త వహించడం మంచిది.
వృషభం : ఈ రోజు ఈ రాశివారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. నూతన ప్రదేశాల సందర్శనలకు అనుకూలం. మీ శ్రీమతి మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
Also Read
మిథునం : ఈ రోజు మీ ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సమస్యలు చక్కబడతాయి. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. ఖర్చులు అంతగా లేకున్నా ధన వ్యయంలో ఏకాగ్రత వహించండం మంచిది.
కర్కాటకం : ఈ రోజు మీరు చేపట్టిన ఉపాధి పథకాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఏ వ్యక్తినీ అతిగా విశ్వసించడం మంచిదికాదు.
సింహం : ఈరోజు మీరు చీటికి మాటికి ఎదుటివారిపై అసహనం ప్రదర్శిస్తారు. ఓర్పు, నేర్పుతో అనుకున్నది సాధిస్తారు. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ధనవ్యయం అధికంగా ఉంటుంది.
కన్య : ఈ రోజు మీరు అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం మంచిదికాదు. ఒప్పందాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువులు మీద మక్కువ పెరుగుతుంది. ఏజెంట్లు, బ్రోకర్లు, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి.
తుల : ఈ రోజు ఈరాశిలోని పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిదికాదు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరీ, సోదరులతో ఒక అవగాహనకు వస్తారు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారికి కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థిక స్థితి కొంత మెరుగనిపిస్తుంది. అకాల భోజనం, శారీరక శ్రమ వంటి ఇబ్బందులెదుర్కొంటారు. మిత్రుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు.
ధనస్సు : ఈరోజు ఈ రాశివారికి వ్యాపారాల్లో నష్టాలను కొంత మేరకు అధికమిస్తాయి. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. నిరుద్యోగులు, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి.
మకరం : ఈరోజు ఈ రాశివారు అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. నూతన వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. వృథా ఖర్చులు అధికంగా ఉంటాయి.
కుంభం : ఈ రోజు మీకు బంధు మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రతి విషయం మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం మంచిది.. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. నూతన పెట్టుబడుల వ్యవహారంలో ఒక నిర్ణయానికి వస్తారు.
మీనం : ఈ రోజు ఈ రాశిలోని ఎలక్ట్రానిక్ మీడియా వారికి సదావకాశాలు లభిస్తాయి. స్థోమతకు మించిన వాగ్ధానాల వల్ల ఇబ్బందులెదుర్కొంటారు. అనుకున్న పనులు అర్థాంతరంగా ముగిస్తారు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వివాహ ఉద్యోగ యత్నాలు నెరవేరగలవు.
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్‌పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్‌ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..