కరోనా సమయంలో పీజీ విద్యార్థులకు వెసులుబాటు కల్పించింది ఉస్మానియా యూనివర్సిటీ… పీజీ పరీక్షలు రాసే విద్యార్థులు.. తమకు దగ్గర్లో ఉన్న జిల్లా కేంద్రంలో పరీక్ష రాసే అవకాశం ఇచ్చింది… విద్యార్థి తనకు ఏ సెంటర్ అందుబాటులో ఉందని భావిస్తున్నాడో… ఏ సెంటర్లో పరీక్ష రాయాలని అనుకుంటున్నాడో.. ముందే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.. ఒకవేళ ఒక సెంటర్ లో 20 మంది విద్యార్థులు ఉంటే ఆ సెంటర్ ను మార్చడం జరుగుతుందని ఓయూ తెలిపింది.. […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా కిందికి దిగుతున్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 917 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 10 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 1,006 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,23,510కు చేరగా.. రికవరీ కేసులు 6,06,461కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య […]
అమూల్ వినియోగదారులకు చేదు వార్త వినిపించింది… అమూల్‌కు చెందిన అన్ని రకాల పాల బ్రాండ్లపై లీటర్‌కు రూ.2 చెప్పున పెంచేసింది… పెరిగిన ధరలు రేపటి నుంచి అంటే జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.. అన్ని బ్రాండ్లపై పాలపై లీటర్‌కు రూ. 2 చొప్పున పెంచినట్టు గుజరాత్ సహకార మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) అధికారి ప్రకటించారు.. అయితే, ఉత్పత్తి వ్యయం పెరడమే ధరల పెరుగుదలకు కారణమని.. ఏడాదిన్నర తర్వాత పాల ధరలను పెంచాల్సి వచ్చిందని […]
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్‌కు కితాబు ఇచ్చింది అమెరికా… కరోనాతో పాటు తాజాగా.. భారత్‌లో వెలుగుచూసిన ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కూడా కోవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలింది. కోవాగ్జిన్‌పై టీకాలపై అధ్యయనం నిర్వహించిన అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్… ఎస్ఏఆర్ఎస్-సీవోవీ-2 ఆల్ఫా, డెల్టా వేరియంట్లను కోవాగ్జిన్ చాలా ప్రభావవంతంగా ఎదుర్కొంటుందని తేల్చింది.. ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరి నమూనాలను సేకరించి అధ్యయనం చేసిన ఎన్ఐహెచ్.. ఆల్ఫా […]
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది… ఈ భేటీలో పలు నిర్ణయాలకు ఆమోదం లభించింది… సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్నినాని.. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు… ఏపీ కేబినెట్ నిర్ణయాలు: వైఎస్సార్ జయంతి జులై 8వ తేదీన భారీ ఎత్తున రైతు దినోత్సవ కార్యక్రమం పార్లమెంట్ నియోజకవర్గానికో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో వెటర్నరీ అంబులెన్సుల […]
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం హీట్ పెంచుతోంది.. తెలంగాణ మంత్రుల కామెంట్లపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్… సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో జలవివాదంపై చర్చ జరిగింది… చుక్కునీరు కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేమని కేబినెట్ ప్రకటించింది. కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తెలంగాణ వ్యవహర శైలి కొంత కాలంగా చూస్తున్నాం.. ఏపీకి కేటాయింపులకు లోబడే ప్రాజెక్టుల నిర్మాణం […]
కుట్రలకు కేరాఫ్ కేసీఆర్ అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్… జమ్మికుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నడూ లేని పద్ధతిలో అనేక వర్గాల ప్రజలపై కొత్తగా సీఎంకు ప్రేమ పుట్టుకు వస్తుందని సెటైర్లు వేశారు.. పేదలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించాలని కోరాను.. విద్య విషయంలో కొంత పురోగతి ఉన్న వైద్యం విషయంలో లేదన్నారు.. అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని.. నాలాంటి వారికి పేరు వస్తుందని పట్టించుకున్న పాపాన […]
ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో.. ఆ బస్సులో ఉన్న ఓ మహిళ మృతిచెందడంతో పాటు.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అచ్యంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు… కల్వకుర్తి నుంచి అచ్చంపేట వైపు వెళ్లే సమయంలో ప్రమాదానికి గురైంది.. బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో.. బస్సులో ఉన్న నర్సమ్మ (50)అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందారు.. మరో […]
తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో చెట్లు నాటడంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.. చెట్లు నాటడమే కాదు.. వాటి పరిరక్షణ బాధ్యతను కూడా సీరియస్‌గా తీసుకున్నారు.. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరు విడతలుగా హరితహారం నిర్వహించగా… ఏడో విడతకు సిద్ధం అవుతోంది ప్రభుత్వం… ఈసారి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 కోట్లు మొక్కలు… నాటేందుకు ప్లాన్ చేస్తున్నారు.. 2015లో ప్రారంభమైంది హరితహారం 230 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా నిర్దేశించుకుంది.. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం నర్సరీల సంఖ్య 15,241గా […]
మాన్సాస్ ట్రస్ట్, ఇతర విషయాల్లో టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తూనే ఉంది… ఇక, మరోసారి అశోక్ గజపతిరాజుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. సంచయిత గజపతిపై అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు చాలా అనాగరికం… అలాంటి అనాగరికుడుని రాజుగా ఎలా గుర్తిస్తామన్న ఆయన.. కూలింగ్ గ్లాసులలో లోకాన్ని చూసే వాడు ప్రజా సమస్యలు ఎలా తెలుసు కుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పుణ్యమా […]