మరోసారి కేంద్ర కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు సాగుతున్నాయి.. దీనికి ముఖ్యకారణంగా.. ప్రధాని నివాసంలో కీలక సమాలోచనలు జరగడమే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాలు సుదీర్ఘ మంతనాలు జరిపారు.. దీంతో.. ఓ వారం రోజుల్లో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.. గత ఏడాది కాలంగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ పై ఊహాగానాలు కొనసాగుతుండగా.. దేశంలో “కరోనా” విజృంభణ, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల […]
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం.. ఇప్పటికే కొత్త వేతన సవరణ అమలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపగా.. ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్.. పెంచిన పీఆర్సీని జూన్ నెల నుంచి అమలు చేసి.. వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు.. నోషనల్ బెనిఫిట్‌ను 2018 జులై ఒకటి నుంచి, మానిటరీ బెనిఫిట్‌ను 2020 ఏప్రిల్ ఒకటి నుంచి, క్యాష్ బెనిఫిట్‌ను 2021 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని ఇప్పటికే కేబినెట్ నిర్ణయించగా.. కాసేపటి […]
తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. ఇక, హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూనే ఉంది.. మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో.. సాయంత్రం మరికొన్ని ప్రాంతాల్లో.. రాత్రికి ఇంకొన్ని ప్రాంతాల్లో అన్నట్టుగా వర్షం దంచికొట్టింది.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.. వరుసగా మూడు రోజుల పాటు.. అంటే ఈ నెల 12, 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో భారీ నుంచి […]
తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన భారతీయ జనతా పార్టీ.. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.. ఇందులో భాగంగా కొంతమంది నేతలు ఇప్పటికే బీజేపీ గూటికి చేరగా.. తాజాగా, టీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. త్వరలోనే కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక, ఇవాళ ఈటల రాజేందర్‌తో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ […]
కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. మొదటల్లో వ్యాక్సిన్ అంటేనే వణికిపోయిన ప్రజలు.. ఇప్పుడు క్రమంగా ఫస్ట్ డోస్, సెకండ్ డోస్‌కు క్యూ కడుతున్నారు.. అయితే, వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో రకరాల మార్పులు కనిపిస్తున్నాయి.. కొందరికి జ్వరం, ఒంటినొప్పులు, దగ్గు లాంటి లక్షణాలు బయటపడుతున్నాయి.. వ్యాక్సిన్ వేయించుకున్న ఓ వ్యక్తి.. ఆయన వ్యాక్సిన్ తీసుకున్న ప్రాంతంలో బల్బు పెడితే.. ఏదో హోల్డర్‌లో పెట్టినట్టు వెలిగిపోయిన వీడియో ఈ మధ్య వైరల్ కాగా.. ఇప్పుడు రెండు […]
తెలంగాణలో బీఎడ్ కోర్సులో అడ్మిషన్స్ కోసం కొత్త రూల్స్ తెచ్చింది ప్రభుత్వం.. గతంలో ఉన్న నిబంధనలకు సవరణలు చేసి ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్.. ఇక, బీఎడ్ అడ్మిషన్స్ పొందాలనుకునే విద్యార్థులు అర్హత కోర్సుల్లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలని స్పష్టం చేసింది.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతం కనీస మార్కులుగా నిర్దేశించారు.. బీఎడ్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో చేరాలనుకునే వారు డిగ్రీలో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ ఏదేని ఒక్క సబ్జెక్టు చదివి […]
తెలంగాణపై క్రమంగా ఫోకస్ పెంచుతోంది భారతీయ జనతా పార్టీ.. వరుసగా కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో పర్యటిస్తూ.. రాష్ట్ర నాయకత్వాన్ని అలర్ట్ చేస్తోంది.. ఇక, పశ్చిమ బెంగాల్ తరహాలోనే తెలంగాణపై కూడా దృష్టి పెట్టబోతున్నాం అని తెఇపారు ఆ పార్టీ నేత శివ ప్రకాష్… హైదరాబాద్‌లో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండేళ్లలో పార్టీని బలోపేతం చేయాలి.. రాష్ట్ర నాయకులతో ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడుతా… మీ మనసులో మాట అప్పుడు చెప్పండి అని […]
తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించాల్సిన టెన్త్, ఇంటర్ పరీక్షలు కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు.. షెడ్యూల్ ప్రకారం జులైలో పరీక్షలు జరగాల్సి ఉండగా.. పరీక్షలపై నివేదిక పంపించాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది ప్రభుత్వం.. రెగ్యులర్ టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఓపెన్ స్కూల్స్ సొసైటీ పరీక్షలు రద్దు చేయాలని రిపోర్ట్ ఇచ్చారు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు.. అయితే, దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.. గతేడాది కూడా రద్దు […]