తను ఇచ్చిన ఆర్డర్లో నచ్చిన ఐటం రాకపోవడంతో మొదలైన గొడవ.. చివరకు హోటల్ యజమానిపై దాడి, హోటల్ ధ్వంసానికి దారి తీసింది.. ఈ ఘటన తమిళనాడులోని అంబూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపత్తూర్ జిల్లాలోని అంబూర్‌లో మొహమ్మద్ సర్ధార్‌కి చెందిన స్టార్ బిర్యానీ సెంటర్ ఉంది… ఆ హోటల్‌కు వెళ్లిన అన్నాడీఎంకే, కాంగ్రెస్ నేతలు… భోజనం ఆర్డర్ ఇచ్చారు.. అయితే, అందులో రావాల్సిన సేమియా ఫ్రై రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన […]
కృష్ణానది యాజమాన్య బోర్డు కమిటీ.. రేపటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పరిశీలన వాయిదా పడింది… నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు బుధవారం రోజు కేఆర్ఎంబీ కమిటీ రాయలసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించాల్సి ఉంది.. అయితే, మంగళవారం సాయంత్రం వరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో… పరిశీలన వాయిదా వేశారు.. ఇక, జూలై 3వ తేదీన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్తామని కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం ఇచ్చింది […]
సింహాచలం భూముల్లో జరిగిన అక్రమాలపై చర్యలు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సింహాచలం దేవస్థానానికి గతంలో ఈవోగా పని చేసిన రామచంద్ర మోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు దేవదాయ శాఖ కమిషనర్.. సింహాచలం దేవస్థానం రికార్డుల్లో నుంచి పెద్ద ఎత్తున భూములను తప్పించారని రామచంద్రమోహన్‌పై అభియోగాలున్నాయి… ప్రస్తుతం దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్-2గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామచంద్రమోహన్.. సర్కార్‌కు సరెండర్ చేశారు.. అయితే, ఈ వ్యవహారంలో విచారణ పారదర్శకంగా జరిగేందుకే రామచంద్రమోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేసినట్టు చెబుతున్నారు. […]
కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోగా… కొత్త వేరియంట్లు.. డెల్టా, డెల్టా ప్లస్ కలవర పెడుతున్నాయి.. ఈ నేపథ్యంలో భారత్ నుంచి రాకపోకలపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది ఫీలిప్పైన్స్.. ఇప్పటికే చాలా దేశాలు భారత విమానాలపై బ్యాన్ విధించగా.. ఇప్పటికే భారత్ నుంచి రాకపోకలపై ఉన్న నిషేధాన్ని జులై 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది ఫీలిప్పైన్స్.. ఇక, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఒమన్, యూఏఈ దేశాలపై కూడా ఈ నిషేధ ఆంక్షలు […]
జూన్ రేపటితో ముగిసిపోనుంది.. ఎల్లుండి జులైలోకి ఎంట్రీ అవుతున్నాం.. అంతే కాదు.. కొత్త బాదుడు కూడా షురూ కాబోతోంది… దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త ఛార్జీలను వడ్డించేందుకు సిద్ధమైంది.. ఏటీఎం, బ్యాంకు బ్రాంచ్‌ల ద్వారా చేసే నగదు విత్‌డ్రాలపై సేవా రుసుములను సవరిస్తూ నిర్ణయిం తీసుకుంది ఎస్బీఐ… చెక్‌బుక్, నగదు బదిలీ, ఇతర ఆర్థికేతర లావాదేవీలకు కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి.. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్‌బీడి) […]
కరోనా ఫస్ట్ వేవ్ కంటే.. సెకండ్ వేవ్‌లో రికార్డుస్థాయిలో కేసులు వెలుగు చూశాయి.. పెద్ద సంఖ్యలో కోవిడ్ బాధితులు ప్రాణాలు పోయాయి.. అయితే, క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టినా.. ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చింది లేదు.. కానీ, కేసులు తగ్గుతుండడంతో.. లాక్డౌన్ నుంచి అన్‌లాక్‌కు వెళ్లిపోతున్నాయి రాష్ట్రాలు.. ఈ నేపథ్యంలో.. కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్.. కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించిన ఆయన.. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం […]
ఢిల్లీలో వరుసగా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇతర రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెట్టింది.. వచ్చే ఏడాది పంజాబాద్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే సిద్ధం అవుతోంది.. తాము అధికారంలోకి వస్తే.. ఏం చేస్తామనేది హామీ కూడా ఇస్తున్నారు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్… పంజాబ్ ఎన్నికల్లో తాము గెలిస్తే రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న విద్యుత్ […]
కరోనా సమయంలో విద్యార్థుల తల్లిదండ్రుల ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ స్కూళ్లు.. దీనిపై రకరకాల ఫిర్యాదులు అందగా… గతంలో ఉన్న ఫీజులు మాత్రమే.. అది కూడా కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది సర్కార్.. దీనిపై జీవో నంబర్ 75ని విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.. అయితే, అన్ని స్కూళ్లు తమ ఫీజుల వివరాలను వెబ్సైట్లో పెట్టాలని స్పష్టం చేశారు స్కూల్ ఎడ్యుకేషన్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయ లక్ష్మి… […]
తెలంగాణ మళ్లీ కరోనా కేసులు పెరిగాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 987 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఏడుగురు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 1,362 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,22,593కు చేరుకోగా.. రికవరీ కేసులు 6,05,455కు పెరిగాయి… ఇప్పటి వరకు కోవిడ్‌తో 3,651 మంది మృతిచెందారు.. కరోనా […]