Off The Record: శ్రీకాకుళం జిల్లా జనసేనలో అసంతృప్తి చాపకింద నీరులా విస్తరిస్తోందట. పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని కీలక నేతలు ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తమకు పార్టీ, ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావించిన నేతలు ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలతో అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతున్నారన్నది వాళ్ళ ఆవేదన. అధినేత పవన్ కల్యాణ్ పిలుపుతో రాజకీయాలలోని వచ్చిన […]
Off The Record: ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్ సొంత జిల్లాలో ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇప్పుడు పొలిటికల్ హాట్గా మారిపోయింది. నేను ఒకర్ని కెలకను, నన్ను కెలికితే ఊరోకోబోనంటూ సొంత పార్టీ నాయకులకే ఆయన సీరియస్గా హెచ్చరికలు చేయడం గురించి రకరకలా విశ్లేషణలు నడుస్తున్నాయి. మంత్రి హోదాలో ఉండి కూడా… ఇతర నియోజకవర్గాల్లో తాను వేలు పెట్టి రాజకీయాలు చేయడం లేదని, తన ఆలోచన అంతా కర్నూలు జిల్లా అభివృద్ధి మీదే ఉందన్నారాయన. కావాలని నన్ను […]
IPS Transfers: తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు జరిగాయి.. కీలక అధికారులను కూడా మారుస్తూ వచ్చింది ప్రభుత్వం.. తాజాగా మరో 20 మంది ఐపీఎస్ల బదిలీలు, పోస్టింగ్లు ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్.. 20 మంది ఐపీఎస్ల బదిలీ, పోస్టింగ్లు 1. HYD సౌత్ రేంజ్ అదనపు కమిషనర్గా తస్వీర్ ఇక్బాల్ నియామకం 2. HYD […]
Off The Record: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎంపిక వ్యవహారం జీడిపాకం సీరియల్లా సాగుతూనే ఉంది. చాలా రోజుల క్రితమే.. రామచంద్ర నాయక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది ఏఐసీసీ. ఇప్పుడంతా ఆయన్ని డిప్యూటీ స్పీకర్ అనే పిలుస్తున్నారుగానీ… ఎన్నిక మాత్రం జరగలేదు. అఫీషియల్ కన్ఫర్మేషన్ అవలేదు. విప్ గా ఉండే నాయక్ను డిప్యూటీ స్పీకర్ అభ్యర్ధిగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగాయి. ఈ సెషన్లో అయినా ఎన్నిక జరుగుతుందని అనుకున్నా… […]
సభకు ఎందుకు రావడం లేదు..? వైసీపీ ఎమ్మెల్యేల వివరణ కోరనున్న ఎథిక్స్ కమిటీ.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల హాజరుపై ప్రతీసారి చర్చ సాగుతూనే ఉంది.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు మొక్కుబడిగా ఒక్కరోజు మాత్రం అసెంబ్లీకి వచ్చి వెళ్లిపోతున్నారు.. ఆ తర్వాత సెషన్ మొత్తం సభ వైపు చూడడం లేదు.. అయితే, వైసీపీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెబుతున్నారు.. ఈ నేపథ్యంలో […]
Off The Record: కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆఫీస్ వ్యవహారాల గురించి ఇప్పుడు తెగ గుసగుసలాడేసుకుంటున్నారు నియోజకవర్గంలో. సప్త సముద్రాలు ఈదిన గజ ఈతగాడు పిల్ల కాలువలో పడి కాళ్ళు విరగ్గొట్టుకున్నట్టుంది ఆయనగారి వ్యవహారం అంటూ సెటైర్స్ వేసేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. ఇంతకీ.. మేటర్ ఏంటంటే….. ఈ ఎన్నారై టర్న్డ్ ఎమ్మెల్యే గెలిచాక గుడివాడలో ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. తాను అందుబాటులో లేని సమయంలో రకరకాల పనుల కోసం వచ్చే నియోజకవర్గ ప్రజలకు […]
Deputy CM Pawan Kalyan: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. రేపు రాత్రికి పిఠాపురం చేరుకోనున్న పవన్.. శుక్రవారం ఉదయం పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం పేరిట నిర్వహించనున్న ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానానికి చేరుకుని సంక్రాంతి సంబరాలను ప్రారంభిస్తారు. ఉదయం 11.30 గంటలకు నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు […]
Andhra Pradesh Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. ప్రస్తుతం పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం […]
Amaravati Land Pooling: కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది.. గతంలో సేకరించిన భూములతో పాటు.. ఇప్పుడు కొత్తగా మరిన్ని భూములు సేకరించేందుకు శ్రీకారం చుట్టారు.. ఇక, అమరావతి రాజధాని ప్రాంత రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ల్యాండ్ పూలింగ్ పథకంలో కొత్తగా భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు 1.5 లక్షల రూపాలయ వరకు రుణమాఫీ వర్తింపజేయనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. అయితే, ఈ మాఫీ నిన్నటి వరకూ ఉన్న వ్యవసాయ రుణాలకు […]
Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్, కార్పొరేషన్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, టైమ్లైన్స్పై కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సమావేశంలో భాగంగా కలెక్టర్లకు ముఖ్యంగా ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాల ప్రచురణపై డెడ్లైన్లు నిర్దేశించారు. జనవరి 12వ […]