ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు… నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇసుక దందా దుమారం రేపుతోంది… ఈ వ్యవహారంలో మంత్రి అనిల్ కుమార్‌పై ఆరోపణలు చేశారు టీడీపీ నేతలు.. పెన్నా ఇసుక రీచ్ నుంచి రూ.100 కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపిస్తున్నారు.. అయితే, తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టి పారేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తన క్యాంపు కార్యాలయంలో అఖిలపక్ష సమావేశ౦ ఏర్పాటు […]
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది.. ఈ సారి ఎలక్ర్టానిక్ వాహన రంగంలో రూ. 2,100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది ట్రైటాన్ ఈవీ.. జహీరాబాద్ నిమ్జ్‌లో యూనిట్ ఏర్పాటు చేయనుంది ట్రైటాన్ ఈవీ.. దీంతో.. దాదాపు 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.. మొదటి ఐదేళ్లలోనే సుమారు 50 వేల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ట్రైటాన్ ఈవీ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు రాష్ర్ట […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,088 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 9 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే, సమయంలో 1511 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.. దీంతో… పాజిటివ్ కేసుల సంఖ్య 6,17,776కు పెరగగా… రికవరీ కేసులు 5,98,139కి చేరగాయి.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో 3,607 మంది మృతిచెందినట్టు బులెటిన్‌లో […]
నా కల మీ అందరి కల కావాలి.. మనందరి కల పేదవాడి కల కావాలి అని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం వైఎస్ జగన్… నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం (గృహనిర్మాణశాఖ)పై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన.. ఇళ్లనిర్మాణ ప్రగతి, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కార్యాచరణ ప్రణాళిక, టిడ్కో ఇళ్లపై సమగ్రంగా చర్చించారు.. ఇళ్లనిర్మాణంపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు.. కాలనీల్లో మ్యాపింగ్, జియోట్యాగింగ్, జాబ్‌కార్డుల జారీ, రిజిస్ట్రేషన్ పనులు అన్నిచోట్ల దాదాపుగా […]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పుడు కృష్ణానదిపై నిర్మిస్తోన్న ప్రాజెక్టులు చిచ్చుపెడుతున్నాయి.. ఓవైపు ఫిర్యాదులు చేస్తూనే.. మరోవైపు ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. జలవివాదంలో ఆంధ్ర నేతలపై తెలంగాణ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇప్పటికే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై విమర్శలు రాగా.. తాజాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. వైఎస్సార్ తెలంగాణ ప్రాంతానికి రాక్షసుడు అంటూ విమర్శించారు. ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్ స్నేహ హస్తం ఇస్తే.. […]
నన్ను ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ, మీకు కూడా గుణపాఠం చెబుతా అంటూ టీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన ఆయన.. ఆ తర్వాత తన నియోజకవర్గం హుజురాబాద్‌లో పర్యటిస్తూ.. రానున్న ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.. వరుసగా ఆరు సార్లు విజయం సాధించా.. ఈసారి హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగురవేస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.. మా బీజేపీ నేతలు వచ్చి […]
రాయలసీమ ఎత్తిపోతలకు ఎలాంటి అనుమతుల్లేవు అని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి… కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆదేశాలు, ఏపీ నేతల విమర్శలపై హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎలాంటి అనుమతులు లేకున్నా.. ఏపీ ప్రభుత్వం కృష్ణ నది నీటిని తరలించే ప్రాజెక్టు పనులు చేస్తోందని విమర్శించారు.. అక్రమంగా కృష్ణ నీటిని తరలించే పనిని ఏపీ సర్కారు మొదలుపెట్టిందని ఫైర్ అయిన ఆయన.. అక్రమ నీటి తరలింపుతోపాలమూరు, రంగారెడ్డి, మెదక్ రైతుల నోట్లో మట్టి […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 88,622 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 4,981 మంది పాజిటివ్‌గా తేలింది.. కోవిడ్ బారినపడి మరో 38 మంది మృతిచెందారు.. తాజాగా మృతుల్లో చిత్తూరు జిల్లాలో 10 మంది, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరు, నెల్లూరులో నలుగురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ముగ్గురు చొప్పు. అనంతపూర్, కడప, విశాఖపట్నం, […]
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది రియలో.. ఏది వైరలో తెలియని పరిస్థితి… కొందరు కేటుగాళ్లు ఇష్టంవచ్చినట్టుగా తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారు.. అది తెలియకకొందరు.. తెలిసి మరికొందరు షేర్ చేస్తూ.. అందులో భాగస్వాములు అవుతున్నారు.. అయితే, తెలంగాణ మంత్రి కేటీఆర్, వైఎస్ షర్మిల ఫొటోలతో.. హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించిన ఓ తప్పుడు వార్త వైరల్ చేశారు కేటుగాళ్లు.. దీనిపై వైఎస్ షర్మిల అనుచరులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. బుధవారం రోజు సోషల్ మీడియాలో మేం పెట్టబోయే […]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై చేపట్టిన ప్రాజెక్టులు మరోసారి వివాదం రేపుతున్నాయి.. ఇప్పటికే ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు, కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖలు రాయడం నడుస్తుండగా.. మరోవైపు.. రెండు రాష్ట్రాల నుంచి అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది… ఇటీవల మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. ఈ సందర్భంగా లంకలో పుట్టినొల్లంతా రాక్షసులే అంటూ కామెంట్ […]