రాష్ట్ర అభివృద్ధి, పోర్టుల ఏర్పాటుపై నిర్ణయాధికారం కేంద్రం చేతిలోకి వెళ్లటాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇండియన్ పోర్ట్స్ డ్రాఫ్ట్ బిల్లు 2020పై మాకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు.. ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసిన ఏపీ మంత్రి.. బిల్లును అధ్యయనం చేసి పూర్తిస్థాయిలో అభ్యంతరాలు చెప్పటానికి నెల రోజుల సమయాన్ని కేంద్రానికి అడిగినట్టు తెలిపారు.. పోర్టులు ఉమ్మడి జాబితాలో […]
తెలుగు తేజం, ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లేశ్వరికి ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమించింది ప్రభుత్వం.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని ఢిల్లీలో తొలిసారి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర సర్కార్… ఆ వర్సిటీ తొలి వీసీగా కరణం మల్లేశ్వరికి అవకాశం దక్కింది.. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్‌గా ఏపీకి చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది […]
యాదాద్రి భువనగిరి జిల్లాలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో మహిళ లాకప్ డెత్ కేసు కలకలం సృష్టించింది.. అయితే, ఈ కేసులో ఎస్సై మహేష్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యపై చర్యలు తీసుకున్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్.. ఆ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మూడురోజుల క్రితం అడ్డగూడూరు పీఎస్‌లో పోలీస్ దెబ్బలు తట్టుకోలేక మరియమ్మ అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే.. దీనిపై పెద్ద దుమారమే […]
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ వేయాల్సింది.. ఇప్పటి వరకు 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. 18 ఏళ్లు దిగువన ఉన్న చిన్నారులకు మాత్రం ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.. అయితే, ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ మాత్రం జరుగుతున్నాయి.. చిన్నారులకు వ్యాక్సిన్‌పై స్పందించిన ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి చిన్నారులకు కూడా కోవాగ్జిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు… రెండేళ్లు పైబడిన చిన్నారులకు ఆ వ్యాక్సిన్ వేసుకోవచ్చు అన్నారు.. ఇప్పటికే […]
దమ్ముంటే మీ సిద్ధాంతం చెప్పుకో.. కానీ, ఘర్షణకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.. హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం చల్లూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మండల ముఖ్యకార్యకర్తలు సమావేశానికి హాజరైన బీజేపీ నేత ఈటల.. ఈసందర్భంగా మాట్లాడుతూ.. వీణవంక మండలంలో అక్కడొక దొర, ఇక్కడొక దొర ఉన్నారని ఎద్దేవా చేశారు.. మేం ఎవరి జోలికి వెళ్లం.. ఈ 20ఏళ్లలో ఎప్పుడు గొడువలకు తావు ఇవ్వలేదని.. ఎప్పుడైన శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించకునేదన్నారు.. […]
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఎప్పటివో అయినా.. ఈ మధ్య తరచూ విమర్శలు, ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ… మీకు నిజాయితీ ఉంటే అక్రమంగా చేపట్టిన ఆర్డీఎస్ పనులను ఆపాలని డిమాండ్ చేశారు.. ఆర్డీఎస్ పై అవగాహన లేని బచ్చాగాళ్లు ముఖ్యమంత్రి రాసిచ్చిన కాగితాలు చూసి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయిన ఆమె.. ఆంధ్రవాళ్లు అని విమర్శించే వారు రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నది […]
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదం మళ్లీ రాజుకుంటుంది… ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. మరోవైపు ఫిర్యాదుల పర్వం కూడా కొనసాగుతోంది.. తాజాగా.. పర్యావరణ అనుమతులు లేకుండానే కృష్ణనదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది తెలంగాణ సర్కార్.. 14.12.2020 నాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేని కారణంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాలని ఇచ్చిన ఆర్డర్‌ను భేఖాతర్ చేస్తుందని కేఆర్ఎంబీకి రాసిన […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ వేయలేదని, రెండు రోజుల్లో దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అసలు ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు మినహాయించాలో చెప్పాలంటూ నిలదీసింది అత్యున్నత న్యాయస్థానం… ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు.. పరీక్షల ఆవశ్యకతను సుప్రీంకోర్టుకు వివరించామన్న ఆయన.. పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు […]
తెలంగాణలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.. నిన్నటితో పోలిస్తే.. ఇవాళ మరికొన్ని కేసులు తక్కువగా నమోదయ్యాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1175 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇదే సమయంలో మరో 10 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 1,771 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య […]