పార్లమెంట్ సమావేశాలలో విపక్ష పార్టీల ఉమ్మడి వ్యూహం ఖరారు చేసేందుకు ఇవాళ ఉదయం రాహుల్ గాంధీ అధ్యక్షత సమావేశం అయ్యారు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు… తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ.. ఎస్పీ, సీపీఎం, ఆమ్ఆద్మీ, సీపీఐ, ఇలా 14 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వంపై పోరాటం చేసే విధంగా ఉమ్మడి వ్యూహాన్ని రచించేలా సమాలోచనలు జరిపారు. అంతేగాక, కేంద్రం తీరుకు నిరసనగా పార్లమెంట్ బయట […]
వడ్డీ రేట్లపై ప్రకటన చేశారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. ప్రస్తుతం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు.. ప్రస్తుతం రెపో రేటు 4 శాతం ఉండగా, రివర్స్ రెపో రేటు 3.5 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం 5.7 శాతం పరిధిలో ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఆర్బీఐ రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్ద ఉంచుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో […]
కర్ణాటక మాజీ మంత్రులను ఈడీ కేసులు వెంటాడుతున్నాయి… బెంగళూరులోని శివాజీనగర కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రోషన్ బేగ్ ఇంటిపై రైడ్ చేశారు ఈడీ అధికారులు.. కర్ణాటకలో గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన.. వేల కోట్ల రూపాయల ఐఎంఏ స్కామ్ కేసులో రూ. 400 కోట్లు నొక్కేసినట్టు ఆరోపణలున్నాయి… దీంతో.. రోషన్ బేగ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఆయన ఇంటి నుంచి విలువైన పత్రాలు, డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.. ఐఏంఏ స్కామ్ కేసులో […]
తెలంగాణకు గత మూడేళ్లలో 7 కొత్త జాతీయ రహదారులు ప్రకటించినట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తెలంగాణకు గత మూడేళ్ల కాలంలో కొత్తగా మంజూరైన జాతీయ రహదారుల వివరాలతోపాటు రహదారుల నిర్మాణంలో భూ సేకరణ సమస్య ఏర్పడితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటనే అంశంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇవాళ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు నితిన్ గడ్కరీ. 2020 జూన్ 29న 90 కిలోమీటర్ల మేరకు […]
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్… ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.. ఇవాళ ఓబీసీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ సభ్యులతో కలిసి ప్రధాని చెంతకు వెళ్లారు బండి సంజయ్.. జాతీయస్థాయి వైద్య విద్యా కోర్సుల్లో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొంటూ ప్రధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గత 40 ఏళ్లలో ఏ ప్రభుత్వం తీసుకోని సాహసోపేత […]
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు రాహుల్ గాంధీ… ఈ నెల 11న ఏపీ కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలు జరగనున్నాయి.. 11 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి విడివిడిగా ఏపీ సీనియర్ నేతలతో ముఖాముఖి సమాలోచనలు జరపనున్నారు రాహుల్ గాంధీ.. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి రాష్ట్ర నేతలకు పిలుపు అందింది.. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ పలు కీలక మార్పులు చేర్పులు జరగనున్నాయని తెలుస్తోంది.. పీసీసీ […]
వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలుపై కేబినెట్ సబ్ కమిటీ దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర సర్వే, భూయజమానులకు యాజమాన్య హక్కు కార్డుల జారీ తదితర అంశాలపై మంత్రుల కమిటీ అధికారులతో చర్చించింది. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వంద గ్రామాల్లో గ్రామకంఠం పరిధిలో అర్హులైన వారికి భూయాజమాన్య హక్కుతో కూడిన కార్డులను జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు మంత్రుల […]
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మధ్యప్రదేశ్లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. కోత్రా గ్రామంలో కొంత మంది ఇంటి పైకప్పుపై ఉన్నారనే సమాచారంతో.. వారిని తీసుకొచ్చేందుకు మంత్రి నరోత్తమ్ మిశ్రా.. బోటుపై అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో బోటుకు అడ్డుగా చెట్టుకూలిపోవడంతో.. ఆయన చిక్కుకుపోయారు. ఈ సమయంలో తమను రక్షించాలంటూ అధికారులకు మెసేజ్లు పెట్టారు. […]
2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల సంఘం.. ఆగస్టు 9 నుంచి 31వ తేదీ వరకు ముందస్తు కార్యక్రమాలు. ఇంటింటి సర్వే, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ కొనసాగనుంది.. 2021 నవంబర్ 1న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ ఉంటుంది.. నవంబర్ నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులను స్వీకరించనున్నారు.. డిసెంబర్ 20 వరకు అభ్యంతరాలు, వినతులు పరిష్కరించనున్నారు.. 2022 జనవరి 1 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ చేయనున్నారు.. 2022 జనవరి 5న ఓటర్ల […]