కరోనా మహమ్మారి రోజుకో వేరియంట్ రూపంలో ప్రజలను కలవరానికి గురిచేస్తోంది.. ఇప్పటికే పలు దేశాలను డెల్టా ప్లస్ వేరియంట్ కలవరపెడుతుండగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ కేసు నమోదు అయ్యింది.. చిత్తూరు జిల్లా తిరుపతిలో డెల్టా ప్లస్ కేసు వెలుగు చూసింది.. ఏప్రిల్ నెలలోనే కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న బాధితుడు డెల్టా ప్లస్ వేరియంట్ బారినపడ్డాడు… ఇప్పటికే శ్యాంపిల్‌ను పుణులోని సీసీఎంబీకి అధికారులు పంపగా.. ఇవాళ అది డెల్టా ప్లస్ వేరియంట్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు వైద్యఆరోగ్య […]
సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు పెరగడంతో నెలక్రితం లాక్డౌన్ విధించించింది తెలంగాణ ప్రభుత్వం. నిత్యావసర సరుకుల కోసం కొంత సమయం మినహాయింపు తప్పా.. విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇచ్చింది. తాజాగా కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతుండడంతో.. లాక్డౌన్ ఎత్తేసింది ప్రభుత్వం. ఆల్ ఓపెన్ అంటూనే.. జులై ఒకటో తేదీ నుంచి విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందు కోసం విధి విధానాలను కూడా రూపొందించాలని విద్యాశాఖను ఆదేశించింది. […]
కరోనా కాలంలో చురుగ్గా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతలకు స్పష్టం చేశారు. గత కొంతకాలంగా హస్తిన వేదికగా రాజకీయాలు మారడంతో.. కాంగ్రెస్ కీలక భేటీ నిర్వహించింది. పార్టీ జనరల్ సెక్రటరీ, ఏఐసీసీ ఇంఛార్జులతో పార్టీ అధ్యక్షురాలు సొనియాగాంధీ వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. దేశంలో వ్యాక్సినేషన్ స్పీడందుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. టీకాపై జనాల్లో ఉన్న భయాన్ని తొలగించాలని.. వేస్టేజీని తగ్గించాలని అన్నారు. […]
కరోనాతో ఇప్పటికే అల్లాడిపోయిన దేశ ప్రజలను డెల్టా ప్లస్ వేరియంట్.. మరింత భయపెడుతోంది. దేశంలో ఈ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్ కారణంగానే మూడో వేవ్ ముంచుకొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నానాటికీ ప్రమాదకరంగా మారుతోంది డెల్టా ప్లస్..! ఇప్పుడు ఏకంగా ప్రాణాలను బలి తీసుకుంటోంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొవిడ్ సోకి మే 23న ప్రాణాలు కోల్పోయారు. ఆమె రక్తనమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా.. ఆమెకు డెల్టా ప్లస్ […]
బాసర దేవస్థానంలో జరిగిన అక్రమాలపై సర్కార్ చర్యలు చేపట్టింది. 2017 సంవత్సరంలో వివిధ రూపాల్లో జరిగిన అక్రమాలపై ఎన్టీవీ వరుస కథనాలు ప్రచారం చేసింది. అప్పటి నుంచి ఓవైపు దేవాదాయశాఖ, మరోవైపు ఏసీబీ అక్రమాలపై విచారణ చేపట్టింది. నలుగురు ఉద్యోగులపై వేటు వేసింది. అప్పటి బాసర ఏఈవో గంగాశ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ శైలేష్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సర్వీస్ నుంచి తొలగించారు. ఎలక్ట్రీషియన్ కాంతారావు, కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన రజనికుమారీలను […]
2019 ఆగష్టులో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రాష్ట్ర హోదాను రద్దుచేసి లడక్‌ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత మొదటి జాతీయ స్థాయి రాజకీయ చర్చ జరిగింది. ఈ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ ఒమర్ అబ్దుల్లాలు, గులాం నబీ ఆజాద్, మెహబూబా ముఫ్తిలతో పాటు బిజెపి నేత రవీంద్రరైనా నిర్మల్ సింగ్, సిపిఎం నాయకుడు ఎంఎల్ఎ యూసప్ తరగామి, ఆప్ […]
సంచలన ప్రకటనలకు వేదికగా మారింది రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో కొత్త సభ్యులు చేరారు. చమురు విభాగంలో ఈ సంస్థలో భారీ పెట్టుబడులు పెట్టిన సౌదీ అరేబియా సంస్థ ఆరామ్కో ఛైర్మన్ యాసిర్ అల్ రుమయాన్ రిలయన్స్ బోర్డులోకి వస్తున్నారు. రిలయన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ ఈ ప్రకటన చేశారు. బోర్డులోకి ఆరామ్ కో ఛైర్మన్ యాసిర్ అల్ రుమయాన్‌ను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆయన […]
ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై అవినీతి ఆరోపణలు కలకలం సృష్టించాయి.. ఇక, తనపై ఆరోపణలపై సీరియస్‌గా స్పందించారు మంత్రి అనిల్.. ఇసుక దుమారంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అఖిలపక్షం ఏర్పాటు చేశారు.. మంత్రి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి టిడిపి మినహా అన్ని పార్టీలు హాజరు కాగా.. రేపు భగత్ సింగ్ కాలనీ సమీపంలో ఉన్న పరివాహక ప్రాంతంలో అఖిలపక్షం సభ్యులు పర్యటించనున్నారు.. అయితే, అనుమతులు లేకుండా ఇసుకను తరలించిన మాట వాస్తవమేనని అఖిల […]
విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలనే పట్టుదలతో అడుగులు ముందుకు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరకు ఆ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడియన మంత్రి ఆదిమూలపు సురేష్.. సుప్రీంకోర్టులో పరీక్షలపై విచారణ జరిగిన విషయాన్ని వెల్లడించారు.. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటనకు 45 రోజుల సమయం పడుతుందన్న ఆయన.. కానీ, సుప్రీకోర్టు చెప్పిన విధంగా వచ్చే నెల 31 నాటికి పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం […]
అన్ని రంగాల్లోనూ మహిళ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్… మహిళా సాధికారత, సమానత్వం సాధించాలంటే, భిన్నత్వాన్ని, సమ్మిళిత సమాజాన్ని సాధించాలంటే మహిళా నాయకత్వాన్ని అన్ని దశలలోనూ పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమెన్ లీడర్స్ ఫోరమ్‌ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన గవర్నర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్పొరేట్ రంగంలో, అలాగే వివిధ వ్యవస్థలలో సీనియర్ పొజిషన్లో మహిళా నాయకత్వం చాలా తక్కువ ఉందని […]