కరోనా కట్టడి చర్యల కోసం కేంద్రం… 6 రాష్ట్రాలకు మల్టీ డిసిప్లినరీ బృందాలను పంపినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తెలిపింది. కేరళ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ రాష్ట్రాలకు ఈ బృందాలు వెళ్లాయి. కరోనా కట్టడిని తీసుకుంటున్న చర్యలను ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. ముఖ్యంగా నిఘా, కరోనా నిరోధక చర్యలు, పరీక్షలు, కోవిడ్ నిబంధనావళి అమలు, ఆసుపత్రి పడకలు, అంబులెన్స్, వెంటిలేటర్లు, మెడికల్ ఆక్సిజన్ వంటి సౌకర్యాలను సమీక్షిస్తారని నీతి […]
దేశంలో అడ్డూ-అదుపూ లేకుండా పెరిగిపోతున్న ఇంధన ధరలపై రైతు సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ ఈ నెల 8న దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా నిరసన తెలపనున్నారు రైతులు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిరసన ప్రదర్శనలు జరుగుతాయి. ఖాళీ గ్యాస్ సిలెండర్లతో నిరసన తెలపాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన సింఘూ […]
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైన జల వివాదం.. చినికి చినికి గాలివానగా మారుతూనే ఉంది.. ప్రధానికి, కేంద్రానికి, కృష్ణా రివర్ బోర్డుకు తాజాగా ఏపీ లేఖలు రాయడంపై భగ్గుమంటున్నారు తెలంగాణ మంత్రులు, నేతలు.. ఆ విమర్శలపై స్పందించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తెలంగాణ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోయారు.. అక్కడా తెలుగువాళ్లున్నారు… ఇక్కడా తెలుగువాళ్లున్నారని.. బూతులు తిట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ […]
ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ రాజీనామా చేశారు.. గత మార్చిలో సీఎంగా ప్రమాణం చేసిన రావత్.. సెప్టెంబర్‌లోగా అసెంబ్లీ ఎన్నిక కావాల్సి ఉంది… ఆయన ప్రస్తుతం లోక్‌సభ సభ్యులు.. అయితే, కరోనా కారణంగా సెప్టెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.. మరోవైపు ఉత్తారాఖండ్ అసెంబ్లీలోకి వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగాల్సి ఉంది.. అసెంబ్లీకి ఏడాదిలో ఎన్నికలు ఉంటే.. ఉప ఎన్నిక నిర్వహించరాదనే నిబంధన ఉంది.. దీంతో.. రావత్.. అసెంబ్లీకి ఎన్నికయ్యే […]
నాడు- నేడు పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాల నిర్వహణపై గైడ్ లైన్స్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం… ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాల్లో గత స్థితి, ఇప్పటి పరిస్థితుల ఫోటోలను ప్రదర్శించాలని సూచించారు.. దీని కోసం పీవీసీ బ్యానర్లు వినియోగించవద్దని స్పష్టం చేసింది సర్కార్.. పాఠశాల, ఉన్నత విద్యాశాఖ, వైద్యారోగ్యశాఖ, సాంఘిక సంక్షేమం, పురపాలక, మహిళా సంక్షేమం తదితర శాఖలు అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాల నిర్వహణకు గైడ్ లైన్స్ విడుదల చేశారు.. […]
భారత దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు తెలియనివారుండరు.. ఆయన వ్యూహాలతో ప్రధాని నరేంద్ర మోడీ నుంచి.. మొన్నటి మొన్న పశ్చిమ బెంగాల్లో దీదీ వరకు ఎంతో మంది పీఠాన్ని ఎక్కారు.. నితీష్ కుమార్, వైఎస్ జగన్, స్టాలిన్.. ఇలా చాలా మందికే వ్యూహ రచన చేశారు పీకే.. ఆయన ఎక్కడ అడుగు పెట్టినా.. తన టీమ్‌ను రంగంలోకి దింపి పనిమొదలు పెడతారు. అయితే, బెంగాల్ ఫలితాల తర్వాత తన వృత్తిని వదిలేస్తున్నట్టు సంచలన […]
కరోనా మహమ్మారిపై పోరాటంలో విజయం సాధించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం.. దీంతో.. ప్రభుత్వం వేగంగా వ్యాక్సిన్ పూర్తి చేసే విధంగా ముందుకు సాగుతోంది.. ఇప్పటికీ కొన్ని అపోహలు వెంటాడుతూనే ఉన్నాయి.. అందులో గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్‌పై రకరకాల ప్రచారలు జరిగాయి.. అన్నింటికీ చెక్ పెడుతూ… గర్భిణీ స్త్రీలు కూడా టీకాకు అర్హులేనని స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.. రోగనిరోధకతపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (ఎన్‌టిఐజి) సిఫారసులను అంగీకరించిన ఆరోగ్య మంత్రిత్వ […]
తెలంగాణలో సుదీర్ఘ కసరత్తు తర్వాత పీసీసీ కమిటీలను ప్రకటించింది ఏఐసీసీ.. దీనిపై కొన్ని ఆరోపణలు, విమర్శలు ఉన్నా.. కొత్తగా తెలంగాణ పీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డి ఈ నెల 7వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఈ లోపుగానే గాంధీ భవన్లో వాస్తు మార్పులు జరగాలని నిర్ణయించారు.. దీంతో.. రంగ ప్రవేశం చేసిన వాస్తు నిపుణులు, వేదపండితులు.. గాంధీ భవన్‌ను పరిశీలించి కొన్ని మార్పులు చేసినట్టుగా చెబుతున్నారు.. గాంధీభవన్‌లో ఎంట్రీ పాయింట్‌ను కొత్త కమిటీ నేతలు మార్చాలని నిర్ణయానికి […]
ఆంధ్రప్రదేశ్‌లోని మండల పరిషత్, జిల్లా పరిషతుల్లో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించింది ప్రభుత్వం… గతంలో ప్రకటించిన ప్రత్యేక అధికారుల పాలన ఈ నెల 4వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో.. మరో ఆరు నెలల ప్రత్యేక పాలన కొనసాగుతుందంటూ వెల్లడించింది ఏపీ సర్కార్.. ఏప్రిల్ 8న మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు పూర్తయినప్పటికీ, హైకోర్టు ఆదేశం కారణంగా ఓట్ల లెక్కింపు చేపట్టలేదు. తాజాగా తదుపరి విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది […]
భూ లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్.. ఆ తర్వాత టీఆర్ఎస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇక, ఆయన మంత్రిగా ఉన్న సమయంలో.. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు.. గత ఆరేళ్లుగా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా కొనసాగిన ఆయన.. తాజా పరిణామాల తర్వాత ఆ పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే, ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు అవినీతి నిరోధక […]