పాకిస్థాన్‌లో మరోసారి దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు.. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఇవాళ ఆత్మాహుతి దాడి జరిగింది… ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రగాయాలపాలైన స్థానిక మీడియా పేర్కొంది… ఇక, ఈ దాడి తమపనేనంటూ తెహరీక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.. ఆత్మాహుతి దాడిపై మీడియాతో మాట్లాడిన క్వెట్టా డిప్యూటీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ అజహర్ అక్రమ్.. క్వెట్టాలోని మస్టుంగ్ రోడ్డులో ఉన్న ఫ్రాంటియర్ కార్ప్స్ చెక్‌పోస్ట్‌పై ఆత్మాహుతి దాడి జరిగిందని.. దాడిలో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు.. మరో 20 మంది తీవ్రగాయాలపాలుకాగా.. వారిలో 18 మంది ఫ్రాంటియర్ కార్ప్స్ సెక్యూరిటీ సిబ్బందేనని తెలిపారు.. అయితే, పేలుళ్లు జరిగిన ప్రాంతం.. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు దగ్గరల్లో ఉంది.