గోల్డెన్ గర్ల్ అవనికి ఆనంద్ మహీంద్రా బంపరాఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే ఏడు పతకాలను తన ఖాతాలో వేసుకుంది భారత్.. ఇక, షూటింగ్‌లో స్వర్ణం సాధించి సత్తా చాటింది భారత మహిళా షూటర్ అవని లేఖరా.. దీంతో.. ఆమెకు బంపరాఫర్ ఇచ్చారు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన.. పలు అంశాలపై స్పందిస్తూ ఉంటారు.. ఇక, కొన్ని సార్లు గిఫ్ట్‌లు ఇస్తూ సర్‌ప్రైజ్ చేస్తుంటారు.. ఇప్పుడు గోల్డెన్ గర్ల్ అవని లేఖరాకు ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నవారికి తయారు చేయనున్న తమ తొలి ఎస్‌యూవీని బహూకరించనున్నట్టు ప్రకటించారు. భారత్‌కు గోల్డ్ మెడల్ అందించిన అవనిని ప్రత్యేకంగా అభినందించిన మహీంద్రా.. తన ప్రకటనతో ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.
మరోవైపు.. తన లాంటి ప్రత్యేక సామర్థ్యం ఉన్న వారికోసం భారతదేశంలో ప్రత్యేక ఎస్‌యూవీలను తయారు చేయమని భారత ఆటోమొబైల్ పరిశ్రమను అభ్యర్థించారు భారత పారాలింపిక్స్ కమిటీ అధ్యక్షులు దీపా మాలిక్. తనకు ఎస్‌యూవీ నడపడం అంటే చాలా ఇష్టమనీ, ఇలాంటి కార్లలో ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేయాలని మహీంద్రా, టాటా మోటార్స్, ఎంజీ ఇండియా లాంటి భారతీయ ఆటోమొబైల్ దిగ్గజాలను కోరారు. ఎవరైనా ప్రత్యేక సీట్‌లతో కూడిన ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకువస్తే, తప్పనిసరిగా కొనుగోలు చేస్తానని పేర్కొంటూ.. సోషల్ మీడియా వేదికగా వీడియో షేర్ చేశారు దీపా మాలిక్.. ఇప్పుడా ట్వీట్‌పై స్పందించిన మహీంద్ర.. ఈ సవాలును స్వీకరిస్తున్నాని.. వారికోసం ఎస్‌యూవీలను తయారీపై దృష్టి పెట్టాలని తన ఉద్యోగి వేలును కోరినట్టు తెలిపారు.. ఆ ట్వీట్‌లోలోనే.. తమ తొలి ఎస్‌యూవీని గోల్డెన్ గర్ల్ అవని లేఖరాకు గిఫ్ట్‌గా ఇవ్వాలనికుంటున్నానని పేర్కొన్నారు.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
A week ago @DeepaAthlete suggested that we develop SUV’s for those with disabilities. Like the one she uses in Tokyo.I requested my colleague Velu, who heads Development to rise to that challenge. Well, Velu, I’d like to dedicate & gift the first one you make to #AvaniLekhara https://t.co/J6arVWxgSA
— anand mahindra (@anandmahindra) August 30, 2021
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!