తెలంగాణలో జోనల్ వ్యవస్థలో మార్పులకు ఈ ఏడాది ఏప్రిల్ 19న రాష్ట్రపతి ఆమోదం తెలియజేయగా.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది.. తద్వారా జోనల్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేసింది.. ఇప్పటి వరకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినందున ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఈ కొత్త జోనల్ విధానం వర్తింపజేయనుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలకు తోడు స్థానికులకు ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం జోనల్ వ్యవస్థలో మార్పులుచేసింది. […]
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోన్న సమయంలో.. చర్చలకు సిద్ధమైంది భారతీయ జనతా పార్టీ.. ఎల్లుండి కర్నూలులో రాయలసీమ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. రాయలసీమ పదాధికారులు, ఎనిమిది జిల్లాల పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. రాయలసీల ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడికాలువ, గుండేగుల, వేదవతి ప్రాజెక్టులపై బీజేపీ నేతలు చర్చించనున్నారు.. ప్రాజెక్టుల అంశంలో భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా […]
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంలో మాటల యుద్ధం రోజురోజుకీ తారస్థాయికి చేరుతోంది… ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి… ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం లేఖ రాయడంపై మండిపడ్డ ఆయన.. తండ్రిని మించిన దుర్మార్గుడు వైఎస్ జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. సమస్యను సృష్టించిందే ఆంధ్ర సర్కార్ అని విమర్శించిన ఆయన.. హైదరాబాద్ నీటి అవసరాలు పట్టవా? కోర్టుకిచ్చిన మాటను తప్పిందేవరు.? సర్వేల పేరిట నిర్మాణాలు […]
భారత్ బయోటెక్… బ్రెజిల్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం… ఆ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందంలో బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. కోవాగ్జిన్ సరఫరాలో అవినీతి జరిగిందనే కోణంలో పార్లమెంటరీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ దృష్టి సారించింది. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో ప్రత్యేక ఆసక్తి కనబర్చారని, సన్నిహితులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. అమెరికాకు చెందిన ఫైజర్, చైనాకు చెందిన సినోవాక్‌ను కాదని… బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థల అనుమతి లేని… […]
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్.. ఆయా రంగాల వారీగా పరిశ్రమలు మరియు ఐటీ శాఖ విభాగాధిపతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలైన ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో అనేక కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని, ఈ మేరకు పలు కంపెనీలు తమ ఆసక్తిని వివిధ శాఖల అధికారులకు […]
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తొలగించి… ఆ బాధ్యతల్ని సంచయిత గజపతిరాజుకు అప్పగించింది ఏపీ సర్కార్. అయితే, దీనిపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన సంచయిత నియామకానికి సంబంధించిన జీవోను కొట్టి వేసింది. దీంతో మాన్సాస్ ట్రస్ట్‌తో పాటు సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త బాధ్యతల్ని తిరిగి చేపట్టారు అశోక్ గజపతిరాజు. అయితే, ఈ వివాదానికి అక్కడితో తెరపడలేదు. విశాఖలో రాష్ట్ర […]
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విద్యార్థుల కోసం స్టూడెంట్ క్రెడిట్ కార్డు స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ప్రకటించినందుకు ఆనందపడుతున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. బెంగాలీ యువతను స్వయం సమృద్ధి చేయాలన్న దీక్షతో విద్యార్థులకు రుణాలు ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. క్రెడిట్ కార్డు స్కీమ్ కింద విద్యార్థులకు సుమారు పది లక్షల వరకు రుణం ఇవ్వనున్నారు. అయితే ఆ రుణంపై వార్షికంగా అతి స్వల్ప స్థాయిలో వడ్డీ వసూల్ చేయనున్నట్లు సీఎం మమతా తెలిపారు. […]
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 1.22 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి బీమా పరిధిని కేబినెట్ ఆమోదించినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. అలాగే, 3.03 లక్షల కోట్ల రూపాయల విలువైన సంస్కరణ-ఆధారిత, ఫలిత-అనుసంధాన పవర్ డిస్కం పథకానికి కూడా కేబినెట్ ఆమోదించిందన్నారు. […]
ఏపీ, తెలంగాణ మధ్య జల జగడం మరింత ముదురుతూనే ఉంది.. తాజాగా, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి, తెలంగాణలో ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించగా.. ఏపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదన్న ఆయన.. నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తి మా హక్కు.. ఇది తెలంగాణ, ఇక్కడ కేసీఆర్ ఉన్నారన్న ఆయన.. […]