భారత్‌లో కొత్త వేరియంట్..? మూడో దశతో ముప్పు పెరగనుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కేసులు పూర్తిగా అదుపులోకి రాకముందే.. మళ్లీ రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. దీంతో కొత్త ప్రమాదం పొంచిఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. దేశంలో మరో కొత్తరకం కరోనా వైరస్ సెప్టెంబర్ నెలలో వెలుగు చూస్తే.. అక్టోబర్-నవంబర్ మధ్య కాలంలో గరిష్ఠానికి చేరుకోవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. సెకండ్ వేవ్‌తో పోలిస్తే దాని తీవ్రత అతి స్వల్పంగానే ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశంలో కరోనా మూడో ముప్పు అనివార్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ తీవ్రతను తాజా అధ్యయనం మరోసారి అంచనా వేసింది. ఒకవేళ కొత్త వేరియంట్ వెలుగు చూడకపోతే పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది.
మరోవైపు.. కరోనా వైరస్‌లన్నింటినీ ఎదుర్కొనే వ్యాక్సిన్ రూపొందించే సమయం ఆసన్నమైందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ సహకరించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. వీటిని అభివృద్ధి చేయడంతో పాటు అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధకులు, సంస్థలు, అంతర్జాతీయ ఏజెన్సీలు కీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేసింది. దీని ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ఇతర మహమ్మారుల నుంచి రక్షించుకోవచ్చని అన్నారు. ఇక, కేరళలో కొవిడ్ కేసుల ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టాయి… గడిచిన 24గంటల వ్యవధిలో 1.17లక్షల శాంపిల్స్ పరీక్షించగా.. 19,622 కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 132 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 40.27లక్షలకు చేరగా.. మరణాల సంఖ్య 20,673కి పెరిగింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 16.74శాతంగా ఉన్నట్టు కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కొవిడ్ కేసుల్లో… సగం కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రం నుంచి వచ్చిన ప్రయాణికులు ఏడు రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ పూర్తయినా, ముందస్తు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయించుకున్నప్పటికీ క్వారంటైన్ పూర్తయిన ఏడో రోజు పరీక్షలు నిర్వహించనున్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!