ఆగస్టు 31, మంగళవారం దినఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రాశివారికి ఈ రోజు దైవ కార్యక్రమాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు తప్పవు. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. దేనిమీదా శ్రద్ధ వహించలేరు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉండటం వల్ల పొదుపు సాధ్యంకాదు.
వృషభం : ఈ రోజు ఈ రాశివారిపై శకునాల ప్రభావం అధికంగా ఉంటుంది.. మీపై బంధువుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం అధికంగా ఉంటుంది. ఉద్యోగ, విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. ప్రముఖ సంస్థల షేర్ల కొనుగోళ్లు లాభిస్తాయి. చిట్స్, ఫైనాన్స్, రంగాల వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి తప్పదు.
Also Read
మిథునం : ఈ రోజు మీరు ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానం అందుతుంది. కోర్టు వాదోపవాదాల్లో ఫ్లీడర్ల విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ధనవ్యయం అధికమైన ఇబ్బందులు ఉండవు.
కర్కాటకం : ఈ రోజు మీరు వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఊహించని ఖర్చులు, చెల్లింపులు వల్ల ఇబ్బందులు తప్పవు. మీ కదలికలపై నిఘా ఉందన్న విషయాన్ని గమనించండి. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం.
సింహం : ఈ రోజు ఈ రాశివారు వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి. మీ వాక్చాతుర్యతో అందరినీ ఆకట్టుకుంటారు.
కన్య : ఈ రోజు మీరు ఎల్.ఐ.సి. బ్యాంకు డిపాజిట్లు సంబంధించిన సొమ్ము అందుకుంటారు. ఎదుటివారు మిమ్మలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా నిగ్రహించుకోవడం మంచిది. లక్ష్యసాధనంలో స్వల్ప ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా కష్టపడాలి.
తుల : ఈ రోజు మీకు గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానం అందుతుది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపార, వ్యవహారాల్లో నిర్మొహమాటంగా వ్యవహరించండి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృశ్చికం : ఈ రోజు ఈరాశిలోని వ్యవసాయ రంగాలవారికి ఎరువుల కొనుగోలులో చికాకులు తప్పవు. అద్దెలు, ఇతరాత్రా రావలసిన బకాయిల వసూలులో దూకుడుగా వ్యవహరించకండి. స్టాక్ మార్కెట రంగాల వారికి మిశ్రమ ఫలితం. సానుకూల ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారు ప్రయాణాలు, కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారాల్లో నష్టాలను కొంత వరకు భర్తీచేసుకోగలుగుతారు. గత అనుభవాలు గుర్తుచేసుకుంటారు..స్త్రీలతో మితంగా సంభాషించడం అన్ని విధాలా శ్రేయస్కరం.
మకరం : ఈరోజు ఈ రాశివారికి ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత అవసరం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తుల సమర్థత, అంకిత భావం అధికారులను ఆకట్టుకుంటాయి.
కుంభం : ఈ రోజు ఈ రాశివారికి బంధువులు, సోదరీ, సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ మాటకు ఇంటా బయటా గౌరవం లభిస్తుంది. ఏ వ్యక్తినీ తక్కువగా అంచనా వేయకండి. స్త్రీల పేరిట స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా సాగుతాయి.
మీనం : ఈ రోజు ఈరాశిలోని పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. గృహ మార్పుల కోసం యత్నాలు సాగిస్తారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!